`ది ప్యారడైజ్`.. నాని తగ్గేదేలే అంటున్నాడే!
దీంతో మెగా హీరో చరణ్‌తో నానికి తొలి సారి పోటీ ఎదురుకాబోతోందనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా `హిట్ 3` ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నాని దీనిపై క్లారిటీ ఇచ్చారు.;
నేచురల్ స్టార్ నాని నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ `హిట్ ద థర్డ్ కేస్`. శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడు. `కేజీఎఫ్` ఫేమ్ శ్రీనిధిశెట్టి తొలి సారి నానికి జోడీగా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. `హిట్` ఫ్రాంఛైజీలో భాగంగా వస్తున్న థర్డ్ ఇన్స్‌స్టాల్మెంట్ ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ మే 1న పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. హీరోగా, ప్రజెంటర్‌గా రెండు బాధ్యతల్ని నిర్వహిస్తున్నాడు నాని.
దీంతో ప్రచార బాధ్యతల్ని కూడా తన భుజాలకెత్తుకుని ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచారు. త్వరలో అమెరికాలోనూ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్న నాని తనతో పాటు హీరోయిన్‌ని కూడా అక్కడ రంగంలోకి దించేస్తున్నాడు. మే 6 వరకు అక్కడే పర్యటించి ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా గడిపేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ తరువాత నాని చేస్తున్న మూవీ `ది ప్యారడైజ్`. `దసరా` ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ఇది.
నానితో `దసరా` మూవీని నిర్మించిన నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. సికింద్రాబాద్‌లో జరిగిన ఓ యధార్ధ కథ ఆధారంగా తెలంగాణ రచయిత రాసిన ఓ సవలని ఆధారంగా చేసుకుని శ్రీకాంత్ ఓదెల ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. రా కంటెంట్‌తో రూపొందుతున్న ఈ మూవీని వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇదే రోజున రామ్ చరణ్ `పెద్ది` కూడా రాబోతోంది.
దీంతో మెగా హీరో చరణ్‌తో నానికి తొలి సారి పోటీ ఎదురుకాబోతోందనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా `హిట్ 3` ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నాని దీనిపై క్లారిటీ ఇచ్చారు. మేం ఆ డేట్‌న రావాలనే పట్టుదలతో ఉన్నాం. అందు కోసం సిన్సియర్‌గా వర్క్ చేస్తున్నాం. డేట్‌ని దృష్టిలో పెట్టుకుని షూటింగ్ చేస్తున్నాం. అయితే మా సినిమా, చరణ్ సినిమా షూటింగ్‌లు అనుకున్న విధంగా జరగాలి. అలా జరిగి అవి రెండూ ఒకేరోజు రిలీజ్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఎలా వెళ్లాలన్నది చర్చించుకుంటాం.
`ది ప్యారడైజ్`కు నిర్మాతను నేను కాదు కాబట్టి రిలీజ్ డేట్‌ని ఫైనల్ చేయలేను. కానీ రెండు సినిమాలు ఒకే డేట్‌న రిలీజ్ అయ్యే పరిస్థితి ఎదురైనా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. రెండు సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాం. ప్రతి సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బాగుంటే అన్ని ఆడతాయి. అదే విధంఆ సమ్మర్ సీజన్‌లో రెండు మూడుసినిమాలు ఒకే రోజు రిలీజ్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రిలీజ్ డేట్ విషయం గురించి అప్పుడు ఆలోచిద్దాం. కానీ మేము మాత్రం ఆ డేట్‌ని టార్గెట్‌గా పెట్టుకుని షూటింగ్ చేస్తున్నాం` అని ఫైనల్‌గా నాని తేల్చేశాడు. అంటే పోటీ ఉన్నా సరే `పెద్ది` డేట్‌నే మేమూ వస్తామని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.