నయనతారపై సొంత పరిశ్రమ రుసరుసలాడుతోందా?
అప్పటి నుంచి నయనతారను ప్రచారానికి పిలవడం పూర్తిగా మానేసారు. సినిమా కు కమిట్ అయితే షూటింగ్ పూర్తిచేసి వెళ్లిపోవడం మినహా ఎలాంటి కార్యక్రమాలతో సంబంధం లేదు.;
లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా ప్రచారానికి దశాబ్దంన్నర క్రితమే దూరమైంది. నాటి నుంచి ప్రచారం కోసం ప్రత్యేకంగా పారితోషికం ఆఫర్ చేసినా? నో చెప్పడం మొదలు పెట్టింది. తిరిగి ప్రచారంలో భాగం చేయాలని ఎంతో మంది దర్శక, నిర్మాతలు ప్రయత్నించారు. దర్శక, నిర్మాతల నుంచి ఒత్తిడి పెరిగేకొద్ది మరింత కఠినంగా వ్యవహరిం చడం మొదలు పెట్టింది. ప్రాజెక్ట్ సైన్ చేయడానికి ముందే? సినిమా ప్రచారంతో తనకు సంబంధం లేదని ముందేప్రత్యేక ఒప్పంద పత్రం రాయించుకుంటుంది. అందుకు ఒకే అయితే సినిమా లో నటిస్తాను? లేదంటే పారితోషికంగా ఎన్ని కోట్లు ఆఫర్ చేసినా? నటించను అనే నిర్ణయానికి వచ్చేసింది.
అప్పటి నుంచి నయనతారను ప్రచారానికి పిలవడం పూర్తిగా మానేసారు. సినిమా కు కమిట్ అయితే షూటింగ్ పూర్తిచేసి వెళ్లిపోవడం మినహా ఎలాంటి కార్యక్రమాలతో సంబంధం లేదు. నయనతార ఎంత పెద్ద సినిమాలో నటించినా అదే రూల్ ఇప్పటికీ పని చేస్తుంది. అయితే `మనశంకరవరప్రసాద్ గారు` సినిమా కోసం ఆ కండీషన్లు అన్నీ బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు అనీల్ రావిపూడి తో ఉన్న చనువు కారణంగా రెండు ప్రమోషనల్ వీడియోల్లో భాగమై సినిమాను ప్రచారం చేసిన వైనం తెలిసిందే.
తాజాగా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా నయనతార అందుబాటులో ఉంటే? ఎలాగైనా కన్విన్స్ చేసి తీసుకొచ్చేవాడిని పబ్లిక్ గానే అనీల్ ప్రకటించాడు. అయితే ఇప్పుడీ వ్యవహారంపై కోలీవుడ్ లో కాక మొదలైంది. సొంత భాషలో సినిమాలు వదిలేసి తెలుగు సినిమాను ఎలా ప్రమోట్ చేస్తుందంటూ అక్కడ దర్శక, నిర్మాతలు క్శశ్చన్ చేస్తున్నారు. తమిళ సినిమాలు అంటే నీకు `తక్కాలీ చట్నీ` ( అంటే టమోటా పచ్చడి) లా చులకనగా కనిపిస్తున్నాయా? అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ తెరపైకి వచ్చింది.
తమిళ నిర్మాతల్ని ఇబ్బంది పెట్టి తెలుగు నిర్మాతల కోసం ప్రచారం చేస్తుందా? అంటూ నిర్మాతలు రుసరు సలాడుతున్నారు. మరి ఈ విమర్శలపై లేడీ సూపర్ స్టార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇది పూర్తిగా నయన తార వ్యక్తిగత విషయం. ఏ సినిమాకు ప్రచారం చేయాలి? ఏ సినిమాకు ప్రచారం చేయకూడదు? అన్నది ఆమె నిర్ణయం ప్రకారం జరుగుతుంది. తాను ప్రధాన పాత్రలు పోషించిన సినిమాల్ని కూడా ఏ నాడు ప్రచారం చేయలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఎలాంటి ప్రచారం నిర్వహించలేదు.