ఓజీ ప్రకంపనలు.. ప్రిమియర్లతోనే బ్రేక్ ఈవెన్
ప్రిమియర్స్ కూడా కలిపితే లెక్క 3 మిలియన్ డాలర్లకు మార్కును టచ్ చేేసేసింది. అంటే ప్రిమియర్ డేకే వసూళ్లు పాతిక కోట్లను చేరిపోయాయి అన్నమాట.;
భారీ చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చినా సరే, బ్రేక్ ఈవెన్ కావాలంటే కొంత సమయం పడుతుంది. వారం పది రోజుల తర్వాత కానీ బయ్యర్లు సేఫ్ జోన్లోకి రారు. కానీ ‘ఓజీ’ సినిమా ఒక డిస్ట్రిబ్యూటర్‌ను కేవలం తొలి రోజుకే బ్రేక్ ఈవెన్‌కు తీసుకురావడం విశేషం. ఈ చిత్రాన్ని యుఎస్‌లో డిస్ట్రిబ్యూట్ చేసింది ప్రత్యంగార సంస్థ. ఐతే సినిమా ఆరంభ దశలో ఉండగానే, రెండేళ్ల ముందు రూ.12 కోట్లకు రేటు కుదిరింది. పవన్ గత చిత్రాల పెర్ఫామెన్స్‌ను బట్టి ఆ రేటు ఫిక్స్ అయింది.
ఐతే ‘ఓజీ’ టీజర్ వచ్చాక హైప్ వేరే లెవెల్‌కు వెళ్లింది. రిలీజ్ టైంకి అంచనాల తారా స్థాయికి చేరుకున్నాయి. దీంతో బ్రేక్ ఈవెన్ చాలా చిన్న విషయం అయిపోయింది. కేవలం ప్రి సేల్స్‌తోనే ఈ సినిమా 2 మిలియన్ మార్కును దాటేయడం విశేషం. ప్రిమియర్స్ కూడా కలిపితే లెక్క 3 మిలియన్ డాలర్లకు మార్కును టచ్ చేేసేసింది. అంటే ప్రిమియర్ డేకే వసూళ్లు పాతిక కోట్లను చేరిపోయాయి అన్నమాట. అందులో షేర్ సగమే కాబట్టి సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయినట్లే.
కానీ యుఎస్ డిస్ట్రిబ్యూటర్ లెక్క వేరుగా ఉంది. చాలా ముందుగా డీల్ జరగడం వల్ల వడ్డీల లెక్కలు కూడా కలుస్తున్నాయి. దీంతో పాటు పబ్లిసిటీ, కంటెంట్ డిలే వల్ల పెరిగిన ఖర్చులు, క్యాన్సిల్ అయిన షోల తాలూకు నష్టం.. ఇవన్నీ లెక్కగట్టి టార్గెట్ కొంచెం పెద్దగానే పెట్టుకున్నారు. అలా చూసినా వీకెండ్లోనే సినిమా లాభాల బాట పట్టడం ఖాయం. తొలి వారాంతంలోనే ‘ఓజీ’ 5 మిలియన్ మార్కును టచ్ చేయడం లాంఛనమే. పవన్‌కు ఇదే తొలి 5 మిలియన్ డాలర్ల మూవీ కావడం విశేషం.