మెగా కాంపౌండ్‌లో ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్.. చిరు ఎందుకు మిస్సింగ్?

ద‌శాబ్ధాల కెరీర్‌లో టాలీవుడ్‌కి ఎప్పుడూ అంత‌గా అందుబాటులో లేని లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ రెహ‌మాన్ వ‌ర్కింగ్ స్టైల్ మారుతోందా? అంటే అవున‌నే సంకేతాలు అందుతున్నాయి.

Update: 2026-05-21 17:30 GMT

ద‌శాబ్ధాల కెరీర్‌లో టాలీవుడ్‌కి ఎప్పుడూ అంత‌గా అందుబాటులో లేని లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ రెహ‌మాన్ వ‌ర్కింగ్ స్టైల్ మారుతోందా? అంటే అవున‌నే సంకేతాలు అందుతున్నాయి. ఇటీవ‌లి కాలంలో ఆయ‌న టాలీవుడ్ పై ఎక్కువ‌గా ఫోక‌స్ చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. బాలీవుడ్ కంటే ఇప్పుడు టాలీవుడ్ ఆయ‌న‌కు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ముఖ్యంగా మెగా సినిమాలకు సంగీతం అందించేందుకు ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ ఉవ్విళ్లూరుతుండ‌టం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. కొన్నేళ్ల‌ క్రితం రామ్ చరణ్ నటించిన ఆరెంజ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన పంజా చిత్రాలకు ఆయన అద్భుతమైన మ్యూజిక్‌ను అందించారు. ఆయా ఆల్బమ్స్‌లో యువతను ఊపు తెచ్చే ట్రెండీ ట్యూన్స్ ఉర్రూత‌లూగించాయి. కానీ దురదృష్టవశాత్తూ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులయ్యాయి. అయినా రెహ్మాన్ కి మ్యూజిక్ పరంగా ఎక్కడా మచ్చ రాలేదు.

ఇటీవల మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా కోసం మ్యూజిక్ మ్యాస్ట్రో రెహ‌మాన్ మ్యూజిక్ అందిస్తుండడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే పెద్ది సినిమా ట్యూన్స్ కాలర్ టోన్లులో మార్మోగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇమ్మిటేషన్ వీడియోలతో ఇంటర్నెట్ హీటెక్కుతోంది. పెద్ది సినిమా కోసం ప్రతిపాటా దేనికదే ప్ర‌త్యేకం అనే విధంగా రెహమాన్ బాణీలు మ్యాజిక్ చేస్తున్నాయి. ఇక ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ నుంచి వచ్చే రీరికార్డింగ్ ఇంటర్నేషనల్ రేంజులో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

పెద్ది త‌ర్వాత‌ మెగాస్టార్ చిరంజీవి - బాబి కాంబినేషన్ సినిమాకి కూడా ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించాల్సి ఉండ‌గా, ఆయ‌న‌తో చ‌ర్చ‌ల ద‌శ‌లోనే అనూహ్యంగా థ‌మ‌న్ పేరు తెర‌పైకి రావ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మెగా ఫ్యామిలీకి చెందిన యువ హీరోలు చరణ్, పవన్ కల్యాణ్‌ల తర్వాత ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనూ రెహమాన్ పని చేయాల్సి ఉండ‌గా, థ‌మ‌న్ ఖ‌రార‌య్యార‌నే వార్త‌లు వినిపించాయి. ఇది ఊహించ‌ని అనూహ్య ప‌రిణామం. మెగా 158 కోసం విజ‌య్ కార్తీక్ క‌న్న‌న్, అవినాష్ కొల్లా లాంటి దిగ్గ‌జ టెక్నీషియ‌న్ల‌ను ఎంపిక చేసుకున్న బాబి ఆస్కార్ గ్ర‌హీత రెహ‌మాన్ తో ప‌ని చేస్తార‌ని భావిస్తుండ‌గానే, ఇంత‌లోనే ఎస్.ఎస్.థ‌మ‌న్ పేరును అధికారికంగా ఖ‌రారు చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

రెహమాన్ తన కెరీర్ ఆద్యంతం శంకర్, మణిరత్నం వంటి దిగ్గజ తమిళ దర్శకులతో కలిసి పని చేసారు. ఆ ఇద్దరు దర్శకులు తెరకెక్కించిన అన్ని మ్యూజికల్ బ్లాక్ బస్టర్లకు రెహమాన్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విక్రమ్, సూర్య, సిద్ధార్థ్ వంటి హీరోల సినిమాలకు అద్భుతమైన స్వరాల్ని అందించారు. తెలుగులో అగ్ర హీరోలు నాగార్జున (రక్షకుడు), పవన్, మహేష్, చరణ్ సినిమాలకు మాత్రమే పని చేసారు. తదుపరి మెగాస్టార్ చిరంజీవి మూవీతో మెగాఫ్యాన్స్ కి స్పెష‌ల్ ట్రీటివ్వ‌బోతున్నార‌ని భావిస్తే ఇంత‌లోనే ఆఫ‌ర్ థ‌మ‌న్ కి వెళ్లింది.

ఇది ఊహించ‌ని స‌ర్ ప్రైజ్ అయినా..రెహ‌మాన్ తో బాబీకి ఏం చిక్కులు వ‌చ్చాయోన‌నే చ‌ర్చ సాగింది. అయినా మునుముందు టాలీవుడ్‌లో మెగా హీరోల సినిమాల‌తో రెహ‌మాన్ తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించే అవ‌కాశం లేక‌పోలేదు. ఇటీవలి కాలంలో టాలీవుడ్ ప్రాజెక్టుల‌కు ఎలాంటి కండిష‌న్లు లేకుండా వెంటనే ఓకే చెబుతున్న రెహమాన్ వ్యవహారం చూస్తుంటే ఆయన బాణి మారినట్టే అనిపిస్తోంది. నెలల తరబడి ట్యూన్ల కోసం ఎదురు చూసే దర్శననిర్మాతలే ఆయనను భరించగలరనే అపవాదు నుంచి నెమ్మ‌దిగా బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ట్టే ఉంది. కానీ అన్నిటినీ అధిగమించి రెహమాన్‌ని తమ వశం చేసుకోవడంలో మెగా హీరోలు పెద్ద స‌క్సెస‌య్యార‌ని విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News