• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నయన్ లెక్క.. న్యాయమేనా?

నయన్ లెక్క.. న్యాయమేనా?

| జవాన్ చిత్రానికి 11 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న నయన ఇప్పుడు ఏకంగా 12 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందంట.

By - Tupaki Desk
Update: 2023-10-21 04:48 GMT

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఇప్పటికి వన్నె తగ్గని అందాలతో, సాలిడ్ ఇమేజ్ తో దూసుకుపోతున్న సీనియర్ ముద్దుగుమ్మ నయనతార. ఈ బ్యూటీ తెలుగులో పూర్తిగా ఫేడ్ అవుట్ అయ్యిందని చెప్పొచ్చు. అయితే తమిళంలో మాత్రం లేడీ సూపర్ స్టార్ గా దూసుకుపోతోంది. అక్కడ వరుస సినిమాలు చేస్తోంది. ఫిమేల్ సెంట్రిక్ కథలతో కూడా నయనతార హీరోయిన్ గా మూవీస్ చేస్తున్నారు.

దీంతో సౌత్ లో ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న బ్యూటీగా నయనతార ఉంది. ఆమె జవాన్ కి ముందు వరకు 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునేది. అయితే జవాన్ చిత్రం సూపర్ సక్సెస్ కావడంతో బాలీవుడ్ కి కూడా నయనతార క్రేజ్ పెరిగింది. అక్కడ ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయి.

బడా నిర్మాతలు ముందుకొచ్చి నయనతారతో సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. జవాన్ చిత్రానికి 11 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న నయన ఇప్పుడు ఏకంగా 12 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందంట. ఈ స్థాయిలో అంటే చాలా ఎక్కువ అని చెప్పాలి. బాలీవుడ్ లో కూడా కేవలం దీపికా పదుకునే, అలియా భట్ లాంటి స్టార్ హీరోయిన్స్ మాత్రమే ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

జవాన్ చిత్రంలో నయనతార అటు గ్లామర్ పరంగా ఇటు యాక్షన్ సీక్వెన్స్ లో కూడా తనదైన మార్క్ పెర్ఫార్మెన్స్ చూపించింది. ఈ కారణంగానే బాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఇప్పుడు నయనతార డేట్స్ కోసం ట్రై చేస్తున్నారంట. అయితే ఆమె మొదటి ప్రాధాన్యత మాత్రం కోలీవుడ్ సినిమాలకే ఉంటుందనే మాట వినిపిస్తోంది.

సౌత్ లో స్టార్ హీరోయిన్స్ గా హీరోయిన్స్ కూడా అత్యధికంగా 5 కోట్ల వరకు మాత్రమే తీసుకుంటున్నారు. ఒక్క నయనతార మాత్రమే 12 కోట్ల వరకు చార్జ్ చేస్తోంది. ఈ మధ్య ఒక తెలుగు సినిమా కోసం నయనతారని సంప్రదించగా ఈ రెమ్యునరేషన్ కారణంగానే నిర్మాతలు వెనక్కి తగ్గినట్లు టాక్ వినిపిస్తోంది. జవాన్ తర్వాత తాజాగా జయం రవికి జోడీగా ఇరైవన్ సినిమాతో నయన ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

Tags:    
  • Kollywood 
  • Actress 
  • Nayanthara 
  • Remuneration 
  • Jawanmovie 
  • Deepikapadukone 
  • Staractress 
  • Bollywood 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS