షాకింగ్ స్టైల్ లో నమ్రత.. 53 ఏళ్లైనా ఇంకా యంగ్ గానే..
ఒకప్పటి హీరోయిన్, సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ గురించి అందరికీ తెలిసిందే.;
ఒకప్పటి హీరోయిన్, సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పడు సినిమాలతో అలరించిన ఆమె.. ఇప్పుడు ఫ్యామిలీకి పూర్తిగా పరిమితమయ్యారు. మహేష్ కు సంబంధించిన అన్ని వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. డేట్స్, మూవీస్, యాడ్స్, డ్రెస్సింగ్, వ్యాపారాలు.. అలా అన్నింటా నమ్రత శిరోద్కర్ మార్క్ చూపిస్తున్నారని సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉంటుంది.
అదే సమయంలో సోషల్ మీడియాలో ఆమె ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ షేర్ చేస్తుంటారు. తరచూ ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లే నమ్రత.. అక్కడ దిగిన పిక్స్ ను వెంటనే నెట్టింట షేర్ చేసి సందడి చేస్తుంటారు. తన ఇద్దరు పిల్లలకు సంబంధించిన విషయాలు పంచుకుంటూ ఉంటారు. అలా తరచూ నమ్రతా శిరోద్కర్ పెట్టిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి.. కనిపిస్తూనే ఉంటాయి.
తాజాగా తన లుక్ తో ఒక్కసారిగా షాకిచ్చారు నమ్రత. న్యూ హెయిర్ స్టైల్ చేయించుకున్న ఆమె.. బాబ్ కట్ లో దిగిన పిక్స్ ను షేర్ చేయడం విశేషం. వైట్ కలర్ షర్ట్, బ్లూ కలర్ ప్యాంట్ , స్టైలిష్ గాగుల్స్ లో ఉన్న నమ్రత.. తన పెంపుడు కుక్కలతో పోజు ఇచ్చారు. అందుకు సంబంధించిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మేడం చాలా యంగ్ గా కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
53 ఏళ్ల ఏజ్ లో వేరే లెవెల్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారని కొనియాడుతున్నారు. సూపర్ పిక్ అంటూ వైరల్ చేస్తున్నారు. కాగా, మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నమ్రత, అప్పట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత 1993లో మిస్ ఇండియా టైటిల్ ను గెలుచుకుని సత్తా చాటారు. అదే సమయంలో పలు అందాల పోటీల్లో పార్టిసిపేట్ చేసి సందడి చేశారు.
1998లో జబ్ ప్యార్ కిస్సే హోతా హై సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకున్నారు. ఆ సమయంలో టాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడ్డారు. మహేష్ బాబు వంశీ మూవీలో నటించే ఛాన్స్ అందుకుని నటించారు. అప్పుడే మహేష్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న ఆమె.. సినిమాలకు దూరంగా ఉంటున్నా.. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.