సౌత్ స్టార్ విలన్.. సక్సెస్ సీక్రెట్ అదేనా..?
సినిమాల్లో హీరోలను గుర్తు పెట్టుకున్నంతగా విలన్ లను గుర్తుపెట్టుకోరు.. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో విలన్లంటే ప్రత్యేకంగా నటులు ఉండేవారు.
సినిమాల్లో హీరోలను గుర్తు పెట్టుకున్నంతగా విలన్ లను గుర్తుపెట్టుకోరు.. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో విలన్లంటే ప్రత్యేకంగా నటులు ఉండేవారు. అయితే ఈమధ్య ట్రెండ్ మారింది హీరోలు, కమెడియన్లు కూడా విలన్ లుగా చేస్తున్నారు. అయితే వీరిలో విలన్ గా ముఖ్యంగా సౌత్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ ఏర్పరచుకున్నారు ముఖేష్ రుషి. 1994 లో బాలకృష్ణ హీరోగా చేసిన గాండీవం సినిమా నుంచి తెలుగులో ఆయన ప్రతి నాయకుడు పాత్రలు చేస్తూనే ఉన్నారు.
తెలుగులో ముఖేష్ రుషి విలన్ గా చేసిన అన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. తనదైన విలనిజం తో ఎలాంటి పాత్ర అయినా మన స్టార్స్ కి ఢీ అంటే ఢీ అనేలా చేస్తూ వచ్చారు ముఖేష్ రుషి. ఐతే సౌత్ లో ఆయన ఈ రేంజ్ సక్సెస్ అందుకోవడానికి తన టైం పంచ్యువాలిటీనే కారణమని ఆయన అంటున్నారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో విలన్ గా తనకంటూ ప్రత్యేక స్థానం ఇచ్చిన ఆడియన్స్ కు కృతజ్ఞతలు తెలిపారు.
సినిమా షూటింగ్ విషయంలో కచ్చితమైన టైం ని పాటిస్తా.. అదే నన్ను సక్సెస్ వైపు నడిపించిందని అన్నారు ముఖేష్ రుషి. తన కన్నా ముందు విలన్ గా నటించిన వారు కొందరు సమయపాలన పాటించే వారు కాదని అందరు అంటుంటారు. అయితే తాను అలా మాట రాకుండా జాగ్రత్త పడాలని అనుకున్నా అందుకే ఇక్కడ విలన్ గా సూపర్ క్లిక్ అయ్యానని అంటున్నారు ముఖేష్ రుషి.
అయితే ఆయన లగాన్ సినిమా ఆఫర్ ను వదులుకున్న విషయాన్ని ప్రస్తావించారు. అమీర్ ఖాన్ తో చేసిన సర్పరోష్ సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమాలో నటించిన తనను లగాన్ లో కూడా తీసుకోవాలని అనుకున్నారు. అమీర్ పిలిచి కథ చెప్పారు. తనకు బాగా నచ్చింది. అయితే ఆ సినిమాకు నెలల కొద్దీ డేట్స్ ఇవ్వాలని చెప్పగా అప్పటికే కొన్ని సౌత్ సినిమాలను సైన్ చేసిన తాను విషయాన్ని అమీర్ కి చెప్పడంతో ఆయన ఓకే అన్నారని వెల్లడించారు. టాలీవుడ్ స్టార్స్ అందరి సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు ముఖేష్ రుషి. ఆయన నటించిన నరసింహ నాయుడు, ఇంద్ర, ఒక్కడు, సిం హాద్రి, జల్సా సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. లగాన్ సినిమాకు కూడా డేట్స్ అడ్జెస్ట్ చేస్తే ఆయన కెరీర్ ఎలా ఉండేదో కానీ ఆ సినిమా మిస్సైనా సరే సౌత్ లో స్టార్ విలన్ గా తనదైన ప్రస్థానం కొనసాగించారు ముఖేష్ రుషి.