క్షమాపణలు చెప్పి నటితో బోల్డ్ సీన్స్!
ఇలాంటి సందర్భం కంప్లీట్ స్టార్ మోహన్ లాల్-నటి మీరా వాసుదేవ్ లకు ఓ సినిమా సమయంలో ఎదురైంది.;
సన్నివేశం డిమాండ్ చేస్తే కొన్నిసార్లు ఎలాంటి నటులైనా హద్దులు దాటాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఆ సీన్ లో అలా నటిస్తేనే పండుతుందని దర్శకుడి ఒత్తిడి తీసుకొచ్చిన సందర్భంలో నటించక తప్పదు. మేల్ అయినా? ఫీమేల్ అయినా కొన్ని సన్నివేశాల విషయంలో రాజీ పడక తప్పదు. ఇంటిమేట్ సన్నివేశాల పరంగా ఎలాంటి నటులకైనా ఇబ్బందిరకమైన పరిస్థితులు తప్పవు. ఇలాంటి సందర్భం కంప్లీట్ స్టార్ మోహన్ లాల్-నటి మీరా వాసుదేవ్ లకు ఓ సినిమా సమయంలో ఎదురైంది. ఈ విషయాన్ని స్వయంగా మీరా వాసుదేవ్ రివీల్ చేసారు.
ఫ్యామిలీ స్టోరీ కావడంతోనే:
ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే.. 2005లో మోహన్ లాల్- మీరా వాసుదేవన్ జంటగా `తన్మాత్రా` అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో మోహన్ లాల్ నగ్నంగా నటించాల్సి వచ్చిందని మీరా తెలిపారు. అప్పట్లో దీనిపై విశ్రమ స్పందనలు వచ్చాయన్నారు. దీంతో షూటింగ్ కి వెళ్లడానికి ముందే మోహన్ లాల్ మీరాకు క్షమాపణలు చెప్పి షూట్ లో పాల్గొన్నట్లు గుర్తు చేసుకున్నారు. ఈ సీన్ సమయంలో ఇది అవసరమా? అని అడిగాను. అప్పుడాయన ఆ సీన్ ముఖ్యమని చెప్పారు. అప్పటికే ఇద్దరి మధ్య కొన్ని క్లోజ్ సన్నివేశాలు తీసారు. సన్నిహిత కుటుంబం, భార్యాభర్తల కథ కావడంతో? ఎంతో ఎమోషన్ తో సాగుతుంది.
అవార్డులు..రివార్డులు అందుకున్న చిత్రం:
నగ్నంగా నటించాల్సి రావడంతో చాలా అసౌకర్యానికి గురయ్యాం. మోహన్ లాల్ కి మరింత సవాల్ గా మారింది. ఆయనతో పాటు, నా గురించి కూడా ఆలోచించాల్సి వచ్చింది. నేను ఎలా భావిస్తున్నానో? అని ఆయన చాలా ఆలోచించారు. అప్పటికే నటుడిగా ఎన్నో సినిమాలు చేసారు. మోహన్ లాల్ చాలా ప్రోఫెషనల్ కూడా. దీంతో ఆయన షూట్ కి ముందే క్షమించండని కోరడం ఇప్పటికీ గుర్తుందన్నారు మీరా. ఈ సినిమా అప్పట్లో అవార్డులు. .రివార్డులు అందుకుంది. జాతీయ అవార్డు సైతం దక్కించుకుంది. కేరళ రాష్ట్ర అవార్డులు కూడా వరించాయి.
అన్ని భాషల్లోనూ మోహన్ లాల్ సినిమాలు:
ఈ సినిమాతో మోహన్ లాల్ కు ఉత్తమ నటుడిగా ఐదవసారి రాష్ట్ర అవార్డు అందుకోవడం విశేషం. ప్రస్తుతం మోహన్ లాల్ మాతృభాషతో పాటు, అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి తెలుగులో కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. మాలీవుడ్ లో నటించిన సినిమాలు కూడా అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఆయన సినిమాల బడ్జెట్ కూడా పెరిగింది. ఒకప్పుడు పదికోట్ల బడ్జెట్ కే పరిమితమైన సినిమాలు ఇప్పుడు 100 కోట్లు ఖర్చు చేయడానికి కూడా మాలీవుడ్ ఆలోచించడం లేదు.