కలెక్షన్ కింగ్ 'ది ప్యారడైజ్' పోస్టర్.. చించేశాడంతే..!

దసరాతో డైరెక్టర్ గా తొలి సినిమానే అయినా నానికి మాస్ హిట్ ఇచ్చాడు శ్రీకాంత్ ఓదెల.;

Update: 2025-09-27 05:54 GMT

దసరాతో డైరెక్టర్ గా తొలి సినిమానే అయినా నానికి మాస్ హిట్ ఇచ్చాడు శ్రీకాంత్ ఓదెల. ఆ నమ్మకంతోనే నాని అతనికి రెండో సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఈసారి మరింత హైప్ తో ది ప్యారడైజ్ అంటూ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు శ్రీకాంత్ ఓదెల. యువ దర్శకుల వరల్డ్ బిల్డింగ్.. ఆ క్రియేషన్స్ అంతా కూడా ఆడియన్స్ కి సూపర్ కిక్ ఇస్తుంది. అంతేకాదు వాళ్లు రాసుకున్న పాత్రలకు పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యే కాస్టింగ్ ని ఎంపిక చేస్తున్నారు. నానితో శ్రీకాంత్ ఓదెల చేస్తున్న ది ప్యారడైజ్ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారు. తెర మీద విలనిజం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అనిపించేలా చేస్తారు.


ది ప్యారడైజ్.. ది మోహన్ బాబు..

కెరీర్ మొదట్లో మోహన్ బాబు విలన్ గా చేసి ఆ టాలెంట్ తోనే హీరోగా ప్రమోట్ అయ్యారు. ది ప్యారడైజ్ లో మోహన్ బాబుని తీసుకోవడమే చిత్ర యూనిట్ సక్సెస్ అయినట్టే లెక్క. ఎందుకంటే ఈమధ్య మోహన్ బాబు చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. ఈ రోల్ తను చేస్తే సినిమాకు ప్లస్ అవుతుంది అనుకుంటే తప్ప ఆయన చేయట్లేదు. అందులోనూ దసరాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ తో సినిమా కాబట్టి ది ప్యారడైజ్ కి ఓకే చెప్పి ఉండొచ్చు.

నాని హీరో.. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్.. ఇవే ప్యారడైజ్ సినిమాలోని కలెక్షన్ కింగ్ మోహన్ బాబుని అడుగుపెట్టేలా చేశాయి. సినిమాలో ఆయన విలన్ గా చేస్తున్నారు. ది ప్యారడైజ్ లో షికంజ మాలిక్ రోల్ లో మోహన్ బాబు కనిపించనున్నారు. ఆ రోల్ కి సంబందించిన ఫస్ట్ లుక్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. షర్ట్ లెస్ తో మోహన్ బాబు లుక్ అదిరిపోయింది. డైలాగ్ కింగ్ గా మోహన్ బాబుకి సెన్సేషనల్ క్రేజ్ ఉంది. మరి ఆయనలోని ఆ స్పెషల్ టాలెంట్ ని శ్రీకాంత్ ఓదెల ఎలా వినియోగించుకుంటాడో చూడాలి.

నాని వర్సెస్ మోహన్ బాబు..

ప్యారడైజ్ మోహన్ బాబు ఫస్ట్ లుక్ లో బ్లాక్ గాగుల్స్, చేతిలో సిగార్, రక్తపు మడుగుల చేతులతో ఒక చేయి తుపాకి మీద పెట్టాడు. ఈమధ్య కాలంలో మోహన్ బాబు ఈ రేంజ్ మాస్ లుక్ ని చూడలేదు. తప్పకుండా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫ్యాన్స్ కి కూడా ఈ సినిమా మాస్ ఫీస్ట్ ఇచ్చేలా ఉంది. ఈ సినిమా సక్సెస్ అయితే మోహన్ బాబు ఇలాంటి స్పెషల్ రోల్స్ తో మళ్లీ కెరీర్ బిజీ చేసుకునే ఛాన్స్ ఉంది.

ది ప్యారడైజ్ అంతకుముందు నాని జడల్ రోల్ ని రివీల్ చేశారు. ఇప్పుడు మాలిక్ గా మోహన్ బాబు లుక్ వదిలారు. చూస్తుంటే భారీ ప్లానింగ్ తోనే శ్రీకాంత్ ది ప్యారడైజ్ ని సెట్ చేస్తున్నట్టు ఉంది. ఈ సినిమాను ముందు నుంచి చెబుతున్నట్టుగానే 2026 మార్చి 26న రిలీజ్ లాక్ చేశారు. సినిమా నుంచి వచ్చిన మోహన్ బాబు ఫస్ట్ లుక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. నాని వర్సెస్ మోహన్ బాబు ఈ ఫైట్ కచ్చితంగా ఫ్యాన్ ఫీస్ట్ గా ఉండబోతుందని అనిపిస్తుంది.

Tags:    

Similar News