సెంచ‌రీలో ముగ్గురు భామ‌లా?

కింగ్ నాగార్జున 100వ చిత్రంపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. `రా కార్తీక్` దర్శకత్వంలో మొద‌లైన ప్రాజెక్ట్ ఎంత సైలెంట్ గా ప‌ట్టాలెక్కిందో? షూటింగ్ కూడా అంతే సైలెంట్ గా జ‌రుగుతోంది.;

Update: 2026-04-01 06:30 GMT

కింగ్ నాగార్జున 100వ చిత్రంపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. `రా కార్తీక్` దర్శకత్వంలో మొద‌లైన ప్రాజెక్ట్ ఎంత సైలెంట్ గా ప‌ట్టాలెక్కిందో? షూటింగ్ కూడా అంతే సైలెంట్ గా జ‌రుగుతోంది. టీమ్ ఎక్క‌డా పెద్ద‌గా హ‌డావుడి చేయ‌లేదు. కంటెంట్ మాట్లాడాలి త‌ప్ప క‌టౌట్ కాదంటూ గ‌మ్ముగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జునను అత్యంత స్టైలిష్‌గా చూపించేందుకు కార్తీక్ డీ-ఏజింగ్ టెక్నాలజీని వాడుతున్నారు. అలాగే సినిమాకు `లాటరీ కింగ్` అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇందులో హీరోయిన్లు ఎవ‌రు? అన్న‌ది ఇంత‌వ‌ర‌కూ అధికారికంగా క‌న్ప‌మ్ కాలేదు.

కానీ ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తున్న‌ట్లు బ‌ల‌మైన ప్ర‌చారం జ‌ర‌గుతోంది. దీనిలో భాగంగా నాగార్జునతో గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన టబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ట‌బు ఆయ‌న‌కు భార్య పాత్ర‌లో క‌నిపించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ మరోసారి ఆక‌ట్టుకుంటుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రెండ‌వ హీరోయిన్‌గా సుస్మితా భట్ పేరు ఇప్పటికే ఖరారైన‌ట్లు వినిపిస్తోంది. ఈ బ్యూటీ `నాట్యం` వంటి చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మ‌డు చెన్నై బ్యూటీ. నాలుగేళ్ల క్రిత‌మే కెరీర్ ప్రారంభించింది.

త‌మిళ‌-మ‌ల‌యాళంలో సినిమాలు చేస్తోంది. కానీ ఇంకా పెద్ద‌గా ఫేమ‌స్ కాలేదు. అలాంటి న‌టిని కార్తీక్ ఎంపిక చేసాడు. కానీ మంచి ప్ర‌తిభావంతురాలిగా పేరుంది. పైగా ద‌ర్శ‌కుడు కూడా త‌మీళియ‌న్ కావ‌డం సుస్మితా భ‌ట్ కు క‌లిసొచ్చిన అంశంగా చెప్పొచ్చు. తాజాగా మూడవ హీరోయిన్ పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ పాత్ర‌కు ఐశ్వ‌ర్య అయితే ప‌క్కాగా న్యాయం చేయ‌గ‌ల్గుతుంద‌ని ద‌ర్శ‌కుడు భావిస్తున్నాడుట‌. ఐశ్వ‌ర్యా రాజేష్ ఇప్ప‌టికే `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రంలో వెంక‌టేష్ కు జోడీగా న‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఆద్యంతం ఆ జోడీ తెర‌పై న‌వ్వులు పూయించింది. ఇద్ద‌రి కాంబినేష‌న్ బాగా సెట్ అయింది. ఈ నేప‌థ్యంలో కార్తీక్ కూడా ఐశ్వ‌ర్య వైపు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురు హీరోయిన్ల ఎంపికపై చిత్రబృందం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఓ పాత్ర కోసం అనుష్క శెట్టి పేరు కూడా వినిపించింది. కానీ ఆ త‌ర్వాత అమ్మ‌డి పేరు హైడ్ అయింది. క‌థ విష‌యంలో నాగార్జున పెద్ద‌గా అద్బుతాలేమి చేయ‌లేదు. యాక్షన్ ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసిన ప్రాజెక్ట్ ఇది. నాగార్జున తన కెరీర్‌లోని అన్ని దశలను ప్రతిబింబించేలా సినిమాలో విభిన్న గెటప్పులతో కనిపిస్తారని స‌మాచారం. దీనిలో భాగంగా ద‌ర్శ‌కుడు ముగ్గురు హీరోయిన్ల ఛాయిస్ తీసుకుం టున్నాడు. ఇలా ముగ్గురు భామ‌ల‌తో రొమాన్స్ చేయ‌డం కింగ్ కి కొత్తేం కాదు. గ‌తంలో ఎన్నో చిత్రాల్లో ముగ్గురు భామ‌ల ముద్దుల ప్రియుడిగా హైలైట్ అయ్యారు. ఈ విష‌యంలో మిగ‌తా సీనియ‌ర్ల కంటే నాగార్జున గ్రేట్ అనిపిస్తారు.

Tags:    

Similar News