రాజమౌళి, సుకుమార్ తర్వాత స్థానం ఎవరి సొంతం!
రాజమౌళి, సుకుమార్, నాగ్ అశ్విన్ పాన్ ఇండియా మార్కెట్ లో బ్రాండ్ అందులో ఎలాంటి డౌట్ లేదు.;
రాజమౌళి, సుకుమార్, నాగ్ అశ్విన్ పాన్ ఇండియా మార్కెట్ లో బ్రాండ్ అందులో ఎలాంటి డౌట్ లేదు. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలతో ఆ స్థానం ఆ ముగ్గురికి లభించింది. అన్ని భాషల హీరో లిప్పుడు ఆ ముగ్గురితో సినిమాలు చేయాలని క్యూలో ఉన్నారు. గొప్ప క్రియేటర్లగా ముగ్గురికి మంచి పేరుం ది. మరి వీళ్ల తర్వాత ఆ రేంజ్ ఉన్న దర్శకులు ఎవరు? అంటే ప్రముఖంగా నలుగురు దర్శకుల పేర్లు క్యూలో ఉన్నాయి.
కొరటాల శివ `దేవర`తో పాన్ ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన `దేవర` యావ రేజ్ గా ఆడింది. కానీ కొరటాల గత సక్సెస్ లు అతడి ప్రతిభకు తార్కాణం. మంచి చిత్రాలు అందించిన దర్శకుడిగా ఆయనకు పేరుంది. ఆయన నుంచి మరిన్ని గొప్ప చిత్రాలు రావడానికి ఆస్కారం ఉంది. `దేవర 2` తో ప్రూవ్ చేసుకోవాలని కొరటాల కసితో పనిచేస్తున్నాడు. అలాగే యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబ కూడా ఈ రేసులో ఉన్నాడు.
తొలి సినిమా `ఉప్పెన` తో మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. రెండవ సినిమా ఏకంగా రామ్ చరణ్ తో పాన్ ఇండియాలో పెద్ది చేస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు పీక్స్లో ఉన్నాయి. పాన్ ఇండియాలో ఇదే డెబ్యూ. ఈ సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తే బుచ్చిబాబుకు వెనక్కి తిరిగి చూసే పనిలేదు. స్టార్ హీరోలే అతడి కోసం క్యూ కడతారు. మరోయువ సంచలనం గౌతమ్ తిన్ననూరి కి ఛాన్స్ ఉంది. `కింగ్ డమ్` ప్రచార చిత్రాలతో అతడి పేరు మారు మ్రోగిపోతుంది.
తొలి రెండు చిత్రాలు ఎమోషనల్ గా కనెక్ట్ చేసినా మూడవ చిత్రంలో మాస్ యాంగిల్ హైలైట్ అవుతుంది. ఇండస్ట్రీకి సాలిడ్ హిట్ ఇచ్చి తానేంటన్నది ఓ హీరోకి గట్టిగా చెప్పాలనుకుంటున్నాడు. త్రివిక్ర మ్ కి గొప్ప రైటర్ గా పేరుంది. కానీ ఇప్పటి వరకూ ఆయన చేసింది ఫ్యామిలీ సినిమాలే. యూనిక్ పాయింట్ ను టాచ్ చేయలేదు. దీంతో బన్నీ కూడా గురూజీ తోపాన్ ఇండియా రిస్క్ అవుతుందని భావిం చే ముందుగా అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు.
తదుపరి అదే బన్నీకి పాన్ ఇండియా హిట్ ఇచ్చి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. మరి వీళ్లలో ముందుగా పాన్ ఇండియా రేసులో స్థానం సంపాదించేది ఎవరో చూడాలి. ప్రశాంత్ వర్మ...చందు మొండేటి లాంటి వారు పాన్ ఇండియా సక్సస్ లు అందుకున్నారు. కానీ ఆ సక్సస్ లు సరిపోవు. 1000 కోట్ల వసూళ్లు తెచ్చే సినిమాలు తీసే వరకూ ఆ క్యాటగిరీకి చేరడం కష్టం.