బ్యాంకాక్ కొండలు కోనల్లో యువనటి గట్స్
తాజాగా కొండల మధ్య పచ్చని జలాల్లో బోట్ షికార్ చేస్తూ కనిపించింది. ఎత్తైన పర్వతాల నడుమ పచ్చని నీడ ఆ నది నీటిలో ప్రతిబింబిస్తోంది.;
పచ్చని ప్రకృతిని ఆస్వాధించే మనసుండాలే కానీ ఈ ప్రపంచంలో ఎగ్జోటిక్ లొకేషన్లకు కొదవేమీ లేదు. అందునా బ్యాంకాక్ అడవుల్లో సుదూర తీరాన పచ్చందాలను తనివి తీరా ఆస్వాధించి తీరాల్సిందే. అక్కడ కొండలు కోనలు గుట్టలు నదీ సముద్ర జలాల్లో విహరిస్తే కలిగే మజానే వేరు! ప్రస్తుతం అలాంటి అద్భుతమైన విహారయాత్రను ఆస్వాధిస్తోంది మెహ్రీన్ ఫీర్జదా.
తాజాగా కొండల మధ్య పచ్చని జలాల్లో బోట్ షికార్ చేస్తూ కనిపించింది. ఎత్తైన పర్వతాల నడుమ పచ్చని నీడ ఆ నది నీటిలో ప్రతిబింబిస్తోంది. అలాంటి చోట మెహ్రీన్ తనను తాను మర్చిపోయి ఇదిగో ఇలా ఫోజులిచ్చింది. హాఫ్ షోల్డర్ ఫ్రాక్ లో థై అందాలను కూడా ప్రదర్శిస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం మెహ్రీన్ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
చేతిలో సినిమాల్లేవ్. కావాల్సినంత తీరిక సమయం ఉంది. దానిని ఇలా సద్వినియోగం చేస్తోందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏదైనా ట్రావెల్ మ్యాగజైన్ షూట్ కోసం అక్కడికి వెళ్లిందా? అని కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు ఇలియానా ఫిజీ దీవికి ఇదే తరహాలో ప్రచారం కల్పించింది. ఇప్పుడు మెహ్రీన్ బ్యాంకాక్ అందాలను ప్రమోట్ చేయబోతోందా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అన్నిటికీ మెహ్రీన్ స్వయంగా స్పందించాల్సి ఉంటుంది. ఎఫ్ 2 ఫ్రాంఛైజీ సినిమాల తర్వాత మెహ్రీన్ కి సరైన ఆఫర్ లేదు. మునుముందు ప్రయత్న లోపం లేకుండా ఏదైనా మాయాజాలం సృష్టిస్తుందేమో చూడాలి.