త్రిష‌కు చెక్ పెట్టేందుకే స్పీడ్ పెంచిందా?

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార సినిమాల స్పీడ్ పెంచింది. రెండేళ్ల‌గా రెండు సినిమాల‌కే ప‌రిమిత‌మైన అమ్మ‌డు 2026లో ఏకంగా తొమ్మిది సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతుంది.;

Update: 2026-01-05 04:39 GMT

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార సినిమాల స్పీడ్ పెంచింది. రెండేళ్ల‌గా రెండు సినిమాల‌కే ప‌రిమిత‌మైన అమ్మ‌డు 2026లో ఏకంగా తొమ్మిది సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతుంది. వీటిలో త‌మిళ్, తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ ప్రాజెక్ట్ లున్నాయి. ఒకే భాష‌కు ప‌రిమితం కాకుండా తెలివిగా సౌత్ లో అన్ని భాష‌ల్ని బ్యాలెన్స్ చేస్తోంది. మునుపెన్న‌డు న‌య‌న్ ఇన్ని సినిమాలు లైన్ లో పెట్టింది లేదు. ఆచితూచి అడుగులు వేసేది. మ‌రి ఈస్పీడ్ కి అస‌లు కార‌ణం ఏంటి? అంటే మ‌రో సీనియ‌ర్ స్టార్ త్రిష వేగానికి చెక్ పెట్టేందుకు న‌య‌న్ పోటీగా క‌మిట్ అవుతోంద‌ని మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి.

గ‌తంలో న‌య‌న్ వ‌దులుకున్న కొన్ని సినిమాల్లో త్రిష న‌టించింది. వాటితో మంచి స‌క్సెస్ అందుకుంది. కొంత‌కాలంగా త్రిష అంత బిజీ గా లేన‌ప్ప‌టికీ సీనియ‌ర్ స్టార్స్ తో అవ‌కాశాలు వ‌స్తే మాత్రం కాద‌నుకుండా ప‌ని చేస్తోంది. పాత్ర ఫ‌రిదితో సంబంధం లేకుండా క‌మిట్ అవుతుంది. ఈ ద‌శ‌లోనే న‌య‌న‌తార‌ సెల‌క్టివ్ గా త‌న పాత్ర‌కు ప్రాధాన్య‌త ఇచ్చింది. కానీ ఇప్పుడా ప్రాధాన్య‌త‌ను ప‌క్క‌న బెట్టి వ‌రుస‌గా సినిమాలు చేయ‌డ‌మే టార్గెట్ గా ప‌ని చేస్తోంది. 'పొన్నియ‌న్ సెల్వ‌న్' త‌ర్వాత త్రిష సినిమాలు చేసే స్పీడ్ పెంచింది. సౌత్ లో ఏ భాష‌లో అవ‌కాశం వ‌చ్చినా నో చెప్ప‌కుండా ప‌ని చేస్తోంది.

నయ‌న్ త‌ర‌హాలోనే త‌మిళ్, మ‌ల‌యాళం, క‌న్న‌డం, తెలుగు సినిమాల్లో న‌టిస్తోంది. గ‌త ఏడాది నాలుగు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. న‌య‌న్ కేవ‌లం ఒక్క సినిమాతోనే క‌నిపించింది. ప్ర‌స్తుతం త్రిష త‌మిళ్ లో 'కురుప్పు', తెలుగులో 'విశ్వంభ‌ర', మ‌ల‌యాళంలో 'రామ్' చిత్రాల్లో న‌టిస్తుంది. మూడు పెద్ద ప్రాజెక్ట్ లే. విజ‌యం సాధించా యంటే త్రిష మునుప‌టి ఛ‌రిష్మాను అందుకో వ‌డం ఖాయం. అదే జ‌రిగితే న‌య‌న‌తార‌పై ఇంపాక్ట్ త‌ప్ప‌దు. ఇది గెస్ చేసిన న‌య‌న్ అలెర్ట్ అయిన‌ట్లు తాజా లైన‌ప్ ని బ‌ట్టి తెలుస్తోంది. అవ‌కాశాలు వ‌చ్చినా? నో చెప్పిన న‌టిని వెన‌క్కి పంపించ‌డం పెద్ద విష‌యం కాదు.

పోటీ రంగంలో ఎంత ఫామ్ లో ఉన్నా? ఆ వేగాన్ని కంటున్యూ చేయాలి. లేదంటే? వ‌చ్చే అవ‌కాశాలు చేజార‌డం ఖాయం. ఆ స్థానాన్ని మ‌రో న‌టి ఆక్ర‌మించే అవ‌కాశం ఉంది. ఈ విష‌యాన్ని న‌య‌న్ గ్ర‌హించి అలెర్ట్ అయిన‌ట్లు తెలుస్తోంది. సౌత్ లో నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ ఎవ‌రంటే? అంతా న‌య‌న‌తార పేరు చెబుతారు. ఆ పేరు మార‌కుండా ఉండాలంటే? పారితోషికంతో పాటు గ్యాప్ లేకుండా సినిమాలు చేసిన‌ప్పుడే ఆస్థానం నిల‌బ‌డుతుంది. లేడీ సూప‌ర్ స్టార్ ఆ విష‌యంలో రెండు ఆకులు ఎక్కువే చ‌దివింది.

Tags:    

Similar News