దేవర2 విషయంలో అనుమానాలక్కర్లేదు
అరవింద సమేత తర్వాత తారక్ నుంచి వచ్చిన సోలో సినిమా కావడంతో ఫ్యాన్స్ దేవరను పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు.;
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సినిమాగా దేవర మూవీ మంచి సక్సెస్ అందుకుంది. అరవింద సమేత తర్వాత తారక్ నుంచి వచ్చిన సోలో సినిమా కావడంతో ఫ్యాన్స్ దేవరను పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా కలెక్ట్ చేసినప్పటికీ కొరటాల డైరెక్షన్ పై కొన్ని కామెంట్స్ వినిపించాయి.
దేవర2పై భారీ అంచనాలు
అయితే దేవర కథ మొత్తం ఒకే సినిమాలో చెప్పడం వీలు కాకపోవడంతో రెండో భాగం కూడా ఉంటుందని దర్శకనిర్మాతలు ముందునుంచే చెప్పుకుంటూ వచ్చారు. భారీ అంచనాలతో వచ్చిన దేవర1 హిట్ అవడంతో దానికి సీక్వెల్ గా రానున్న దేవర2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దేవర హిట్ గా నిలచిన నేపథ్యంలో దేవర2పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రీ ప్రొడక్షన్ లో బిజీ
అయితే దేవర మూవీ హిట్ అయినప్పటికీ ఆ సినిమాలోని కంటెంట్ చెప్పుకోదగ్గ రీతిలో లేకపోవడంతో దేవర2 ఉండదని కూడా ఆ మధ్య విమర్శలొచ్చాయి. కానీ హీరో మాత్రం దేవర2 ఉంటుంది, ఉండి తీరుతుందని చెప్పడంతో సినిమా ఉంటుందని అందరూ ఫిక్సయ్యారు. మళ్లీ రీసెంట్ గా కొరటాల వేరే ప్రయత్నాలు చేస్తున్నారని, ఎన్టీఆర్ నుంచి తాజాగా వచ్చిన వార్2 కూడా ఫ్లాప్ అవడంతో, దేవర2 ఆగిపోయిందని వార్తలు రావడంతో ఈ విషయంపై సందిగ్ధత నెలకొంది.
తాజా సమాచారం ప్రకారం దేవర2 ఉందని, ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ఎన్టీఆర్ కు కొరటాల దేవర2కు సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ ను వినిపించారని, ఎన్టీఆర్ కూడా ఆ స్క్రిప్ట్ ను ఓకే చేశారని తెలుస్తోంది. మరి దేవర2 ఉంటే అదెప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు రిలీజవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా దేవర2 కోసం కొరటాల పాన్ ఇండియా స్థాయిలో కొన్ని కొత్త అంశాలను కూడా జోడించనున్నారని తెలుస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. అనిరుధ్ ఈ సంగీతం అందిస్తుండగా ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో కలిసి ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు.