ఆరేళ్లు నాతో నడిచారు.. డైరెక్టర్ పై నారా రోహిత్ కామెంట్!
నారా రోహిత్.. నటుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూశారు.;
నారా రోహిత్.. నటుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూశారు. అలా 'ప్రతినిధి 2' సినిమాతో సక్సెస్ అందుకున్న నారా రోహిత్.. ఆ తర్వాత మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి 'భైరవం' సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు 'సుందరకాండ' అంటూ నిమ్మలపూడి వెంకటేష్ దర్శకత్వంలో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలను దోచుకున్నారు.
తాజాగా వినాయక చవితి (ఆగస్ట్ 27) సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఒక వర్గం ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రముఖ సీనియర్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ ఈ సినిమా ద్వారా మళ్ళీ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నారు. ఈమెతో పాటు వృతి వాఘని మరో హీరోయిన్ గా నటించింది. ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నా.. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ రీసెంట్ గా రిలీజ్ అయింది. ముఖ్యంగా నారా రోహిత్ తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇకపోతే తాజాగా సక్సెస్ మీట్ పేరుతో ఒక ఈవెంట్ నిర్వహించారు చిత్ర బృందం. అందులో నారా రోహిత్ మాట్లాడుతూ డైరెక్టర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
ఘనంగా సుందరకాండ సక్సెస్ మీట్..
ఈవెంట్ లో భాగంగా నారా రోహిత్ మాట్లాడుతూ.. "సుందరకాండ సినిమా రివ్యూలు చూశాను. అది కొంతమందికి నచ్చింది.. కొంతమందికి నచ్చలేదు. కానీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మీరు మీ ఫీలింగ్ ని సినిమా చూశాక చాలా జెన్యూన్ గా పంచుకున్నారు. ఇది మాకు మరింత ఆనందాన్ని కలిగించింది. ముఖ్యంగా మీ ఫీడ్ బ్యాక్ ను మేము పాజిటివ్ గా తీసుకొని మునుముందు మిస్టేక్స్ ఎక్కడ చేశాము అనే వాటిపై చర్చించి మంచి కథతో వస్తాము. ముందుగా ఆడియన్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు. థియేటర్ కి ఫ్యామిలీతో సహా వచ్చి సినిమా ఎంజాయ్ చేస్తున్నారు. అందరికీ అందుబాటులోనే టికెట్ ధరలు ఉంచాము ఇంకా ఎవరైతే సినిమా చూడలేదో వారంతా కూడా ఫ్యామిలీతో కలిసి సినిమా చూడండి.
ఆరేళ్లపాటు నాతో నడిచారు.. డైరెక్టర్ పై ప్రశంసలు..
ఇప్పటివరకు ఈ జానర్ థియేటర్లలో రాలేదని చాలామంది ఫీల్ అయ్యేవారు. కానీ ఇప్పుడు థియేటర్లలో మీకు అందుబాటులో ఉంది. మొదటి నుంచి మేము చెబుతున్నది ఒకటే ఈ సినిమా కచ్చితంగా మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అని.. ఇక ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడికి నేను స్పెషల్ థాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే.. సాధారణంగా ఒక హీరోతో డైరెక్టర్ ఎంత కాలం ఉంటారో.. ఎంతకాలం నడుస్తారో ఒక సినిమా కోసం అనేది నాకు తెలియదు.. కానీ నా కోసం వెంకటేష్ దాదాపు ఆరేళ్లు నాతో ప్రయాణం చేశారు. ఆయన ఎఫర్ట్ లెస్ బాండింగ్ కి ఎప్పటికీ రుణపడి ఉంటాను" అంటూ డైరెక్టర్ పై ప్రశంసలు కురిపించారు నారా రోహిత్. అలాగే ఈ సినిమాలో సత్యకి మంచి క్యారెక్టర్ ఇస్తానని చెప్పి.. ఆ మాట నిలబెట్టుకున్నాను అని కూడా స్పష్టం చేశారు. మొత్తానికైతే సుందరకాండ సక్సెస్ మీట్ లో నారా రోహిత్ ఇచ్చిన స్పీచ్ హైలెట్ గా నిలిచింది.