• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మిస్టర్ అండ్ మిస్.....

మిస్టర్ అండ్ మిస్.. క్యాలరీలు ఖర్చు చేసేందుకు రెడీ..!

| పెళ్లి తర్వాత అలా తీర్ధ యాత్రలకు తిరిగి వచ్చిన ఈ కొత్త జంట ఇప్పుడు తమ క్యాలరీలు ఖర్చు చేసేందుకు రెడీ అయ్యారు.

By - Tupaki Desk
Update: 2024-03-11 12:36 GMT

సౌత్ లో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ కొన్నాళ్లుగా బాలీవుడ్ యాక్టర్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానితో ప్రేమలో ఉండి ఈమధ్యనే వారిద్దరు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. లాస్ట్ మంత్ వీరి పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. వెల్ విషర్స్, ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో వీరి మ్యారేజ్ జరిగింది. పెళ్లి తర్వాత అలా తీర్ధ యాత్రలకు తిరిగి వచ్చిన ఈ కొత్త జంట ఇప్పుడు తమ క్యాలరీలు ఖర్చు చేసేందుకు రెడీ అయ్యారు.


పెళ్లి టైం లో సెలబ్రేషన్స్, ఎక్కువ మొత్తం లో ఫుడ్ ఇలా వారి రెగ్యులర్ డైట్ ప్లాన్ ని డిస్టర్బ్ చేశాయి కాబట్టి ఇక వాటిని బర్న్ చేసేందుకు మిస్టర్ అండ్ మిస్ రకుల్ ప్రీత్ జిమ్ లో అడుగు పెట్టారు. భర్తతో కలిసి క్యాలరీలు ఖర్చు పెట్టేందుకు రెడీ అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది అమ్మడు. రకుల్ తండ్రి ఆర్మీ ఆఫీసర్ కాబట్టి ఫుడ్ విషయంలో ఆమెకు చిన్నప్పటి నుంచి కొన్ని ఆంక్షలు ఉన్నాయని.. ఫిట్ నెస్ విషయంలో పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ అని అప్పట్లో చెప్పింది రకుల్.

అయితే పెళ్లి టైం లో ఫిట్ నెస్ కోసం సరైన టైం కేటాయించే అవకాశం ఉండదు. అంతేకాదు ఆ టైం లో తినే ఆహారం మీద కూడా ఆంక్షలు పెట్టుకోలేరు. అందుకే మ్యారేజ్ టైం లో చేయలేని వర్క్ అవుట్స్ ని కొద్దిపాటి గ్యాప్ తర్వాత మొదలు పెట్టారు రకుల్ జోడీ. ఇక ఆఫ్టర్ మ్యారేజ్ రకుల్ కెరీర్ లో ఎలాంటి స్పీడ్ బ్రేక్స్ ఉండదని తెలుస్తుంది. ఆల్రెడీ కమిటైన సినిమాలు పూర్తి చేసే ఆలోచనలో ఉన్న రకుల్ కొత్త వాటికి తాను రెడీ అనేస్తుంది.

బాలీవుడ్ లో పెళ్లైన భామలు ఇప్పటికీ తమ స్టార్ డం కొనసాగిస్తున్నారు. వారి దారిలో రకుల్ కూడా సినిమాల్లో నటిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం రకుల్ ఇండియన్ 2 సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆమె సౌత్ లో కూడా తిరిగి మళ్లీ బిజీ అవుతుందని చెప్పుకుంటున్నారు. తెలుగులో కొండపొలం తర్వాత అవకాశాలు అందుకోని రకుల్ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ పై కూడా గురి పెట్టింది. మరి అమ్మడికి ఆఫ్టర్ మ్యారేజ్ అయినా లక్ కలిసి వస్తుందా లేదా అన్నది చూడాలి.

Tags:    
  • Bollywood 
  • Tollywood 
  • Rakulpreetsingh 
  • JackkyBhagnani 
  • MrandMiss 
  • Indian2 
  • Kondapolam 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS