ది కింగ్ అండ్ వర్సటైల్ స్టార్ నాగార్జున..!
ఏఎన్నార్ నట వారసత్వాన్ని అందుకుని ఆయన కూడా లెజెండరీ యాక్టర్ గా మారి ప్రేక్షకుల మనసులు గెలిచారు అక్కినేని నాగార్జున.;
ఏఎన్నార్ నట వారసత్వాన్ని అందుకుని ఆయన కూడా లెజెండరీ యాక్టర్ గా మారి ప్రేక్షకుల మనసులు గెలిచారు అక్కినేని నాగార్జున. నేడు 66వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు మన నవ యవ్వన మన్మధుడు. తెలుగు సినిమా హిస్టరీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న యాక్టర్ కింగ్ అక్కినేని నాగార్జున. దాదాపు 4 దశాబ్దా కెరీర్ లో నటుడు, నిర్మాత, హోస్ట్ గా ఆబాల గోపాలాన్ని అలరిస్తూ వస్తున్నారు. ఇండియన్ సినిమాకు ప్రొఫెషనల్ గా, పర్సనల్ గా నాగార్జున చేస్తున్న కంట్రిబ్యూషన్ కి ఆయనకు ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలను తెచ్చి పెట్టింది.
నటుడిగా తొలి అడుగులు వేసింది చైల్డ్ ఆర్టిస్ట్ గా.. నాగార్జున 1961లో వెలుగు నీడలు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేశారు. దానితో పాటు 1967లో సుడిగుండాలు సినిమాలో కూడా నటించారు. విక్రమ్ సినిమాతో లీడ్ యాక్టర్ గా టర్న్ తీసుకున్నారు నాగార్జున. అప్పటి నుంచి రీసెంట్ గా వచ్చిన కూలీ వరకు 99 సినిమాల్లో తన అభినయంతో మెప్పిస్తూ వస్తున్నారు.
నాగార్జున యూఎస్ లో మాస్టర్స్..
నాగార్జున ఎడ్యుకేషన్ విషయానికి వస్తే.. ఆటో మొబైల్ ఇంజినీరింగ్ చేసిన నాగార్జున యూఎస్ లో సాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేశరు. అప్పట్లో ఆటో మొబైల్ ఇంజినీరింగ్ గురించి ఎవరికి తెలియదు. అలాటి టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసి అప్పట్లోనే వార్తల్లో నిలిచారు నాగార్జున.
ఇక సోషల్ వర్క్ లో కూడా నాగార్జున తన ఇంట్రెస్ట్ ని కొనసాగించారు. నాగార్జున హైదరాబాద్ బ్లూ క్రాస్ సొసైటీ కో ఫౌండర్ గా పనిచేశారు. అది ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్.. అమల్ అక్కినేని దానికి సంబందించిన విషయాలన్ చూస్తుంటారు.
నాగార్జున 66లో కూడా యంగ్ లుక్ తో..
నాగార్జున నేడు 66 ఇయర్స్ లోకి అడుగు పెట్టారు. ఐతే ఆయన ఇప్పటికీ చాలా యంగ్ లుక్ తో అదరగొట్టేస్తారు. ఫిట్ నెస్ లో ఆయన తర్వాతే ఎవరైనా అనేలా కనిపిస్తారు. మంచి డైట్ కండీషన్స్ ఇంకా ఎర్లీ డిన్నర్స్, ఫాస్టింగ్ లాంటి యాక్టివిటీస్ నాగార్జునని నిత్య యవ్వనంగా ఉండేలా చేస్తాయి. 35 ఏళ్లుగా నాగార్జున వర్క్ అవుట్స్ చేస్తూనే ఉన్నారు. ఒక్కరోజు కూడా ఆయన వర్క్ అవుట్ చేయకుండా ఉండలేదంటే ఆయన డెడికేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
బిగ్ స్టార్స్ టీవీల్లో కనిపించడానికి ఇబ్బంది పడతారు. బుల్లితెర మీద కనిపిస్తే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావిస్తారు. కానీ టాలీవుడ్ స్టార్ అయినా మొదట టీవీలో మీలో ఎవరు కోటీశ్వరుడు షో చేసి మెప్పించారు నాగార్జున. 2014-15లో ఆ షో ద్వారా నాగార్జున ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.
బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున..
ఇక ఆ తర్వాత ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కు కూడా నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్నారు. బిగ్ బాస్ షోలో ఆయన ఎనర్జిటిక్ హోస్టింగ్ షోని ఇష్టపడే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 కంప్లీట్ చేసుకుని సీజన్ 9 కి రెడీ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో మొదలు కాబోతుంది.
ఒకేలా సినిమాలు చేయడం కాదు ప్రయోగాలు చేస్తూ సత్తా చాటారు నాగార్జున. శివ సినిమాతో ఆయన తెలుగు సినిమాకు కొత్త టర్న్ తీసుకొచ్చారు. ఆ సినిమా తర్వాతే ఎన్నో సినిమాలు అదే ఫార్మెట్ ని ఫాలో అయ్యాయి. ఇక గీతాంజలి సినిమాతో కూడా నాగార్జున అదరగొట్టారు. కమర్షియల్ హీరో అయ్యాక కూడా అన్నమయ్య సినిమా చేసి ఆశ్చర్యపరిచారు నాగార్జున. నాగార్జున ఏంటి అన్నమయ్య ఏంటి అన్న వాళ్లకి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తూ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ తో సంబ్రమాశ్చర్యాలకు గురి చేశారు నాగార్జున.
నాగార్జున వర్సటాలిటీ..
ఇదే కాదు రీసెంట్ గా కుబేర, కూలీ సినిమాలో కూడా తన వర్సటాలిటీ చూపించారు. హిందీ, తమిళ్ సినిమాల్లో కూడా నటించి సత్తా చాటారు నాగార్జున. నాగార్జునకు జపాన్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జపాన్ లో ఆయన్ను నాగ్ సామ అని పిలుస్తారు. సామ అంటే గ్రేట్ రెస్పెక్ట్ అన్నమాట. నాగార్జున అంటే అక్కడి ఆడియన్స్ కు ఎంతో రెస్పెక్ట్ అందుకే నాగ్ సామ అంటూ అక్కడ ఆయన్ను పిలుస్తారు. నాగార్జున సినిమాలు అక్కడ మంచి సక్సెస్ సాధించాయి. ఆయన నటించిన శివ, బ్రహ్మాస్త్ర సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈమధ్యనే మనం సినిమా జపాన్ లో రిలీజై ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది.
హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా కూడా నాగార్జున ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ముఖ్యంగా ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో నాగార్జున ముందుంటారు. దాదాపు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ నుంచి 40 కొత్త డైరెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు.
ఇప్పటివరకు కెరీర్ లో 99 సినిమాలు పూర్తి చేసుకున్న నాగార్జున మైల్ స్టోన్ మూవీ 100వ సినిమా అనౌన్స్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తూ.. ఎంతో మందికి మార్గనిర్దేశంగా ఉంటూ అక్కినేని నాగార్జున ఇదే చరిష్మా కొనసాగించాలని కోరుకుందాం. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న అక్కినేని నాగార్జునకు స్పెషల్ బర్త్ డే విషెస్ అందిస్తుంది టీమ్ తుపాకి.కామ్.