హైయ్యెస్ట్ గ్రాసర్స్.. పెద్ది ఎన్ని చోట్ల డామినేట్ చేస్తుంది?
తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఆర్ ఆర్ ఆర్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు ఇప్పటికీ టచ్ చేయడం కష్టం అన్న భావన ఉంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్దిపై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, సాంగ్స్ తో సినిమా మీద హైప్ పీక్స్ కు చేరుకుంది. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత బిజినెస్ వర్గాల్లో ఆ మూవీపై చర్చ మరింత పెరిగింది.
1980ల గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగే ఆ కథలో ఒక సాధారణ యువకుడు స్పోర్ట్స్ ను ఆయుధంగా చేసుకుని సమాజాన్ని ఏకం చేసే విధానం ప్రధానాంశంగా ఉండనుందని సమాచారం. విలేజ్ నేటివిటీ, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్, మాస్ ఎమోషన్స్, పాన్ ఇండియా ప్రెజెంటేషన్.. ఇవన్నీ కలిసి పెద్దిని భారీ రేంజ్ కు తీసుకెళ్తాయని సినీ ప్రియులు భావిస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబు కథలో ఎమోషన్ ను హైలైట్ చేసే విధానం సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని చెబుతున్నారు.
ఇక సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ స్టార్ క్యాస్టింగ్ కూడా సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తీసుకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ది ఏఏ రాష్ట్రాల్లో ప్రస్తుత హైయ్యెస్ట్ గ్రాసర్స్ రికార్డులను బ్రేక్ చేస్తుంది? అనే విషయంపై చర్చ జరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఆర్ ఆర్ ఆర్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు ఇప్పటికీ టచ్ చేయడం కష్టం అన్న భావన ఉంది. అయితే పెద్దికి ఉన్న మాస్ బజ్, రామ్ చరణ్ మార్కెట్, స్పోర్ట్స్ ఎమోషన్ కలిసి వస్తే ఆ రికార్డులకు గట్టి ఛాలెంజ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక కర్ణాటకలో ప్రస్తుతం కాంతార చాప్టర్ 1 హైయ్యెస్ట్ గ్రాసర్ గా నిలవగా, తమిళనాడులో లియో, మహారాష్ట్రలో చావా టాప్ లో ఉన్నాయి.
నార్త్ లో పుష్ప 2, దురంధర్ 2 అనేక రాష్ట్రాల్లో డామినేషన్ చూపుతున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఒడిశా, జార్ఖండ్ వంటి మార్కెట్లలో పుష్ప 2 రికార్డులు స్ట్రాంగ్ గా ఉన్నాయి. అయితే పెద్దికి స్పోర్ట్స్ డ్రామాగా ఉన్న యూనివర్సల్ కనెక్ట్, రామ్ చరణ్ కు ఉన్న నేషనల్ ఇమేజ్, గ్రామీణ ఎమోషన్స్ కారణంగా హిందీ బెల్ట్ లో కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో సినిమా మంచి హోల్డ్ సాధిస్తే, పలు రాష్ట్రాల్లో కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్దిని ఫ్యూచర్ ఇండస్ట్రీ హిట్ గా మెగా ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు. ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే.. ఆ సినిమా కేవలం తెలుగు మార్కెట్ కే పరిమితం కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో భారీ సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.