కింగ్ 100 మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ డేట్ లాక్.. నాగ్ ఆ మైల్ స్టోన్ అందుకుంటాడా?
ఈ సినిమా షూటింగు సగ భాగానికి పైగా పూర్తయినప్పటికీ కూడా.. కనీసం ఒక్క పోస్టర్ని కూడా రిలీజ్ చేయకపోవడంతో సినీ ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేశారు.
నవ మన్మధుడిగా 66 సంవత్సరాల వయసులో కూడా అంతే యంగ్ గా కనిపిస్తూ.. ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న నాగార్జున గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మాస్, యాక్షన్, రొమాంటిక్ ,ఫ్యామిలీ ఇలా ఎన్నో జానర్ లలో సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగార్జున, ఈ మధ్యకాలంలో నేరుగా ఒక్క సినిమా కూడా చేయకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈయన తోటి హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి , వెంకటేష్ వరుసగా సినిమాలు ప్రకటిస్తూ.. బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకుంటుంటే.. నాగార్జున మాత్రం ఇతర స్టార్ హీరోల చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ బిజీగా మారిపోయారు.
ఈ నేపథ్యంలోనే నాగార్జున తన 100వ చిత్రం ప్రకటన కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూడగా.. ఏకంగా తన జీవితంలో మైల్ స్టోన్ గా నిలిచిపోయే 100వ సినిమాను ఏకంగా కోలీవుడ్ డైరెక్టర్ చేతుల్లో పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ రా. కార్తీక్ దర్శకత్వంలో తన 100వ సినిమాను ప్రకటించారు.
ఈ సినిమా షూటింగు సగ భాగానికి పైగా పూర్తయినప్పటికీ కూడా.. కనీసం ఒక్క పోస్టర్ని కూడా రిలీజ్ చేయకపోవడంతో సినీ ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేశారు. ఇక ఎప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్ వస్తుందంటూ ఆశగా ఎదురు చూశారు. ఎలాగో నాగార్జున బర్త్డే ఆగస్టు 29న ఉంది. కాబట్టి బహుశా ఆరోజు ఏదైనా అప్డేట్ వదులుతారేమో అని ఎదురు చూడగా.. ఇప్పుడు ఆ అనుమానాలకు తెరదింపేశారు చిత్ర బృందం.
ఇక అందులో భాగంగానే ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. అక్కినేని నాగార్జున సొంత నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కోర్టు రూమ్ ఫోటోని షేర్ చేస్తూ.." ప్రతి కుటుంబం వెనుక ఒక కథ ఉంటుంది. ఆ కుటుంబం వెనుక అంతులేని గందరగోళం ఉంటుంది.
అయితే ఈ గందరగోళానికి తెర దించుతూ అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ మూవీస్ ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒక వినోదాత్మక చిత్రాన్ని మీ ముందుకు తీసుకు రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ గ్లింప్స్ జూలై 17వ తేదీన రిలీజ్ చేయబోతున్నాము. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడడానికి మీరు వేచి ఉండండి " అంటూ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో గ్లాస్ , టూత్ బ్రష్ ని కూడా పంచుకోవడంతో నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే నాగార్జున కెరియర్లో అత్యంత ప్రెస్టేజియస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా అనుకున్నట్టుగానే వంద కోట్లు రాబట్టి.. ఆయన కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలబడుతుందా ? అన్న విషయం తెలియాల్సి ఉంది.