• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్‌ ను మరీ అంత మాట...

చరణ్‌ ను మరీ అంత మాట అనేసింది ఏంటి..!

| చరణ్ అన్నను క్లీంకార ఓ రేంజ్‌ లో ఆట ఆడుకుంటుందని, క్లీంకార కి అన్నం తినిపించేందుకు చరణ్‌ అన్న చాలా కష్టపడుతున్నాడు అంటూ నిహారిక చెప్పిన విషయం తెల్సిందే.

By - Tupaki Desk
Update: 2024-08-06 17:30 GMT

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల నటిగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి పెళ్లి కారణంగా నటనకు దూరం అయ్యింది. ఆ మధ్య మళ్లీ ఇండస్ట్రీలో కొత్త కెరీర్‌ ను ప్రారంభించింది. వెబ్‌ సిరీస్ లో నటించిన నిహారిక పూర్తి స్థాయి నటిగా మారేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అయితే ఆమె ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. ఇన్నాళ్లు సిరీస్ లు, షార్ట్‌ ఫిల్మ్స్ నిర్మిస్తూ వచ్చిన నిహారిక మొదటి సారి ఒక సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది.

కొత్త కుర్రాళ్లతో 'కమిటీ కుర్రాళ్లు' అనే టైటిల్‌ తో నిహారిక సినిమాను నిర్మించింది. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు పెంచే విధంగా నిహారిక ప్రమోషనల్‌ కార్యక్రమాలు నిర్వహించింది. సోషల్‌ మీడియాలో గత రెండు వారాలుగా ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా మరోసారి నిహారిక వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించడం తో పాటు కమిటీ కుర్రాళ్లు సినిమా వార్తల్లో నిలిచేలా చేసింది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీ గురించి నిహారిక పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. చరణ్ అన్నను క్లీంకార ఓ రేంజ్‌ లో ఆట ఆడుకుంటుందని, క్లీంకార కి అన్నం తినిపించేందుకు చరణ్‌ అన్న చాలా కష్టపడుతున్నాడు అంటూ నిహారిక చెప్పిన విషయం తెల్సిందే. క్లీంకార వచ్చిన తర్వాత పెదనాన్నకి పద్మ విభూషన్‌, చరణ్ అన్న మూవీ ఆస్కార్‌ కి వెళ్లింది, బాబాయి డిప్యూటీ సీఎం అయ్యారు. కనుక ఈ ఏడాది మా ఫ్యామిలీకి అంతా బాగుందని నిహారిక చెప్పుకొచ్చింది.

చరణ్ గురించి ఎవరికీ తెలియని విషయం అంటూ ఒక విషయాన్ని చెప్పుకొచ్చింది. ఆ విషయం ఏంటి అంటే... చరణ్ అన్న మాతో చాలా సార్లు డమ్‌ శరాస్ గేమ్‌ ఆడాడు. అన్న అలా గేమ్‌ ఆడుతాడు అని ఏ ఒక్కరు ఊహించరు. గేమ్ ఆడటం మాత్రమే కాకుండా గేమ్‌ లో చీటింగ్ చేస్తాడు. ఆ గేమ్‌ విషయంలో చరణ్ అన్న పెద్ద చీటర్ అంటూ నిహారిక వ్యాఖ్యలు చేసింది. చరణ్‌ బయట చాలా హుందాగా తండ్రికి తగ్గ తనయుడు అన్నట్లుగా ఉంటాడు. అయితే తన కజిన్స్ వద్ద మాత్రం ఇలా చిల్ గా ఉండటం మంచి విషయం అన్నట్లుగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే... శంకర్ దర్శకత్వంలో గేమ్‌ ఛేంజర్ సినిమాను చేస్తున్న చరణ్‌ ఆ వెంటనే బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే. గేమ్‌ ఛేంజర్ ను ఈ ఏడాదిలోనే విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. బుచ్చిబాబు సినిమా మాత్రం వచ్చే ఏడాది దసరాకి విడుదల అవ్వబోతుందట. మరో వైపు చరణ్‌ రెండు మూడు సినిమాలను లైన్‌ లో పెట్టాడు. రాబోయే మూడు సంవత్సరాలు చరణ్‌ డైరీ ఫుల్‌ గా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఏడాదికి డబుల్‌ ధమాకా అన్నట్లుగా ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వడం ఖాయం.

Tags:    
  • Niharikakonidela 
  • Committekurollu 
  • Ramcharan 
  • Klinker 
  • Chiranjeevi 
  • Padmavibushan 
  • Deputychiefminister 
  • Pawankalyan 
  • Oscarwinner 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS