పిక్‌టాక్ : ప్రకృతి అందాల నడుమ అందాల నేహా
'చిరుత' సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నేహా శర్మ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంటుందని అంతా భావించారు.;
'చిరుత' సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నేహా శర్మ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంటుందని అంతా భావించారు. చిరుత సినిమా హిట్ కావడంతో బ్యాక్ టు బ్యాక్ పెద్ద హీరోల సినిమా ఆఫర్లు వస్తాయి అనుకున్నారు. కానీ నేహా శర్మ తప్పుడు అడుగుల కారణంగా కెరీర్ మొత్తం తలకిందులు అయిందనే వారు చాలామంది ఉన్నారు. చిరుత వంటి మంచి హిట్ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని సినిమాలను ఎంపిక చేసుకుంటే తప్పకుండా పెద్ద సినిమా ఆఫర్లు వచ్చేవి. చిన్న సినిమాలకు ఓకే చెప్పడం, పెద్దగా ప్రాధాన్యత లేని సినిమాల్లో నటించడం వల్ల ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. టాలీవుడ్‌లోనే కాకుండా ఈమె ఇతర భాషల్లోనూ నటించింది. కానీ లక్ ఈమెకు కలిసి రాలేదు. కానీ అందంతో పాటు, ప్రతిభ ఉన్న కారణంగా ఇండస్ట్రీలో ఇప్పటికీ కొనసాగుతోంది.
నేహా శర్మ అందాల ఆరబోత..
నేహా శర్మ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా 17 ఏళ్లు పూర్తి అవుతుంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అవుతున్నా కూడా పాతికేళ్ల పడుచు అందం అన్నట్లుగా కనిపిస్తూ కవ్విస్తూ ఉంది. 37 ఏళ్ల వయసులోనూ టీనేజర్ మాదిరిగా కనిపిస్తున్న నేహా శర్మ చాలా మందికి ఇప్పటికీ అభిమాన నటి అనడంలో సందేహం లేదు. నాజూకు అందంతో పాటు, ఫోటో జెనిక్ ఫేస్ కావడంతో నేహా శర్మను చాలా మంది ఇప్పటికీ అభిమానిస్తూనే ఉంటారు. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అని చాలా మంది అంటూ ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలను చూస్తే ఆ విషయం నిజం అనిపిస్తుంది. తాజాగా మరో ఫోటో షూట్ తో నేహా శర్మ చూపు తిప్పనివ్వడం లేదు. బాబోయ్ ఏంటి ఈ అందం అంటూ చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేసేలా ఉంది.
క్లీ వేజ్ షో తో మతిపోగొడుతోంది...
ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 20 మిలియన్‌ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న నేహా శర్మ ఎప్పటిలాగే మరో అందమైన ఫోటో షూట్ ను షేర్ చేసింది. ఈసారి అందమైన ప్రకృతిలో నేహా కనిపించింది. సహజంగానే నేహా శర్మ చాలా అందంగా ఉంటుంది. అలాంటి నేహా శర్మ అందమైన ప్రకృతిలో ఉంటే అంతకు మించిన అందం అన్నట్లుగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. క్లీ వేజ్ షో చేస్తూ, థైస్ అందాలను చూపించడంతో పాటు, అందమైన ఫేస్ తో, డిఫరెంట్ ఔట్ ఫిట్ లో నేహా శర్మ చూపు తిప్పనివ్వడం లేదు అంటూ నెటిజన్స్ ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. నేహా శర్మ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా దాదాపుగా రెండు లక్షల మంది ఫోటోలను లైక్ చేయడంతో పాటు, కామెంట్ చేసి షేర్ చేశారు. దాంతో ఈ అమ్మడి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
బాడ్ న్యూస్ సినిమాతో అందాల నేహా
ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే... గత సంవత్సరం బాడ్ న్యూజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో ప్రాధాన్యత ఉన్న గెస్ట్ రోల్ లో కనిపించింది. సినిమా ఆఫర్లు ఎక్కువగా వస్తున్నప్పటికీ ఆచితూచి ఎంపిక చేసుకుంటుంది అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. బాలీవుడ్‌లో ఎక్కువగా ఈమె సినిమాలు చేస్తుంది. మంచి పాత్రలతో అప్రోచ్ అయితే తప్పకుడా సౌత్ సినిమాలు చేస్తాను అని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో నేహా శర్మ చెప్పుకొచ్చింది. తప్పకుండా ఈ అమ్మడు మరోసారి టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేయాలని ఈ ఫోటోలు చూసిన వారు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నేహా శర్మ అందం ఏమాత్రం తగ్గకపోగా మరింత అందంగా ఇప్పుడు కనిపిస్తుంది. కనుక హీరోయిన్‌గా మరో పదేళ్ల పాటు నేహా శర్మ కు ఆఫర్లు వచ్చే స్కోప్ ఉంది. మరి ఫిల్మ్ మేకర్స్ పట్టించుకుంటారా అనేది చూడాలి.