ఓజి ఫస్ట్ సింగిల్‌పై తమన్ అప్డేట్
ఇదిలా ఉంటే ఓజి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎలా అయితే వెయిట్ చేస్తున్నారో, పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఓజి మేకర్స్ కూడా అలానే వెయిట్ చేస్తున్నారు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. వాటిలో ఒకటి హరిహర వీరమల్లు, రెండోది ఓజి. ఈ సినిమాలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ లేకపోయినా సినిమాలపై హైప్ మాత్రం నెక్ట్స్ లెవెల్ లో ఉంది. ఈ రెండు సినిమాల్లో ముందుగా రిలీజయ్యేది హరిహర వీరమల్లు అని తెలిసినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఓజి గురించే ఎక్కువ ఆలోచిస్తూ, దాని అప్డేట్స్ గురించి అడుగుతున్నారు.
ఇదిలా ఉంటే ఓజి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎలా అయితే వెయిట్ చేస్తున్నారో, పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఓజి మేకర్స్ కూడా అలానే వెయిట్ చేస్తున్నారు. పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ ఓజి గురించి మాట్లాడాడు.
ఈ సందర్భంగా ఓజి మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ పై క్లారిటీ ఇచ్చాడు తమన్. ఫైర్ స్టార్మ్ పేరుతో రానున్న మొదటి పాట ఇప్పటికే రెడీ అయిందని, కోలీవుడ్ హీరో శింబు ఈ పాటను పాడాడని తెలిపాడు. ఓజి మూవీ షూటింగ్ తిరిగి స్టార్ట్ అయిన తర్వాత ఈ ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్టు చెప్పిన తమన్, ఆ సాంగ్ చాలా బాగా వచ్చిందని, ఆల్రెడీ టీజర్ లో చూపించిన చిన్న బిట్ సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందేనన్నాడు తమన్.
ఇప్పటికే ఎక్కువ భాగం షూటింగ్ ఫినిష్ చేసిన ఓజి మేకర్స్, పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే దాన్ని బట్టి కొత్త షెడ్యూల్ ను ప్లాన్ చేయాలని ఎదురుచూస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమాకు కూడా పవన్ కొన్ని రోజులు కేటాయిస్తే షూటింగ్ ను పూర్తి చేయొచ్చని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. కానీ పవన్ ప్రస్తుతం అటు రాజకీయాల్లోనూ, ఇటు ఫ్యామిలీ కమిట్‌మెంట్స్ తో చాలా బిజీగా ఉన్నాడు. కాబట్టి షూటింగులు తిరిగి మొదలవడానికి ఎంత లేదన్నా టైమ్ పట్టేట్టుంది.
కాబట్టి తమన్ చెప్పినట్టు ఓజి షూటింగ్ స్టార్ట్ చేశాక సాంగ్ ను రిలీజ్ చేస్తేనే సినిమా బజ్ కు అది ఉపయోగపడే ఛాన్సుంది. అలా కాదని, సాంగ్ రెడీ అయింది కదా అని రిలీజ్ చేసేస్తే పాట ఎంత బావున్నా ఆ టైమ్ కు ఫ్రెష్ గా అనిపించదు. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఓజిని నిర్మిస్తోంది.