• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఏమున్నాడ్రా బాబు..మన...

ఏమున్నాడ్రా బాబు..మన అన్నయ్య!

| ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మెగాస్టార్ న్యూ లుక్ లోకి మారిపోయారు. ఈ లుక్ లో మెగాస్టార్ చాలా యంగ్ గా కనిపిస్తూ ఉండటం విశేషం. ఈ మధ్యకాలంలో చిరంజీవి బెస్ట్ లుక్స్ లలో ఇది కూడా ఒకటనే మాట వినిపిస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-04-10 04:11 GMT

మెగాస్టార్ చిరంజీవి పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంటుంది. ఇండస్ట్రీలో చాలా మంది ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ప్రయాణం చేస్తున్నవారే. ఎంతో మందికి చిరు ఒక రోల్ మోడల్. అయితే మెగాస్టార్ ఇప్పటికి యంగ్ హీరోలతో పోటీ పడుతూ హీరోగా సినిమాలు చేస్తూ ఉండటం విశేషం. చిరంజీవి ఏజ్ గ్రూప్ ఉన్న స్టార్స్ అందరూ కూడా ఇప్పటికే స్టోరీ సెలక్షన్స్ మార్చేసుకున్నారు.

 

కాస్తా ఏజ్డ్ క్యారెక్టర్స్ సెలక్ట్ చేసుకొని మూవీస్ చేస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం అంతకంతకు యంగ్ లుక్ లోకి మారిపోతున్నాడు. ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి చేసే ప్రయత్నంలో మెగాస్టార్ లుక్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. వెండితెరపై ఆడియన్స్ ని మెప్పించడానికి ఎంత కష్టం అయిన పడటానికి మెగాస్టార్ సిద్ధం అవుతారు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మూవీలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తూ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మెగాస్టార్ న్యూ లుక్ లోకి మారిపోయారు. ఈ లుక్ లో మెగాస్టార్ చాలా యంగ్ గా కనిపిస్తూ ఉండటం విశేషం. ఈ మధ్యకాలంలో చిరంజీవి బెస్ట్ లుక్స్ లలో ఇది కూడా ఒకటనే మాట వినిపిస్తోంది.

ఈ లుక్ కోసం ఆయన ఎంత కేర్ తీసుకొని ఉంటారో ఊహించవచ్చు. ఫిట్నెస్ విషయంలో కూడా మెగాస్టార్ గతకొంత కాలంగా ఆశ్చర్యపరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ లుక్ కోసం కూడా జిమ్ లో గట్టిగానే కష్టపడినట్లు అర్ధమవుతోంది. నేటితరం యువ హీరోలకు పోటీగా మెగాస్టార్ ఎంతగానో ఆకట్టుకుంటున్నారని చెప్పవచ్చు.

కొండగట్టు అంజన్న ఆలయం దగ్గర పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి చిరంజీవి విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన యంగ్ లుక్ లో కనిపించడం విశేషం. మెగా ఫ్యాన్స్ చిరంజీవి సూపర్బ్ లుక్స్ ని క్లోజ్ అప్ లో ట్రిమ్ చేసి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ వయస్సులో కూడా ఇంత యంగ్ లుక్ లో ఫ్యాన్స్ కిక్ ఇచ్చే స్మైల్ తో కనిపించాలంటే అది మెగాస్టార్ కి మాత్రమే సాధ్యం అవుతుందనే మాట అభిమానుల నుంచి వినిపిస్తోంది.

ప్రస్తుతం విశ్వంభర సినిమాలో చిరంజీవి యంగ్ క్యారెక్టర్ కి సంబందించిన సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యి కొత్త లుక్ లోకి మారారంట. ఈ లుక్ లో చిరంజీవి ప్రస్తుతం ఏజ్ కంటే 25 ఏళ్ళు చిన్నవాడిగా కనిపిస్తున్నడని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. చిరంజీవి కొత్త లుక్ కి సంబందించిన పిక్స్ ని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఇక విశ్వంభర సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Tags:    
  • Megastar 
  • Chiranjeevi 
  • Newlook 
  • Viswambara 
  • Chiru 
  • Youngagelook 
  • Vashita 
  • Megastarchiranjeevi 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS