త్రిష కి చెక్ పెట్టేందుకు రెడీనా..?
కోలీవుడ్ లో ఇద్దరి హీరోయిన్స్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. అది ఎవరన్నది కనిపెట్టడం పెద్ద కష్టమేమి కాదు...;
కోలీవుడ్ లో ఇద్దరి హీరోయిన్స్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. అది ఎవరన్నది కనిపెట్టడం పెద్ద కష్టమేమి కాదు ఒకరు లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తో ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో అదరగొడుతుంటే మరొకరు కమర్షియల్ సినిమాలు చేస్తూ అడపాదడపా సోలో సినిమాలు చేస్తూ ఆడియన్స్ మెప్పు పొందుతున్నారు. ఇద్దరి కెరీర్ రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నా ఇప్పటికీ ఇద్దరికీ అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. ఐతే ఇప్పుడు ఆ ఇద్దరు తెలుగు సినిమాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు.
ఇంతకీ ఎవరా ఇద్దరు ఏంటా కథ అంటే ఈ మ్యాటర్ పూర్తిగా తెలుసుకోవాల్సిందే. తమిళ్ లో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న నయనతార, త్రిషల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. మొన్నటిదాకా ప్రతి స్టార్ సినిమాలో నయనతార కామన్ హీరోయిన్ అయ్యేది ఐతే ఇప్పుడు ఆ ఛాన్స్ త్రిష తీసుకుంటుంది. P.S 1, 2 సినిమాలు చేశాక త్రిషకు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. కోలీవుడ్ లో త్రిష సినిమా సినిమాకు తన ఫాం ని మెరుగుపరచుకుంటుంది.
నయనతార కూడా అక్కడ తన పంథాలో సినిమాలు చేస్తూ వెళ్తుంది. ఐతే త్రిష ఆఫ్టర్ లాంగ్ టైం తెలుగులో విశ్వంభర సినిమా చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవితో సినిమా కాబట్టి అందరి ఫోకస్ ఆ సినిమా మీద ఉంది. ఇదే కాదు త్రిష నెక్స్ట్ రెండు తెలుగు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని టాక్. ఐతే ఈ టైం లో త్రిష తెలుగు సినిమాలకు చెక్ పెట్టేలా చూస్తుంది నయనతార. ఇన్నాళ్లు తమిళ్ లో బిజీగా ఉండి టాలీవుడ్ ఆఫర్లు కాదన్న నయనతార ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమాలకు సైన్ చేస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో సినిమాలో నయనతార నటిస్తుంది. ఆమె సినిమాలో నటిస్తుందన్న ఆన్ బోర్డ్ వీడియో చేసి సర్ ప్రైజ్ చేసింది. ఐతే త్రిష ఇప్పుడు తన ఫోకస్ టాలీవుడ్ మీద పెట్టగా ఇక్కడ ఆమె ఛాన్స్ లను కాజేయాలని చూస్తుంది నయనతార. ఇద్దరు చిరంజీవి సినిమాతోనే తెలుగు రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. త్రిష తప్పకుండా ఇంకా ఛాన్స్ లు రాబట్టుకునేలా ఉంది. నయనతార కూడా మెగా 157 చేస్తే తప్పకుండా మరిన్ని అవకాశాలు దక్కించుకునేలా ఉంది.