'మాస్ జాతర' ప్రీమియర్స్.. జనాలు వస్తారా?
అదే సమయంలో ముందు రోజు అంటే అక్టోబర్ 30వ తేదీన పెయిడ్ ప్రీమియర్స్ వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు రీసెంట్ గా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నాగవంశీ వెల్లడించారు.;
టాలీవుడ్ సీనియర్ హీరో, మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. రిజల్ట్ తో సంబంధం లేకుండా.. కొత్త దర్శకులకు ఛాన్సులు ఇస్తూ.. ప్రయోగాలు చేస్తూ.. సందడి చేస్తున్నారు. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో మాస్ జాతర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఆ సినిమాకు గాను యంగ్ బ్యూటీ శ్రీలీలతో రెండోసారి జత కడుతున్నారు. ఇప్పటికే వారి కాంబోలో వచ్చిన ధమాకా మూవీ సూపర్ హిట్ కాగా.. ఇప్పుడు మాస్ జాతరలో జంటగా కనిపించనున్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న మాస్ జాతర మూవీని యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
ఇప్పుడు అక్టోబర్ 31వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. అదే సమయంలో ముందు రోజు అంటే అక్టోబర్ 30వ తేదీన పెయిడ్ ప్రీమియర్స్ వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు రీసెంట్ గా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నాగవంశీ వెల్లడించారు. ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొత్త చర్చకు కూడా దారి తీసింది.
నిజానికి నాగవంశీ తాను నిర్మించిన లక్కీ భాస్కర్ మూవీకి కూడా అప్పుడు పెయిడ్ ప్రీమియర్స్ వేసి సక్సెస్ అయ్యారు. అప్పుడు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాగా కలిసి వచ్చింది. మాస్ జాతర మూవీ కంటెంట్ పై నమ్మకంతో ఇప్పుడు కూడా పెయిడ్ ప్రీమియర్స్ ను వేయాలని యోచనలో మేకర్స్ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
కానీ కొంత కాలంగా టాలీవుడ్ లో ప్రీమియర్స్ అంతగా కలిసి రావడం లేదు. ఆయా సినిమాలు అంతగా క్లిక్ అవ్వడం లేదు. రీసెంట్ గా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన మిత్రమండలి మూవీ విషయంలో అదే జరిగింది. రిలీజ్ కు ముందే సినిమా టాక్ స్ప్రెడ్ అవ్వడంతో ఆడియన్స్ థియేటర్స్ కు వెళ్లాలో వద్దో డిసైడ్ అయిపోయారు.
దీంతో ఆ ఎఫెక్ట్ వసూళ్లపై పడింది. అయితే కంటెంట్ బాగుంటే మాత్రం వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయితే పరిస్థితిని అంచనా వేయలేం. ప్రజలు థియేటర్స్ కు తరలివస్తారు. అదే సమయంలో సినిమాపై ముందు నుంచి బజ్ ఉంటే.. ప్రీమియర్స్ పై ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ మాస్ జాతరపై ఇప్పుడిప్పుడే జనాల్లో ఆసక్తి నెలకొంటోంది. మరేం జరుగుతుందో.. ప్రీమియర్స్ కు ఆడియన్స్ వస్తారో లేదో వేచి చూడాలి.