• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కల్కి.. నాగ్ అశ్విన్...

కల్కి.. నాగ్ అశ్విన్ ప్లాన్ వేరే లెవల్

| అందులో భాగంగా మూవీ రిలీజ్ కు ముందు ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా కథను విడుదలకు ముందే చెప్తారంటూ టాక్ వినిపిస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-04-06 08:29 GMT

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తున్న చిత్రం కల్కి 2898 ఏడీ. సూపర్ హీరో కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీగా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మే9వ తేదీన విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమే అన్నట్లు తెలుస్తోంది. మేకర్స్ కొత్త డేట్ ను కూడా లాక్ చేశారని వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం హాలీవుడ్ నిపుణులు వీఎఫ్ ఎక్స్ వర్క్స్ పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా.. హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతోందని మేకర్స్ ఇన్ డైరెక్ట్ గా సంకేతాలు ఇచ్చారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. ఆ రోజు నుంచి ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా మూవీ రిలీజ్ కు ముందు ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా కథను విడుదలకు ముందే చెప్తారంటూ టాక్ వినిపిస్తోంది. మూవీలోని రోల్స్ ను యానిమేషన్ వీడియోల రూపంలో మేకర్స్ పరిచయం చేయనున్నారట. ఈ ప్లీలూడ్ వీడియోస్ ఓటీటీలో రిలీజ్ అవుతాయని, అందుకు నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే అగ్రిమెంట్ చేసుకుందని తెలుస్తోంది.

సరిగ్గా మూవీ రిలీజ్ కు నెల రోజుల ముందు ఈ వీడియోస్ స్ట్రీమింగ్ అవ్వనున్నాయట. ఇప్పటికే ఈ వీడియోలకు సంబంధించి యానిమేషన్ తో పాటు డబ్బింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయినట్లు సమాచారం. త్వరలోనే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ యానిమేటెడ్ వీడియోస్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నాగ్ అశ్విన్ ప్లాన్ నెక్స్ట్ లెవల్ లో ఉందని అంటున్నారు.

కేవలం మూవీ హాలీవుడ్ రేంజ్ లో ఉండడం కాకుండా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేస్తున్నారని నెటిజన్లు చెబుతున్నారు. సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతాయని అంటున్నారు. మూవీ కథ ఎలా ఉంటుందో తెలుసుకుని థియేటర్ కు వెళ్తే ఆ కిక్కే వేరని కామెంట్లు పెడుతున్నారు. మరి కల్కి మూవీ థియేటర్లలో విడుదలయ్యాక ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

Tags:    
  • Nagashwin 
  • Kalki2898ad 
  • Prabhas 
  • Movieshooting 
  • Vfxwork 
  • Amitabhbachan 
  • Kamalhassan 
  • Dishapatani 
  • Deepikapadukone 
  • Ranadagubati 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS