48 గంటలలో.. నయన్ డబుల్ ఫ్లేవర్

ఆగస్టు చివరి వారం నయనతార కెరీర్‌లో కొంచెం డిఫరెంట్‌గా సాగబోతోంది. 48 గంటల వ్యవధిలో ఆమె నటించిన రెండు వేర్వేరు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.

Update: 2026-08-15 02:18 GMT

ఆగస్టు చివరి వారం నయనతార కెరీర్‌లో కొంచెం డిఫరెంట్‌గా సాగబోతోంది. 48 గంటల వ్యవధిలో ఆమె నటించిన రెండు వేర్వేరు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఆగస్టు 26న కన్నడ స్టార్ యష్ టాక్సిక్ రిలీజ్ అవుతుండగా, ఆ వెంటనే ఆగస్టు 28న కవిన్ హీరోగా చేసిన హాయ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా కేవలం రెండు రోజుల గ్యాప్‌లో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌లు ఉండటం హైలెట్.

గీతూ మోహన్ దాస్ డైరెక్షన్‌లో వస్తున్న టాక్సిక్ పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన పెద్ద గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా. యష్ హీరోగా చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో నయనతార ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తోంది. మాస్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆమె చాలా యాక్టివ్‌గా పాల్గొంటూ మూవీ పాన్ ఇండియా రీచ్ కు ఫుల్ సపోర్ట్ ఇస్తోంది.

టాక్సిక్ మూవీకి పూర్తి భిన్నమైన వాతావరణంలో వస్తున్న సినిమా హాయ్. విష్ణు ఎడవన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఎలాంటి లార్జ్ స్కేల్ యాక్షన్ కంటెంట్ ఉండదు. ఇదొక లైట్ హార్టెడ్ తమిళ్ రొమాంటిక్ కామెడీ డ్రామా. నిజానికి ఈ చిత్రాన్ని ముందుగా ఆగస్టు 14నే థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ తర్వాత కొన్ని కారణాలతో దీని రిలీజ్ డేట్ ఆగస్టు 28కి షిఫ్ట్ అయింది.

ఇక ఈ రెండు సినిమాల సెటప్, అలాగే స్క్రిప్ట్ స్కేల్ ఉహించని విధంగా ఉన్నాయి. ఒక వైపు దేశవ్యాప్తంగా అంచనాలున్న భారీ యాక్షన్ ఇవెంట్ సినిమా ఉంటే, మరోవైపు దానికి పూర్తి ఆపోజిట్‌గా రిలేషన్‌షిప్స్ చుట్టూ సింపుల్ గా నడిచే ఎమోషనల్ కథ. ​ఈ రెండు ప్రాజెక్టులలో నయనతార రోల్ పొజిషనింగ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.

టాక్సిక్ లాంటి పాన్ ఇండియా సెటప్‌లో చాలామంది స్టార్స్ నడుమ ఆమె ఒక పాత్ర చేసింది. కానీ హాయ్ విషయానికి వస్తే, ఇందులో హీరో కవిన్‌తో పాటు ఆ సినిమాకు మెయిన్ ఫేస్‌గా నిలబడి మొత్తం ప్రాజెక్ట్‌ను తన భుజాలపై డ్రైవ్ చేసే లీడ్ రోల్‌లో నయన్ కనిపిస్తుంది. ​యష్ లాంటి పాన్ ఇండియా స్టార్ పక్కన అంత పెద్ద ప్రాజెక్ట్‌లో కనిపిస్తూనే, ఆ వెంటనే కవిన్ తో కలిసి ఒక చిన్న సైజ్ సినిమాలో యాక్ట్ చేయడం గమనిస్తే ఆమె సెలెక్షన్స్ ఎలా ఉన్నాయో అర్థం అవుతుంది. ఇక ఆడియన్స్ ఈ చిత్రాలను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News