మెగా డాటర్ మళ్లీ సై అనేసిందా?
మెగా డాటర్ నిహారిక విడాకుల తర్వాత మళ్లీ మ్యాకప్ వేసుకోని సంగతి తెలిసిందే. కేవలం నిర్మాతగానే ముందుకొస్తుంది.;
మెగా డాటర్ నిహారిక విడాకుల తర్వాత మళ్లీ మ్యాకప్ వేసుకోని సంగతి తెలిసిందే. కేవలం నిర్మాతగానే ముందుకొస్తుంది. వెబ్ సిరీస్ లు...సినిమా నిర్మాణంలో భాగమవుతూ ఇండస్ట్రీలో యాక్టివ్ గా కనిపిస్తుంది. అప్పుడప్పుడు మంచి సినిమాల్లో అవకాశాలు వస్తే ఇలా వచ్చి అలా వెళ్లిపోయే గెస్ట్ రోల్స్ మాత్రమే పోషిస్తుంది. పూర్తి స్థాయిలో రంగంలోకి దిగలేదు. అయితే అందుకు ఇక సమయం ఆసన్నమైందనే వార్త వెలుగులోకి వస్తోంది.
మెగా డాటర్ స్టార్ హీరోయిన్ అయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టిందని సన్నిహిత వర్గాల నుంచి లీకులం దుతున్నాయి. ఇప్పటి వరకూ గిరి గీసుకుని బోర్డర్ లోనే ఉన్న నిహారికి ఇప్పుడా హద్దులు చెరిపేసి నటిగా తన ట్యాలెంట్ చూపించడానికి రెడీ అవుతుందంటున్నారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా అన్ని రకాల అనుమతులు లభించడంతో? తగ్గేదేలే అంటూ బరిలోకి దిగబోతుందిట. హీరోయిన్ గా మంచి అవకాశాలు వస్తే చేయడానికి తాను సిద్దంగా ఉందనే వార్త వినిపిస్తుంది.
అయితే ఆ పాత్రలు అంతే హుందాగానూ ఉండాలి. నటిగా ఇమేజ్ పెంచే పాత్రలు తప్ప గ్లామర్ పాత్రల జోలికి వెళ్లే అవకాశం లేదని... సాయి పల్లవి తరహాలో సినిమాలు చేయాలని ఓ కొత్త స్ట్రాటజీని సిద్దం చేస్తోందిట. నేరుగా హీరోయిన్ అవకాశాలంటే అగ్ర నిర్మాణ సంస్థల్లో ఎలాగూ ఇవ్వరు. దీంతో తన సొంత నిర్మాణ సంస్థలోనే ముందుగా హీరోయిన్ గా ప్రూవ్ చేసుకునే కొన్ని పాత్రలు పోషించాలని ప్లాన్ చేస్తోందిట.
కొన్ని సోర్సెస్ ప్రకారం సొంత నిర్మాణ సంస్థ కాబట్టి గ్లామర్ విషయంలో కొంత లిబర్టీ తీసుకునే అవకాశం ఉందంటున్నారు. పాత్ర డిమాండ్ మేరకు అన్ని రకాలుగా న్యాయం చేయాలి అనే కోణంలో నిహారిక సిద్దమవుతుందంటున్నారు. అయితే అందుకు కొంత సమయం పడుతుందిట. నిహారిక అనుకున్నది వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తుందని..అంత వరకూ వెయిటింగ్ తప్పదంటున్నారు.