కామెంట్స్ ఎఫెక్ట్.. నితిన్ వెనక్కి తగ్గాడా?
అయితే డైరెక్టర్ శ్రీనువైట్ల తో నితిన్ ఓ సినిమా చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.;
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సరైన హిట్ కోసం కొంతకాలంగా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. వరుస సినిమాలు చేస్తున్నా అనుకున్నంత రేంజ్ లో మాత్రం సక్సెస్ అందుకోలేకపోతున్నారు. 2020లో వచ్చిన బ్లాక్ బస్టర్ భీష్మ తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ స్థాయిలో హిట్ మళ్ళీ అందుకోలేదు.
భీష్మ మూవీ తర్వాత నితిన్ చేసిన రాబిన్ హుడ్, ఎక్ట్రార్డినరీ మ్యాన్, తమ్ముడు చిత్రాలు.. అలా ఒకదాన్నిమించి మరొకటి డిజాస్టర్ గా నిలిచాయి. అందుకే నితిన్ తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రిస్క్ తీసుకోకూడదని ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.
అందుకే హిట్ ఇచ్చే డైరెక్టర్ తో మాత్రమే వర్క్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఆ నేపథ్యంలో పలు ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. అయితే డైరెక్టర్ శ్రీనువైట్ల తో నితిన్ ఓ సినిమా చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరో.. అంతకుమించి డిజాస్టర్స్ డైరెక్టర్ తో మూవీ చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి.
కథపై నమ్మకంతో ధైర్యంగా రంగంలోకి దిగుతున్నారనే టాక్ వినిపించింది. త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని ప్రచారం జరిగింది. అయితే నితిన్ తో పాటు ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి కథ విన్నారని, శ్రీను వైట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా తెలిసింది. కానీ ఇప్పుడు మరో విషయం వైరల్ గా మారింది.
నితిన్ ఇప్పుడు శ్రీను వైట్ల సినిమాను పక్కన పెట్టారని తెలుస్తోంది. ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని సమాచారం. దీంతో మేకర్స్.. మరో హీరోను సెర్చ్ చేస్తున్నారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. అయితే నితిన్ తప్పుకోవడానికి కారణం సోషల్ మీడియాలో కామెంట్సేనని వినికిడి. ఎందుకంటే నెట్టింట ఓ రేంజ్ లో డిస్కషన్ జరిగింది.
నితిన్ ఫ్యాన్స్ అస్సలు శ్రీనువైట్ల ప్రాజెక్టు విషయంలో ఇంట్రెస్ట్ చూపించలేదు. సరైన హిట్ కోసం ఫ్లాప్ డైరెక్టర్ తో వర్క్ చేయడమేంటని క్వశ్చన్ చేశారు. ఇప్పుడు ఆ సినిమా చేయవద్దని కామెంట్లు పెట్టారు. వద్దు అంటే వద్దంటూ తేల్చి చెప్పారు. చెప్పాలంటే పెద్ద ఎత్తున గోల గోల చేశారు. దీంతో ఆ విషయాన్ని హీరో దృష్టికి ఆయన టీమ్ తీసుకెళ్లింది. అలా నితిన్.. వైట్ల మూవీని పక్కన పెట్టారని సమాచారం.