రాజాసాబ్ మిక్స్డ్ టాక్‌.. మారుతి ఏమ‌న్నాడంటే...!

ఈ నేప‌థ్యంలో ఈ మూవీకి సంబంధించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మీట్‌ని నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ ఆస‌క్త‌క వ్యాఖ్య‌లు చేశాడు.;

Update: 2026-01-10 11:08 GMT

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాప్ న‌టించి భారీ హార‌ర్ కామెడీ థ్రిల్ల‌ర్ `ది రాజాసాబ్‌`. మారుతి ద‌ర్శ‌కుడు. ఆయ‌న తెర‌కెక్కించిన తొలి భారీ పాన్ ఇండియా మూవీ ఇదే కావ‌డం, ప్ర‌భాస్ న‌టించిన తొలి హార‌ర్ కామెడీ సినిమా కావ‌డంతో `ది రాజాసాబ్‌`పై స‌హ‌జంగానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. భారీ అంచ‌నాల మ‌ధ్య జ‌న‌వ‌రి 9న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే డివైడ్ టాక్‌ని సొంతం చేసుకుని అభిమానుల‌కు షాక్ ఇచ్చింది. మూడేళ్లు టైమ్ తీసుకుని మారుతి ఇలాంటి సినిమా చేశాడేంటి అని అంతా కామెంట్‌లు చేస్తున్నారు. అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఈ మూవీకి సంబంధించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మీట్‌ని నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ ఆస‌క్త‌క వ్యాఖ్య‌లు చేశాడు. ప్రీమియ‌ర్ సంద‌ర్భంగా మీడియా మిత్రుల‌కు తీవ్ర అసౌక‌ర్యం క‌లిగింద‌ని తెలిసింది. ఈ సంద‌ర్భంగా వారికి సారీ చెబుతున్నాను. అంతా ప‌డుకునే స‌మ‌యంలో రాత్రి 1:30కి షో ఏర్పాటు చేసి అంద‌రికి మైండ్ గేమ్ చూపించాం. రివ్యూస్‌లో దాని రిజ‌ల్ట్ క‌నిపించింది. రాంగ్ టైమ్‌లో షో వేసి అంద‌రిని ఇబ్బంది పెట్టాం. ఆ విష‌యంలో అంద‌రికి ఈ సంద‌ర్‌బంగా సారీ చెబుతున్నాను` అన్నారు.

ఇక ప్ర‌భాస్ గురించి మాట్లాడుతూ..ఏది ఏమైనా నాకొక మంచి అవ‌కాశాన్నిచ్చిన ప్ర‌భాస్ గారికి నా జ‌న్మంత రుణ‌ప‌డి ఉంటాను. ఎందుకంటే ఒక నార్మ‌ల్ మిడ్‌రేంజ్ డైరెక్ట‌ర్ ప్ర‌భాస్ సినిమా తీశాడు అనిపించేలా చేసిన ప్ర‌భాస్ గారికి థ్యాంక్స్‌. తొమ్మిది నెల‌ల‌కు ఒక సినిమా తీసే నేను మూడు సంవ‌త్స‌రాలు చాలా క‌ష్ట‌ప‌డి..ఇష్ట‌ప‌డి ఆయ‌న‌కు న‌చ్చే విధంగా ఆయ‌న‌ని ఇంప్రెస్ చేస్తూ ఆయ‌న ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందో.. ఆడియ‌న్స్ ఆయ‌న‌ని ఎలా చూడాల‌నుకుంటున్నారో వారి ఫీడ్ బ్యాక్‌లు తీసుకుంటూ ఈ సినిమా చేయ‌డం జ‌రిగింది. ఈ ప్రాజెస్‌లో ప్ర‌భాస్‌ని కొత్త‌గా చూపించాల‌ని చేశాం. సినిమా క్లైమాక్స్ చూసిన వాళ్లు ఇలాంటి క‌మ‌ర్షియ‌ల్ హీరో సినిమా ఇలాంటి మైండ్ గేమ్‌తో ఇంత వ‌ర‌కు ఇండియ‌న్ స్క్రీన్‌పై రాలేదు. నిజంగా కొత్త‌గా ఉంద‌ని 40 నిమిషాల ఎపిసోడ్‌కు మాత్రం చాలా మంచి స్పంద‌న ల‌భిస్తోంది.

ప్ర‌భాస్‌గారిని పెట్టుకుని నేను కూడా సింపుల్‌గా క‌మ‌ర్షియ‌ల్ సినిమా రాసేయొచ్చు. చేసేయొచ్చు. అది చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఇలాంటి క‌థ‌ని కొత్త‌గా చెప్పాలి..ఆడియ‌న్స్ ద‌గ్గ‌రికి తీసుకెళ్లాలి.. కొత్త సినిమాలు పెద్ద హీరోలు చేయాలి అనే ప్ర‌భాస్ గారి సంక‌ల్పంతో ఈ సినిమాను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇది కామ‌న్ ఆడియ‌న్స్‌కి చాలా మందికి రీచ్ అయింది. రిజ‌ల్ట్ అనేది వ‌న్ డేలోనే, ఫ‌స్ట్ షోతోనో డిసైడ్ కావ‌డం క‌రెక్ట్ కాదు. పండ‌గ ఉంది.. అన్ని సినిమాలు వ‌స్తున్నాయి. ప‌ది రోజులు ఆగితే సినిమా ప‌రిస్థితి ఏంట‌నేది తెలుస్తుంది.

