'పెద్ది'తో పోటీ పడాలంటే ఇది సరిపోదు నాని బ్రో..!

కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చినది ప్యారడైజ్‌ సినిమా ఫుల్‌ స్వింగ్‌లో షూటింగ్‌ జరుపుతున్నామని ఆ మధ్య మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది.;

Update: 2025-11-26 12:30 GMT

నాని హీరోగా బ్యాక్‌ టు బ్యాక్‌ సక్సెస్‌లు చూసుకుంటూ వస్తున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్‌ 3 ఇలా వరుస విజయాలతో దూకుడు మీదున్న నాని ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో 'ది ప్యారడైజ్‌' అనే సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో 'దసరా' సినిమా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా చిరంజీవి వంటి పెద్ద స్టార్‌ హీరో శ్రీకాంత్‌ ఓదెలను పిలిచి మరీ ఆఫర్‌ ఇచ్చాడు, ఇద్దరి కాంబో సెట్‌ అయ్యింది అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. ఆ సినిమా ప్రకటనతో ది ప్యారడైజ్‌ సినిమా క్రేజ్ మరింతగా పెరిగింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చినది ప్యారడైజ్‌ సినిమా ఫుల్‌ స్వింగ్‌లో షూటింగ్‌ జరుపుతున్నామని ఆ మధ్య మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది.

నాని హీరోగా ది ప్యారడైజ్ సినిమా...

ది ప్యారడైజ్ సినిమాను 2026 మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది. సమ్మర్‌ ఆరంభంలోనే ఈ సినిమాను తీసుకు రావడం ద్వారా ప్రయోజనం పొందాలని నాని అండ్ టీం భావిస్తున్నారట. అయితే రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' సినిమా సైతం 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంటే ఒక్క రోజు గ్యాప్‌లోనే పెద్ది సినిమాతో పాటు ది ప్యారడైజ్‌ సినిమా రాబోతుంది. ఇప్పటి వరకు విడుదల తేదీ విషయంలో మార్పు లేదు అన్నట్లుగానే చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతూ వస్తున్నారు. అదే తేదీకి వస్తే చాలా పెద్ద సినిమాతో పోటీ పడాల్సి ఉంటుంది. అంతటి పోటీలో నిలబడాలి అంటే కచ్చితంగా సినిమాను అంతకు మించి అన్నట్లుగా ప్రమోట్‌ చేసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్‌..

సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని హీరోగా నటిస్తూ ఉండగా, సోనాలి కులకర్ణి హీరోయిన్‌గా కనిపించబోతుంది. ఈ సినిమాలో టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే యూనిట్‌ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా కోసం మోహన్‌ బాబు కాస్త ఎక్కువగానే చార్జ్‌ చేశాడు అంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్‌ విషయమై నాని ఫ్యాన్స్‌లో టెన్షన్‌ మొదలైంది. ఇప్పటి వరకు సినిమా గురించి ఎలాంటి హడావుడి లేదు. ఈ సినిమాకి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. కనుక కచ్చితంగా మంచి పాటలు ఉంటాయి. సినిమాకు బజ్ క్రియేట్‌ చేయాలంటే కేవలం పాటలతోనే సాధ్యం అవుతుంది అనేది చాలా మంది అభిప్రాయం. కనుక మొదటి సాంగ్‌ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.

రామ్‌ చరణ్ పెద్ది సినిమాకు పోటీగా...

పోటీగా ఉన్న పెద్ది నుంచి ఇటీవలే వచ్చిన చికిరి సాంగ్ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాంతో పోటీగా రాబోతున్న సినిమా పెద్ది చాలా ముందు ఉంది. నాని ది ప్యారడైజ్‌ సినిమా మాత్రం ఇప్పటి వరకు ప్రమోషన్‌ మొదలు పెట్టలేదు. మరో వైపు చిత్ర యూనిట్‌ సభ్యుల్లో అంతా సవ్యంగా లేదని, ఎక్కడో అసంతృప్తి, గొడవ వంటివి ఉన్నాయనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే యూనిట్‌ సభ్యులు మాత్రం ఆ పుకార్లను కొట్టి పారేస్తున్నారు. ది ప్యారడైజ్‌ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. సినిమాను అదే తేదీకి విడుదల చేయాలంటే ఈ నెల చివరి నుంచి అయినా ప్రమోషన్‌ మొదలు పెట్టాలి. వచ్చే నెల నుంచి ది ప్యారడైజ్‌ గురించి మీడియాలో ప్రచారం జరిగితేనే సినిమాకు మంచి బిజినెస్ జరుగుతుంది. ఇప్పటికే ఉన్న బజ్‌ ను పెంచే విధంగా ప్రమోషన్‌ జరగాల్సిన అవసరం ఉందని నాని ఫ్యాన్స్ అంటున్నారు. మరి అందుకు శ్రీకాంత్‌ ఓదెల చేసేది ఏంటో చూడాలి. పెద్దితో పోటీ పడాలంటే ఈ సైలెన్స్ కరెక్ట్‌ కాదని నాని కి ఫ్యాన్స్‌ సున్నితంగా హెచ్చరికలు చేస్తున్నారు. నాని ఇకపై అయినా స్పీడ్‌ పెంచుతాడేమో చూడాలి.

Tags:    

Similar News