బాలీవుడ్ విలన్లతో బాలయ్య చేస్తున్న గ్లోబల్ బాక్సాఫీస్ ప్రయోగం ఇదేనా ?
గతంలో బాలయ్య మార్క్ డైలాగులు, యాక్షన్ సీక్వెన్సులు కేవలం మన తెలుగు ఆడియన్స్‌కు మాత్రమే పూనకాలు తెప్పించేవి.
టాలీవుడ్ సీనియర్ స్టార్స్ అనగానే ఒకప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాల సరిహద్దులకే పరిమితమైన మార్కెట్ గుర్తుకొచ్చేది. కానీ, మారుతున్న నేటి పాన్-ఇండియా కాలంలో ఆ లెక్కలు పూర్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన సినిమాల్లో అనుసరిస్తున్న సరికొత్త కాస్టింగ్ స్ట్రాటజీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక హాట్ ట్రెండ్‌గా మారింది. కేవలం లోకల్ విలన్లతో సరిపెట్టకుండా, బాలీవుడ్ అగ్ర నటులను తన ప్రాజెక్టుల్లోకి దించుతుండటం వెనుక కేవలం ఒక కమర్షియల్ హంగు మాత్రమే లేదు... దీని వెనుక నార్త్ ఇండియా మార్కెట్‌ను సైలెంట్‌గా కొల్లగొట్టాలనే ఒక లోతైన ప్లాన్ దాగుంది అని టాక్ ..ఆ విశేషాలు మీకోసం..
నార్త్ బెల్ట్ లో క్రేజ్:
సాధారణంగా సౌత్ సినిమాలు నార్త్ బెల్ట్‌లో క్లిక్ అవ్వాలంటే భారీ విజువల్స్ లేదా మైథాలజీ సబ్జెక్టులు ఉండాలి అనుకుంటారు. కానీ బాలకృష్ణ రూట్ మార్చారు. 'భగవంత్ కేసరి' లో అర్జున్ రాంపాల్‌ను, మొన్నటి 'డాకు మహారాజ్' లో బాబీ డియోల్‌ను, ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'NBK111' లో సంజయ్ దత్‌ను విలన్లుగా పెట్టడం ద్వారా ఆయన హిందీ ఆడియన్స్‌కు నేరుగా కనెక్ట్ అవుతున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా పరిచయమున్న ఈ స్టార్స్... బాలయ్య లాంటి పవర్‌ఫుల్ మాస్ హీరోతో తలపడుతుంటే చూసే క్రేజ్ నార్త్ మార్కెట్‌లో బిజినెస్ వాల్యూను, డిజిటల్ రైట్స్ ధరలను అమాంతం పెంచేస్తోంది.
ఒక విన్-విన్ ఫార్ములా:
ఇక బాలకృష్ణ సినిమాలో విలన్ పాత్రలకు ఉండే వెయిటేజ్, వారి క్యారెక్టరైజేషన్లు చాలా బలంగా ఉండటం వల్లే అర్జున్ రాంపాల్, బాబీ డియోల్ లాంటి నటులు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు సంజయ్ దత్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. దీనివల్ల బాలీవుడ్ స్టార్స్‌కు సౌత్‌లో కొత్త మార్కెట్ దొరుకుతుంటే... బాలయ్య సినిమాలకు నార్త్ ఇండియాలో థియేట్రికల్ రీచ్ పెరుగుతోంది. ఇరుపక్షాలకూ లాభం చేకూర్చే పక్కా ప్లాన్ అని సమాచారం.
ఇక బాక్సాఫీస్ వేటే:
గతంలో బాలయ్య మార్క్ డైలాగులు, యాక్షన్ సీక్వెన్సులు కేవలం మన తెలుగు ఆడియన్స్‌కు మాత్రమే పూనకాలు తెప్పించేవి. కానీ బాలీవుడ్ విలన్ల ఎంట్రీతో హిందీ డబ్బింగ్ సర్క్యూట్స్‌లో కూడా బాలయ్య సినిమాలకు విపరీతమైన వ్యూయర్‌షిప్ వస్తోంది. హిందీ ఆడియన్స్ కూడా ఈ 'లైన్ వర్సెస్ బాబా' లాంటి క్రేజీ కాంబినేషన్లను ఓపెన్‌గా యాక్సెప్ట్ చేస్తున్నారు అన్నది నిజం.
వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ... బాక్సాఫీస్ దగ్గర కేవలం కలెక్షన్లు రాబట్టడమే కాదు, తన మార్కెట్ పరిధిని ఎలా పెంచుకోవాలో ఈ బాలీవుడ్ కాస్టింగ్ ద్వారా నిరూపిస్తున్నారు. అర్జున్ రాంపాల్, బాబీ డియోల్ లతో చేసిన ప్రయోగాలు సూపర్ హిట్ అవ్వడంతో, ఇప్పుడు రాబోయే 'NBK111' లో సంజయ్ దత్‌తో చేయబోయే యాక్షన్ ఫీస్ట్ పైన హిందీ మార్కెట్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండస్ట్రీలో ఒక సరికొత్త పాన్- ఇండియా ఈక్వేషన్‌ను సెట్ చేసిన బాలయ్య ..ఇక మున్ముందు స్టార్స్ అందరికీ ఒక గ్లోబల్ మార్కెట్ రూట్ మ్యాప్‌ను చూపిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.