ఎప్పుడైనా స‌రే కొత్త పాయింట్‌తో వ‌చ్చిన సినిమా వెంట‌నే ఎక్కేసి అద్భుతం జ‌రిగింద‌ని అనుకోం. ఎందుకంటే కొత్త పాయింట్ ఎప్పుడైనా జ‌నాల‌కు ఎక్క‌డానికి టైమ్ తీసుకుంటుంది. సినిమాలో ఉన్న కొత్త పాయింట్ గురించి మాట్లాడుతున్నారు. ఈ ఎపిసోడ్ ఇలా ఉంద‌ని ఇంట‌లెక్చువ‌ల్ పీపుల్స్ కొంత మంది మాట్లాడుతున్నారు. అర్థం కానివాళ్లు తిడుతున్నారు. ఇలా ర‌క‌ర‌కాల ఫీడ్ బ్యాక్ వ‌స్తోంది. ఇలాంటి నేప‌థ్యంతో వ‌చ్చే సినిమాల ఫ‌లితాన్ని అప్పుడే డిసైడ్ చేయ‌కండి ద‌య‌చేసి. కొంచెం వెయిట్ చేయండి..ఓపిగ్గా చూడండి. ప్ర‌భాస్ గారి అభిమానులు అంద‌రూ ఈ మూవీ విష‌యంలో డిజ‌ప్పాయింట్ కాలేదు. కానీ సాటిస్‌ఫై కాలేదు.

ట్రైల‌ర్‌లో ప్ర‌భాస్‌గారి ఓల్డ్ గెట‌ప్ చూపించాం. ఇలా రాక్ష‌సుడిని చూపించాం. ఆయ‌న యాటిట్యూడ్‌, స్వాగ్ ఇవ‌న్నింటితో ఆయ‌న‌ని ప‌రిచ‌యం చేశాం. థియేట‌ర్ల‌కు వ‌చ్చిన‌ప్పుడు మాత్రం ఆ ఓల్డ్ గెట‌ప్ ఎక్క‌డా అని వెతుక్కున్న‌ప్పుడు మాత్రం మేము చూపించే క‌థ‌ని ఆ డిజ‌ప్పాయింట్‌మెంట్‌లో బ్రెయిన్‌కు ఎక్కించుకోలేక‌పోయారు. దీని గురించి సినిమా రిలీజ్ అయిన సాయంత్రం చాలా మంది ప్ర‌భాస్ అభిమానులు నాతో మాట్లాడారు. సినిమా బాగాతీశావ‌న్నా..అయితే ఓల్డ్ గెట‌ప్ ఏమైంద‌న్నా..అది వ‌స్తే గ‌న‌క మాకు చాలా హ్యాపీగా ఉంటుంద‌ని చెప్పారు. ఇలా నాతో ఎంతో మంది అభిమానులు చెప్పారు.

వాళ్ల‌ని దృష్టిలో పెట్టుకుని నిన్న సాయంత్రం కూర్చుని సెకండ్ హాఫ్ ఇంకొంచెం షార్ప్ చేసి ప్ర‌భాస్ గారి ఓల్డ్ గెట‌ప్‌ని శ‌నివారం సాయంత్రం 6 గంట‌ల షో నుంచి జోడించ‌డానికి నిర్మాత సిద్ధ‌మ‌య్యారు. ఈ ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే చాలా క‌ష్ట‌ప‌డి చేశారు. రూఫ్‌లో ఫైట్ అనేది ఇంత వ‌ర‌కు రాలేదు. ఇదంతా ఎనిమిది నిమిషాల ఎపిసోడ్‌. క‌చ్చింత‌గా ప్ర‌భాస్ స్వాగ్‌ని, ఆయ‌న స్టైల్‌ని ఈ ఎపిసోడ్‌లో మీరు ఎంజాయ్ చేస్తారు. ఎక్క‌డైతే సినిమా బాగా లాగ్ అని ఫీల‌య్యారో దాన్ని కూడా షార్ప్ చేసి శ‌న‌వారం సాయంత్రం నుంచి కొత్త ప్ర‌భాస్ గారిని మేం చూపించ‌బోతున్నాం. దీంతో అభిమానులు, ఆడియ‌న్స్ క‌చ్చితంగా సంతృప్తి చెందుతార‌ని భావిస్తున్నాను. ఈ పండ‌క్కి అన్ని సినిమాలు బాగా ఆడాలి.

ఫ‌స్ట్ డే ప్ర‌భాస్ గారి సినిమా టాక్ ఇలాగే ఉంటుంద‌ని, ప‌ది రోజుల త‌రువాతే అస‌లు విష‌యం తెలుస్తుంద‌ని, ఫ‌స్ట్ డే రోజు వ‌చ్చిన టాక్‌ని ప‌ట్టించుకోవ‌ద్ద‌ని అభిమానుల మెసేజ్‌లు చేస్తున్నారు. దీంతో నేను హ్యాపీగా ఫీల‌వుతున్నాను. ప్ర‌భాస్ గారు నాలాంటి మిడ్ రేంజ్ డైరెక్ట‌ర్‌తో ఒక కొత్త సినిమాని మీకు అందించారు. అలాంటి సినిమాని మీరంతా ఆద‌రించి ముందుకు తీసుకెళుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. క‌లెక్ష‌న్స్ గురించి నాకు తెలియ‌దు. కామ‌న్ ఆడియ‌న్స్‌, సినిమా చూసిన వాళ్లు బాగుందంటున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు` అని తెలిపారు మారుతి.




Tags:    

Similar News