• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గేమ్ చేంజర్.. మళ్ళీ షాక్?

గేమ్ చేంజర్.. మళ్ళీ షాక్?

| తరువాత న్యూ ఇయర్ కానుకగా సాంగ్ రిలీజ్ చేస్తారని అనుకున్నారు. ఇవేమీ జరగలేదు. ఇప్పుడు సంక్రాంతికి కూడా ఎలాంటి అప్డేట్ వచ్చేలా కనిపించడం లేదు.

By - Tupaki Desk
Update: 2024-01-07 03:58 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త మూవీ కోసం ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి పూర్తిస్థాయి మూవీ ఇప్పటి వరకు రాలేదు. ఈ మూవీ 2022లో రిలీజ్ అయ్యింది. తరువాత ఆచార్య మూవీ వచ్చిన అది పూర్తిస్థాయి చరణ్ మూవీ కాదు. దానికితోడు డిజాస్టర్ అయ్యింది. దీంతో చరణ్ ఇమేజ్ కి సరిపోయే సాలిడ్ మూవీ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

శంకర్ దర్శకత్వంలో చరణ్ గేమ్ చేంజర్ మొదలుపెట్టినప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఈ సినిమా రెండేళ్ళ నుంచి షూటింగ్ దశ ధాటి రాలేదు. ఇప్పటికి షూటింగ్ పెండింగ్ లో ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది క్లారిటీ లేదు. నిర్మాత దిల్ రాజు సైతం మూవీ రిలీజ్ పై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఓ వైపు శంకర్ ఇండియన్ 2కి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వడంతో గేమ్ చేంజర్ వెనక్కి వెళ్ళిపోతుంది.

ఆ మధ్య గేమ్ చేంజర్ నుంచి ఒక ఒక సాంగ్ లీక్ అయ్యింది. జరగండి జరగండి అంటూ డ్యూయెట్ విజువల్స్ తో సహా బయటకొచ్చింది. దీంతో ఆ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. వీడియో సాంగ్ మొత్తం రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే మళ్ళీ ఎందుకనో సాంగ్ రిలీజ్ వాయిదా వేసేశారు.

మూవీ రిలీజ్ కి ఏడాది ముందుగా సాంగ్ రిలీజ్ చేయడం వలన ప్రయోజనం ఉండదని వెనక్కి తగ్గినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే క్రిస్మస్ కానుకగా మూవీకి సంబందించిన ఏదైనా అప్డేట్ వస్తుందని ఆశించారు. తరువాత న్యూ ఇయర్ కానుకగా సాంగ్ రిలీజ్ చేస్తారని అనుకున్నారు. ఇవేమీ జరగలేదు. ఇప్పుడు సంక్రాంతికి కూడా ఎలాంటి అప్డేట్ వచ్చేలా కనిపించడం లేదు.

అలాగే గేమ్ చేంజర్ కి సంబందించిన ఎలాంటి అప్డేట్ ని చిత్ర యూనిట్ ఇచ్చేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. ప్రస్తుతం మూవీ షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో మొత్తం షూట్ అమ్న్తా అయ్యాక సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ యాక్టివిటీస్ పై ఫోకస్ చేయనున్నారంట. గేమ్ చేంజర్ మూవీలో చరణ్ కి జోడీగా కియరా అద్వానీ నటిస్తోంది. అంజలి, శ్రీకాంత్ కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు.

Tags:    
  • Tollywood 
  • Ramcharan 
  • Shankar 
  • Gamechanger 
  • Gamechangermovie 
  • Dilraju 
  • Kiaraadvani 
  • Ssthaman 
  • Sankranthi 
  • Updates 

Similar News

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

Copyright @2026

Powered by Blink CMS