• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అదే జరిగింది... ఆ అమ్మాయి...

అదే జరిగింది... ఆ అమ్మాయి కుంభమేళా టు బాలీవుడ్‌

| ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ప్రతి రోజు ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని మాత్రమే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతాయి.

By - Tupaki Desk
Update: 2025-01-22 05:53 GMT

ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ప్రతి రోజు ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని మాత్రమే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతాయి. కుంభమేళా ఆరంభం అయినప్పటి నుంచి ఒక అమ్మాయి గురించి ప్రముఖంగా సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ అమ్మాయి పేరు మోనాలిసా. ఇండోర్‌కి చెందిన మోనాలిసా ఫ్యామిలీ కుంభమేళాలో పూసల దండలు, రుద్రాక్ష దండలు అమ్ముకోవడానికి వెళ్లారు. కుంభమేళాలో కొందరు యువకులు ఈమెను చూసి చాలా అందంగా ఉంది అంటూ ఒక వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఆమె కళ్లు చాలా స్పెషల్‌గా ఉన్నాయంటూ ఆ వీడియోకు మంచి స్పందన వచ్చింది.

కుంభమేళాకు వెళ్లిన వారిలో చాలా మంది ఇప్పుడు మోనాలిసా ఎక్కడ ఉంది అంటూ వెతకడం మొదలు పెట్టారు. ఆమె ఎక్కడ కనిపిస్తే అక్కడ గుంపులుగా ఏర్పడి ఆమెతో సెల్ఫీకి ఎగబడుతున్నారు. ఆమెను కాపాడేందుకు ఒకానొక సమయంలో ఫ్యామిలీ మెంబర్స్‌కి చాలా ఇబ్బందిగా మారింది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఇలా వైరల్‌ కావడం మనం చూస్తూనే ఉంటాం. మోనాలిసా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వెంటనే ఎవరో ఒకరు కచ్చితంగా పిలిచి సినిమా ఆఫర్లు ఇస్తారని అంతా భావించారు. అనుకున్నట్లుగానే బాలీవుడ్‌ నుంచి మోనాలిసాకి సినిమా ఆఫర్‌ వచ్చింది. అయితే సినిమా ఆఫర్‌ పై మోనాలిసా స్పందన ఏంటి అనేది చూడాలి.

బాలీవుడ్‌ దర్శకుడు సనోజ్ మిశ్రా తన సినిమాలో కుంభమేళా మోనాలిసాకి ఛాన్స్‌ ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. త్వరలోనే మోనాలిసాను కలుస్తాను అన్నాడు. అయితే ఆయన తీయబోతున్న సినిమా ఏంటి, ఆమెను ఏ పాత్ర కోసం ఎంపిక చేయబోతున్నది క్లారిటీ ఇవ్వలేదు. నటిగా చేసే ఉద్దేశ్యం మోనాలిసాకు ఉందా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌ వంటి అతి పెద్ద ఇండస్ట్రీలో నటించే అవకాశాల కోసం లక్షల మంది వెయిట్‌ చేస్తూ ఉంటారు. అలాంటి అవకాశం వస్తే మోనాలిసా వదులుకోదు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే మోనాలిసా మేకోవర్‌ మార్చేసింది. ఇటీవల ఒక బ్యూటీషన్‌ సోషల్‌ మీడియాలో మోనాలిసా వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో మోనాలిసాకి మేకోవర్‌ చేసింది. ఆ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. మోనాలిసా ఈమధ్య సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది కానీ, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ ఛానల్‌, ఎక్స్ ఖాతాలు చాలా కాలంగా ఉన్నాయి. ఆమె వీడియోలను షేర్‌ చేస్తూ ఉండేది. కానీ ఆ వీడియోలు పెద్దగా వైరల్‌ కాలేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు మోనాలిసాకి మంచి గుర్తింపు దక్కింది. మోనాలిసా కళ్లలో ఉన్న ప్రత్యేకత కారణంగా కచ్చితంగా బాలీవుడ్‌లో మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నటిగా తనను తాను నిరూపించుకుంటే కచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఈమెకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అయితే సినిమాల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తలు తప్పనిసరి.

Tags:    
  • Monalisa 
  • Mahakumbhamela 
  • Bollywood 
  • Filmindustry 
  • Movieoffer 
  • Sanojmishra 
  • Movie 

Similar News

రణబీర్, యష్‌ల రామాయణకు గౌతమ్ ఘట్టమనేని రేటింగ్.. ఎంత ఇచ్చాడంటే!

2026-11-13 07:16 GMT

తెలుగు ఆడియన్స్ పల్స్ పట్టేసిన దుల్కర్.. మిగతా హీరోలు నేర్చుకోవాల్సింది ఇదే!

2026-11-13 07:08 GMT

రాజమౌళి సక్సెస్ కి శంకర్ ఫెయిల్యూర్ కి కారణం ఇదే...

2026-11-13 07:07 GMT

పవన్ కళ్యాణ్ కి ఓజీ అంటే అంత ఇష్టం ఉండటానికి కారణం ఏంటి?

2026-11-13 07:06 GMT

1000 కోట్ల క్లబ్.. హీరోగా ఒకటి.. విలన్‌గా మరొకటి

2026-11-13 06:47 GMT

'డి.ఎన్.కె' మూవీ రివ్యూ

2026-11-13 06:35 GMT

షాకింగ్: బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబంలో ఆస్తి వివాదాలు?

2026-11-13 04:09 GMT

సినిమా నిర్మాత‌కు, ఫైనాన్షియ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్ర‌ధాన‌మైన తేడా?

2026-11-13 04:08 GMT

Bigg Boss Telugu 10: దేబ్జానీకి, సుధీర్ కి అదిరిపోయే హింట్స్!

2026-11-13 04:06 GMT

'పుష్ప 2' రికార్డును బ్రేక్ చేయ‌లేక‌పోయిన రామాయ‌ణం-1

2026-11-13 02:45 GMT

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

Copyright @2026

Powered by Blink CMS