రాజాసాబ్: ఫ్యాన్ బూతులకు మారుతి మాస్ కౌంటర్

అయితే ఈ ఆనందంలో కూడా ఒక అభిమానికి చిన్న సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని కొంచెం ఘాటుగానే సోషల్ మీడియాలో వ్యక్తపరిచాడు.;

Update: 2026-01-06 06:38 GMT

ప్రభాస్ సినిమా అప్డేట్ వస్తే ఫ్యాన్స్ చేసే హడావిడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ చాలా కాలం తర్వాత డార్లింగ్ నుంచి ఒక మాస్ డ్యాన్స్ నెంబర్ రావడంతో రాజా సాబ్ పై అంచనాలు పెరిగిపోయాయి. తమన్ ఇచ్చిన నాచ్చే నాచ్చే.. బీట్, ప్రభాస్ స్టైలిష్ లుక్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ ఆనందంలో కూడా ఒక అభిమానికి చిన్న సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని కొంచెం ఘాటుగానే సోషల్ మీడియాలో వ్యక్తపరిచాడు.




 


​సాధారణంగా ఈ మధ్య కాలంలో చాలా పెద్ద సినిమాల్లో మంచి డ్యాన్స్ నెంబర్స్ ను లేదా స్పెషల్ సాంగ్స్ ను సినిమా చివర్లో ఎండ్ టైటిల్స్ పడేటప్పుడు వేస్తున్నారు. దీనివల్ల ఆడియన్స్ ఆ పాటను పూర్తిగా ఆస్వాదించలేక థియేటర్ నుంచి బయటకు వచ్చేస్తుంటారు. ఇంత మంచి సాంగ్ ను సినిమా మధ్యలో కాకుండా చివర్లో వేస్తారేమో అన్న భయం ఆ అభిమానిలో కలిగింది.

​అదే విషయాన్ని డైరెక్ట్ గా దర్శకుడు మారుతిని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో ఒక నెటిజన్ పోస్ట్ పెట్టాడు. ఈ సాంగ్ ను గనక ఎండ్ కార్డ్స్ అప్పుడు పెడితే మామూలుగా ఉండదు అంటూ ఒక బూతు పదాన్ని వాడుతూ వార్నింగ్ ఇచ్చాడు. ఆ ట్వీట్ చూస్తే ఆ ఫ్యాన్ కు ఆ పాట ఎంత నచ్చిందో, అది మెయిన్ సినిమాలో ఉండాలని ఎంత కోరుకుంటున్నాడో అర్థమవుతుంది.

​దీనిపై దర్శకుడు మారుతి స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా ఇలాంటి ట్వీట్స్ ను సెలబ్రిటీలు ఇగ్నోర్ చేస్తారు. కానీ మారుతి మాత్రం తనదైన స్టైల్ లో ఆ నెటిజన్ కు మాస్ రిప్లై ఇచ్చారు. ఇలాంటి లతుకోరు ప్రెడిక్షన్స్ చేస్తే నేను కూడా నిన్ను సేమ్ అలాగే చేస్తా అంటూ సెటైరికల్ గా కౌంటర్ వేశారు.

​మారుతి ఇచ్చిన ఈ రిప్లై చూసి మిగతా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంటే ఈ పాట కచ్చితంగా సినిమా మధ్యలోనే వస్తుందని, ఎండ్ టైటిల్స్ లో రాదని పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్లయింది. మారుతి కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఫ్యాన్స్ పల్స్ ను ఆయన బాగానే పట్టుకున్నారని అనిపిస్తోంది. అనవసరమైన ఊహలతో కంగారు పడొద్దని ఆయన చెప్పకనే చెప్పారు.

​ఒక్క ట్వీట్ తో అటు ఆ సాంగ్ మీద ఉన్న డౌట్స్ క్లియర్ అవ్వడమే కాకుండా, సినిమాపై బజ్ కూడా మరింత పెరిగింది. ప్రభాస్ ఫ్యాన్స్ తో డైరెక్టర్ ఇలా ఇంటరాక్ట్ అవ్వడం సినిమాకు ప్లస్ అవుతుంది. జనవరి 9న థియేటర్లలో ఈ సాంగ్ ఏ రేంజ్ లో మోత మోగిస్తుందో చూడాలి. మారుతి రిప్లైతో ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు ఫుల్ చిల్ అవుతున్నారు.

Tags:    

Similar News