నోరా 'ఓ మామా తెతెమా' పక్కా లోకల్ మాస్!
నోరా తాజాగా టిసిరీస్ ఆల్బమ్ లో నర్తించింది. `ఓ మామా తెతెమా` అంటూ సాగే ఈ ఆల్బమ్ లో అంతర్జాతీయ గాయకుడు రేవన్నీ పెర్ఫామ్ చేయడం ఉత్కంఠను కలిగించింది.;
`బాహుబలి` మనోహరిగా తెలుగు యువత మనసులు దోచుకుంది నోరా ఫతేహి. ఉర్రూతలూగించే స్టెప్పులతో, మైమరిపించే బో*ల్డ్ లుక్స్ తో కట్టిపడేసే ఈ బ్యూటీ, ఓవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు బుల్లితెరపైనా రియాలిటీ షోల జడ్జిగా ఆర్జిస్తోంది. నోరా ఫతేహి నడక, నడత, సొగసు ప్రతిదీ ఒక కవ్వింత తుళ్లింత. అందుకే ఈ బ్యూటీ కెరీర్ ప్రారంభించి దశాబ్ధం గడిచినా ఇప్పటికీ ఇండస్ట్రీలో తన హవాను కొనసాగిస్తూనే ఉంది.
నోరా కెరీర్ ఆరంభమే ఎన్నో క్లాసిక్స్ అనదగ్గ ప్రత్యేక గీతాల్లో నర్తించింది. డ్యాన్సర్ గా తనను తాను ప్రూవ్ చేయడమే గాక, దేశంలోని ఔత్సాహిక కొరియోగ్రాఫర్స్, డ్యాన్స్ స్టూడెంట్స్ కి రోల్ మోడల్ గా మారింది. ప్రత్యేక గీతాలు దిల్ బర్, సాకి సాకి వంటి పాటలలో అద్భుత నర్తకిగా ప్రజల గుండెల్లో నిలిచింది. నోరా అసాధారణ మూవ్స్, కాస్ట్యూమ్స్ ఎంపికలు, కొరియోగ్రఫీ నైపుణ్యం, ప్రయోగాత్మక ఆలోచనలు.. ప్రతిదీ తనను ప్రత్యేకత ఉన్న సెలబ్రిటీగా నిలబెట్టాయి.
నోరా తాజాగా టిసిరీస్ ఆల్బమ్ లో నర్తించింది. `ఓ మామా తెతెమా` అంటూ సాగే ఈ ఆల్బమ్ లో అంతర్జాతీయ గాయకుడు రేవన్నీ పెర్ఫామ్ చేయడం ఉత్కంఠను కలిగించింది. ఆసక్తికరంగా నోరా ఫతేహి ఈ పాటతో గాయనిగా, రచయితగాను సత్తా చాటారు. రేవన్నీ- శ్రేయా ఘోషల్ సహా నోరా ఫతేహి స్వయంగా ఈ పాటను ఆలపించారు. అంతర్జాతీయ గాయనీగాయకులతో ఇలాంటి పాటలు ఆర్టిస్టులకు క్రేజ్ ని పెంచుతాయనడంలో సందేహం లేదు. గ్లోబల్ వేదికపై నోరా లాంటి ప్రతిభావనులకు మరిన్ని అవకాశాలు పెరగడానికి ఇవి సహకరిస్తాయి.
అయితే `ఓ మామా తెతెమా..`లో అంతటి ప్రత్యేకత ఏం ఉంది? అంటే ఇది కూడా ఓ రెగ్యులర్ పాట. ఇందులో నోరా ఫతేహి తన సిగ్నేచర్ డ్యాన్స్ స్టైల్, స్టెప్పులతో అలరించింది. ఇది పక్కా లోకల్ అన్నట్టుగానే ఉంది కానీ దీనికి అనవసరమైన టెక్నికల్ హంగామా ఏదీ కనిపించలేదు. ఈ ట్రాక్‌కు గాయని కం గీత రచయితగాను నోరా పని చేసింది. ఆల్బమ్‌లో నోరా ఫతేహి రెగ్యులర్ స్టైల్ అయినా అద్భుతమైన కాస్ట్యూమ్స్ లో ఎనర్జిటిక్ స్టెప్పులతో ఆకర్షించింది. గిరిజన వేషధారణ స్టైలింగ్, ఆఫ్రో-బొంగో లయతో బోల్డ్ తెతెమా వర్ణరంజితంగా కనిపిస్తుంది. ఇందులో రేవానీ ఆఫ్రో-బొంగో శైలితో ట్రాక్ లో ప్రత్యేకంగా కనిపించారు. శ్రేయ ఘోషల్ అందమైన శ్రావ్యమైన గాత్రం ప్రధాన ఆకర్షణగా మారింది. నోరా- రేవానీ-శ్రేయా ఘోషల్ త్రయం ఈ పాట కోసం పూర్తి ఎఫర్ట్ పెట్టి పని చేసారు. ఈ పాటను నోరా ఫతేహి, రేవానీ, విశాల్ మిశ్రా , ది ప్లగ్జ్ యూరప్ రాశారు. హిందీ, ఇంగ్లీష్, స్వాహిలి భాషల క్రాస్ కల్చర్ తో పాటను సమకూర్చడం ఆసక్తిని కలిగిస్తోంది.