• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తెలుగు సినిమాలకు నయన్...

తెలుగు సినిమాలకు నయన్ కండిషన్ అదే..!

| తెలుగులో తాను నటించాలంటే ఆ సినిమాలో హీరోకి ఇచ్చే రెమ్యునరేషన్ తనకు ఇవాలన్న కండీషన్ పెడుతుందట నయనతార

By - Tupaki Desk
Update: 2023-08-04 06:41 GMT

లేడీ సూపర్ స్టార్ నయనతార ఆ టైటిల్ తెచ్చుకునేందుకు చాలా కష్టపడింది. ముందు సినిమాలో కో యాక్టర్ గా మొదలైన ఆమె కెరీర్ ఆ తర్వాత సోలో హీరోయిన్ గా సత్తా చాటింది. కోలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది నయనతార. ఒకానొక దశలో నయన్ మంచి ఫాం లో ఉన్న టైం లో ఆమె సినిమా వస్తుంది అంటే స్టార్ హీరోలు కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈమధ్య అంతగా ఫాంలో లేని నయనతార తిరిగి ఫాంలోకి రావాలని చూస్తుంది.

తమిళ సినిమాలతో పాటుగా తెలుగులో కూడా వచ్చిన ప్రతి ఛాన్స్ చేస్తూ వచ్చింది నయన్. టాలీవుడ్ లో కూడా ఆమెకు స్టార్ క్రేజ్ దక్కింది. సీనియర్ స్టార్స్ బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో పాటుగా ప్రభాస్, ఎన్.టి.ఆర్ లాంటి స్టార్ హీరోలతో కూడా నటించింది నయన్.

కోలీవుడ్ లో ఫుల్ బిజీ అయిన నయనతార తెలుగు సినిమాల మీద ప్రస్తుతం అంత ఆసక్తి చూపించట్లేదని తెలుస్తుంది. అంతేకాదు ఒకరిద్దరు తమ సినిమాల్లో నయనతార కావాల్సిందే అని వెళ్లిన తెలుగు నిర్మాతలకు ఆమె రెమ్యునరేషన్ ఎక్కువ అడిగి షాక్ ఇస్తుందట.

తెలుగులో తాను నటించాలంటే ఆ సినిమాలో హీరోకి ఇచ్చే రెమ్యునరేషన్ తనకు ఇవాలన్న కండీషన్ పెడుతుందట నయనతార. ఇందులో ఎంత వాస్తవం ఉంది అన్నది తెలియదు కానీ మన స్టార్స్ రేంజ్ రెమ్యునరేషన్ అంటే అది చాలా కష్టమని చెప్పొచ్చు.

హీరోలకు 50, 100 కోట్ల రెమ్యునరేషన్ ఉన్నా కథనాయికలకు మాత్రం 5, 10 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. మరి నయనతార అడిగినట్టు ఆమెను హీరోలకు ఈక్వల్ రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకునే ఛాన్స్ ఉంటుందా లేదా అన్నది చూడాలి.

నయనతార సినిమాలో ఉంటే ఆమె మార్కెట్ కూడా సినిమాకు యాడ్ అవుతుందని భావిస్తున్నారు. కానీ ఆమె కూడా తన రోల్ ఎంతైనా సరే సినిమాలో నటించాలంటే మాత్రం తను అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే అన్నట్టుగా డిమాండ్ చేస్తుంది.

కోలీవుడ్ లో నయన్ డిమాండ్ చేసినంత ఇస్తూ ఆమెతో సినిమాలు చేస్తున్నారు కానీ తెలుగు దర్శక నిర్మాతలు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. లాస్ట్ ఇయర్ చిరు గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన నయనతార ఆ తర్వాత ఏ సినిమాకు సైన్ చేయలేదు. కోలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో దూసుకెళ్తుంది అమ్మడు.

Tags:    
  • Nayanthara 
  • Staractress 
  • Tollywood 
  • Kollywood 
  • Remuneration 
  • Telugu 
  • Tamil 
  • Jawan 
  • LadySuperStar 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS