మండలా మర్డర్స్ టాక్ ఏంటి..?
బాలీవుడ్ వెబ్ సీరీస్ లు కొన్ని క్రైం థ్రిల్లర్స్ జోనర్ లో అత్యద్భుతంగా ఉంటాయి.;
బాలీవుడ్ వెబ్ సీరీస్ లు కొన్ని క్రైం థ్రిల్లర్స్ జోనర్ లో అత్యద్భుతంగా ఉంటాయి. ఒక సీజన్ మొదలు పెట్టడమే ఆలస్యం వాటికి సీక్వెల్స్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలాంటి వెబ్ సీరీస్ లకు భారీ డిమాండ్ ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ లో కొత్తగా అలాంటి ఆసక్తికరమైన వెబ్ సీరీస్ వచ్చింది. అదే మండలా మర్డర్స్. నెట్ ఫ్లిక్స్ లో శుక్రవారం రిలీజైన ఈ వెబ్ సీరీస్ 8 ఎపిసోడ్స్ తో ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల డ్యూరేషన్ తో వచ్చింది.
ఇంతకీ ఏంటి మండలా మర్డర్స్ స్టోరీ అంటే.. చరణ్ దాస్ పూర్ సిటీలో జరిగిన దారుణ హత్యలు సంచలనం సృష్టిస్తాయి. CIB ఏజెంట్ రియా థామస్ (వాణి కపూర్) తో పాటు సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ విక్రమ్ సింగ్ (వైభవ్ రాజ్ గుప్తా) కలిసి ఈ మిస్టరీని చేధించాలని చూస్తారు. ఐతే వారు లోతుగా దిగుతున్నా కొద్దీ సంచలన విషయాలు తెలుస్తాయి.. ఐతే మర్డర్స్ వెనక ఉన్న రహస్యాలు ఏంటి అసలు ఇవి ఎవరు ఎందుకు ఎలా చేశారన్నది ఈ సీరీస్ కథాంశం.
హత్యలు.. రహస్యాయలతో కూడిన మిస్టరీలు.. పోలీస్ విచారణలు ఇలా ఇలాంటి అంశాలతోనే మండలా మర్డర్స్ వచ్చింది. ఐతే అన్నిటికన్నా ఇది కాస్త డీప్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. 8 ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ సీరీస్ లో కొన్ని ఎపిసోడ్స్ ఆకట్టుకున్నాయి. ఐతే మిగతా కొన్ని ఎపిసోడ్స్ మాత్రం ఆశించిన విధంగా ఉండవు. అంతేకాదు సీరీస్ డెప్త్ వెళ్తున్నా కొద్దీ ఆడియన్స్ ఎగ్జైట్ అవ్వాలి కానీ అది ఇందులో అంతగా ఉండదు.
పురాతన రహస్యాలు, మెంటల్ కాన్ స్పిరసీ ల గురించి ఇందులో చూపించారు. ఐతే సీరీస్ లో కొన్ని చోట్ల ఆడియన్స్ ని ఎంగేజ్ చేయగలిగిన మేకర్స్ కొన్ని చోట్ల ల్యాగ్ అయినట్టుగా అనిపిస్తుంది.
వాణి కపూర్ చేసిన తొలి వెబ్ సీరీస్ ఇది. రియా పాత్రకు ఆమె న్యాయం చేసింది. సీరీస్ లో వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా, శ్రియ పిల్గావ్‌కర్ కూడా తమ పాత్రల్లో మెప్పించారు. గోపీ పుత్రన్, మనన్ రావత్ కలిసి ఈ సీరీస్ డైరెక్ట్ చేశారు. ఈ సీరీస్ ని యష్ రాజ్ ఫిలింస్ నిర్మించారు. మీరు అద్భుతాన్ని నమ్ముతారా అంటూ ప్రమోషనల్ కంటెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ వల్ల ఓటీటీ ఆడియన్స్ ఈ సీరీస్ మీద కొంత ఆసక్తి చూపించారు. ఐతే ఒక సీరీస్ కి ఈ రేంజ్ బడ్జెట్, విజువల్స్ ఇవ్వడం మాత్రం ఆకట్టుకుంటుంది.
వెబ్ సీరీస్ లవర్స్ కి.. క్రైం, అడ్వెంచర్ సీరీస్ లు ఇష్టపడే వారికి ఇది నచ్చే అవకాశం ఉంది. ఐతే సీరీస్ లో కొంత భాగం ఆడియన్స్ ని అలరించేలా ఉన్నా కొంత భాగం మాత్రం సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.