• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అల్ట్రా స్టైలిష్ లుక్‌లో...

అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ఎన్టీఆర్​.. కిర్రాక్!

| తాజాగా ఇప్పుడు మరోసారి సేమ్ అదే డ్రెస్​లో దిగిన ఫొటోషూట్​ను బయటకు వచ్చింది. మళ్లీ అదే రాయల్ లుక్​లో బ్లాక్ కలర్ ప్యాంట్, జాకెట్ లోపల షర్ట్, చేతికి వాచ్​.. అల్ట్రా సూపర్ స్టైలిష్​గా ఉన్నారు.

By - Tupaki Desk
Update: 2023-09-23 17:26 GMT

మరోసారి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అభిమానుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఆయన కొత్త ఫొటోషూట్ సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత సినిమాల‌కు ఏడాదికిపైగా గ్యాప్ ఇచ్చిన తారక్​.. ప్ర‌స్తుతం దేవ‌ర‌ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్​పై పూర్తి ఫోక‌స్ పెడుతూనే మరోవైపు అడ‌పాద‌డ‌పా యాడ్స్ షూటింగ్‌లలోనూ పాల్గొంటున్నారు.


రీసెంట్​గా ఎన్టీఆర్ దుబాయ్​కు వెళ్లిన విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా సెప్టెంబరు 15, 16 తేదీల్లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా 2023) వేడుకల్లో ఆయన పాల్గొని సందడి చేశారు. ఆర్​ఆర్​ఆర్​ చిత్రానికి గానూ బెస్ట్ యాక్టర్ అవార్డును సొంతం చేసుకున్నారు. అక్కడ కూడా స్టేజ్​పై మోస్ట్ స్టైలిష్ లుక్​లో కనిపించి ఆ ఈవెంట్​కే స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారు. టాప్​ టు బాటమ్ బ్లాక్ కలర్ సూట్​లో రాయల్ లుక్​లో కనిపించారు. రీసెంట్​గానే హైదరాబాద్​ తిరిగి వచ్చారు.


తాజాగా ఇప్పుడు మరోసారి సేమ్ అదే డ్రెస్​లో దిగిన ఫొటోషూట్​ను బయటకు వచ్చింది. మళ్లీ అదే రాయల్ లుక్​లో బ్లాక్ కలర్ ప్యాంట్, జాకెట్ లోపల షర్ట్, చేతికి వాచ్​.. అల్ట్రా సూపర్ స్టైలిష్​గా ఉన్నారు. ముఖంలో.. అసలు ఆయన మొత్తం లుక్​ను చూస్తుంటే నిలువెత్తు రాజసం ఒట్టి పడుతోంది. ఒక ఫొటోలు ఆయన నిల్చొని కనిపించగా.. రెండో పిక్​లో కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చొని కనిపించారు.

ప్రస్తుతం ఈ లుక్స్​ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులను బాగా ఆక్టటుకుంటున్నాయి. ఫ్యాన్స్ వాటికి లైక్స్​, కామెంట్స్ పెడుతూ తెగ షేర్ చేస్తున్నారు. వాటిని చూసి మురిసిపోతున్నారు. కాగా ప్రస్తుతం నటిస్తున్న దేవ‌ర సినిమాకు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స‌ముద్ర తీర ప్రాంత ప్ర‌జ‌లకు అండ‌గా నిలిచే ఓ యోధుడి పాత్ర‌లో ఆయన కనిపించనున్నారు.

సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీక‌పూర్ న‌టిస్తోంది. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది.

Tags:    
  • Tollywood 
  • Ntr 
  • Devara 
  • Deavarmovie 
  • Ultrastylish 
  • Stylishlooks 
  • Photoshoot 
  • Siimaawards 
  • Stylish 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS