తెలుగు చక్కగా మాట్లాడుతూ ఔరా అనిపిస్తున్న నార్త్ హీరోయిన్స్ వీరే!
నార్త్ నుండి వచ్చి టాలీవుడ్ లో రాణిస్తున్న హీరోయిన్లు ఇప్పటి జనరేషన్ వాళ్ళతో పాటు సీనియర్ హీరోయిన్లు కూడా ఎంతోమంది ఉన్నారు.;
సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే అన్ని రకాల భాషలను అవపోసన పట్టినట్లుగా ఉండాలి.. అయితే కొంతమంది హీరోయిన్లు ఇతర ఇండస్ట్రీల నుండి వచ్చి భాష రాకపోయినా కూడా డబ్బింగ్ పేరుతో సినిమా కానిచ్చేస్తూ ఉంటారు. కానీ చాలామంది స్టార్ హీరోయిన్లు మాత్రం భాష నేర్చుకొని.. స్వయంగా తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు తెలుగులో పలు ఇంటర్వ్యూలకు హాజరైనప్పుడు లేదా అభిమానులతో ముచ్చటించినప్పుడు చక్కగా తెలుగు భాషలో మాట్లాడుతూ అందరిని అబ్బురపరుస్తూ ఉంటారు..
అలా ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో నార్త్ నుండి వచ్చిన హీరోయిన్లు చాలామంది తెలుగు భాష నేర్చుకొని తెలుగులో స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నవారు ఉన్నారు. మరి వారిలో ఎవరెవరు నార్త్ నుండి వచ్చి తెలుగులో అనర్గళంగా మాట్లాడగలరో ఇప్పుడు తెలుసుకుందాం.
నార్త్ నుండి వచ్చి టాలీవుడ్ లో రాణిస్తున్న హీరోయిన్లు ఇప్పటి జనరేషన్ వాళ్ళతో పాటు సీనియర్ హీరోయిన్లు కూడా ఎంతోమంది ఉన్నారు. వీళ్లంతా ముంబై,ఢిల్లీ వంటి ఉత్తరాది రాష్ట్రాల నుండి దక్షిణాది ఇండస్ట్రీకి వచ్చి తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ.. భాషపై తమకున్న గౌరవాన్ని చాటారు.
శ్రీదేవి: దివంగత నటీమణి శ్రీదేవి తమిళనాడులో పుట్టి పెరిగినప్పటికీ సౌత్, నార్త్ లో పేరున్న హీరోయిన్.. నార్త్ ఇండస్ట్రీకి చెందిన బోనీ కపూర్ ని పెళ్లి చేసుకొని బాలీవుడ్ లో రాణించినా.. తెలుగు భాష చక్కగా మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యపరిచింది..
ఖుష్బూ: మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఖుష్బూ సౌత్ ఇండస్ట్రీలో రాణించి.. తెలుగు భాషని అద్భుతంగా మాట్లాడగలదు. అలా ఎన్నో తెలుగు,తమిళ,మలయాళ, హిందీ సినిమాల్లో కూడా రాణించింది.
టబు: ముంబై నుండి టాలీవుడ్ కి వచ్చిన హీరోయిన్లలో టబు కూడా ఒకరు.ఈమె ముస్లిం కుటుంబం నుండి వచ్చినప్పటికీ తెలుగు భాషను అవలీలగా మాట్లాడగలదు.
నగ్మా, జ్యోతిక: ముంబై నుండి వచ్చి సౌత్ ఇండస్ట్రీలో రాణించిన హీరోయిన్లలో నగ్మా, జ్యోతిక కూడా ఉంటారు. వీరిద్దరూ సొంత అక్కా చెల్లెళ్లు.. అలా ముంబై నుండి వచ్చినప్పటికీ టాలీవుడ్ సినిమాల్లో నటించేటప్పుడు తెలుగు భాషను నేర్చుకొని అద్భుతంగా తెలుగులో మాట్లాడగలరు.
రకుల్ ప్రీత్ సింగ్: పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఉత్తరాది భామే అయినప్పటికీ టాలీవుడ్ సినిమాల్లో నటించేటప్పుడు తెలుగు భాష నేర్చుకొని మరీ పలు ఈవెంట్లలో తన తెలుగు భాషతో ఎంతోమందిని అట్రాక్ట్ చేసింది.
కాజల్ అగర్వాల్: ముంబై నుండి వచ్చిన మరో హీరోయిన్ కాజల్ అగర్వాల్.. తెలుగులో లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ నార్త్ ఇండస్ట్రీ కంటే సౌత్ ఇండస్ట్రీలోనే ఫేమస్. అలా అన్ని ఇండస్ట్రీల కంటే ముఖ్యంగా టాలీవుడ్ లో పాపులర్ అయింది ఈ హీరోయిన్. అంతేకాదు ఈ హీరోయిన్ తెలుగు భాషలో కూడా అద్భుతంగా మాట్లాడగలదు.
రాశిఖన్నా: తెలుగు భాష అద్భుతంగా మాట్లాడే వారిలో రాశి ఖన్నా ఒకరు.. ఢిల్లీకి చెందిన రాశి ఖన్నా తెలుగు రాష్ట్రాల్లో పుట్టి పెరిగినట్లే తన భాషతో అందరినీ ఆకట్టుకుంటుంది. రీసెంట్గా తెలుసు కదా మూవీ ప్రమోషన్ ఈవెంట్లో ఈ హీరోయిన్ మాట్లాడిన తెలుగుకు చాలామంది ఫిదా అయ్యారు. చాలాసేపు తెలుగు భాషలో మాట్లాడి ఎంతో మందిని ఆకట్టుకుంది.
తమన్నా భాటియా: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువ శాతం మంది హీరోయిన్లు ముంబై నుండి వచ్చిన వాళ్లే ఉంటారు. వారిలో తమన్నా కూడా ఒకరు. ఈ హీరోయిన్ శ్రీ, హ్యాపీడేస్ వంటి సినిమాలతో తెలుగులో ఫేమస్ అయింది.అయితే రెండు దశాబ్దాలకు పైగా తన సినీ కెరియర్ లో ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి తెలుగు భాషని నేర్చుకొని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయింది.
సోనాలి బింద్రే : సీనియర్ నటి సోనాలి బింద్రే తెలుగులో చాలా ఫేమస్.. ముంబైలో పుట్టి పెరిగిన సోనాలి మురారి, ఖడ్గం వంటి సినిమాలతో తెలుగు భాషని నేర్చుకొని ఎన్నో సినిమాల్లో అలరించింది.
పూజా హెగ్డే: గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ లిస్టులో మొదటి ప్లేస్ లో ఉన్న పూజ హెగ్డే ముంబై నటి అయినప్పటికీ తెలుగు భాష నేర్చుకొని సినిమాల్లో తన పాత్రకి తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది.
రీతూ వర్మ: ఉత్తర భారతదేశం మూలాలు ఉన్న రీతూ వర్మ ఫ్యామిలీ హైదరాబాదులో సెట్ అవ్వడంతో హైదరాబాదులోనే పుట్టి పెరిగి.. ఇంట్లో వాళ్ళు హిందీ మాట్లాడినా కూడా తెలుగు సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో తెలుగు భాష నేర్చుకొని తన సినిమాలకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది.
నిధి అగర్వాల్ : నిధి అగర్వాల్ హైదరాబాదులో పుట్టి పెరిగినప్పటికీ ఇంట్లో వాళ్ళందరూ హిందీ మాట్లాడేవారే.కానీ టాలీవుడ్ ఇండస్ట్రీ మీద ఉన్న ఇష్టంతో తెలుగు భాష నేర్చుకొని తెలుగు సినిమాల్లో రాణించింది.
అలా ఉత్తరాది రాష్ట్రాల నుండి వచ్చిన మెహ్రీన్ ఫిర్జాదా, మృణాల్ ఠాకూర్ వంటి ఎంతో మంది హీరోయిన్లు తెలుగు సినిమాల మీద ఉన్న మక్కువతో తెలుగు భాష నేర్చుకొని మరీ చాలా అద్భుతంగా తెలుగులో మాట్లాడుతున్నారు. కానీ మరికొంతమందేమో తెలుగు భాష నేర్చుకోకుండానే వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పుకుంటూ సినిమాలు పూర్తి చేస్తున్నారు.