ఆ హీరోయిన్ వరుస ఆఫర్లతో ఎక్కడా తగ్గట్లేదుగా
సినీ ఇండస్ట్రీలో ఎవరికెప్పుడు అదృష్టం కలిసొస్తుందో ఎవరూ చెప్పలేం. అందుకే ఇండస్ట్రీలో ప్రతీ వారం స్టార్లు మారుతూ ఉంటారని.;
సినీ ఇండస్ట్రీలో ఎవరికెప్పుడు అదృష్టం కలిసొస్తుందో ఎవరూ చెప్పలేం. అందుకే ఇండస్ట్రీలో ప్రతీ వారం స్టార్లు మారుతూ ఉంటారని. ఒక వారం ఒకరు విన్నర్ అయి స్టార్ గా నిలిస్తే, ఇంకోవారం ఇంకొకరు స్టార్ అవుతారు. ఎవరెప్పుడు, ఎలా స్టార్లుగా మారతారనేది ఎవరూ ఊహించలేం. అలా ప్రేమలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఆ సినిమాలో నటించిన మమిత బైజు.
ప్రేమలు సినిమా తర్వాత మమిత క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ సినిమా కంటే ముందు మమిత మలయాళంలో పలు సినిమాలు చేసినప్పటికీ వాటన్నింటితో రాని క్రేజ్ ప్రేమలు సినిమాతో వచ్చింది. కేవలం మలయాళంలో కాకుండా ఆ సినిమా రిలీజైన ప్రతీ భాషలోనూ అమ్మడికి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అందులో భాగంగానే మమితకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
అమ్మడు కూడా క్రేజ్ ఉన్నప్పుడే వరుస పెట్టి సినిమాలు చేయాలనే ఉద్దేశంతో తనకు వచ్చిన ఆఫర్లలో ది బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్లో ముందుకు దూసుకెళ్తుంది. ప్రేమలు సినిమా మమిత కెరీర్ ను ఎంతగా మార్చిందంటే ఆ సినిమా తర్వాత ఏకంగా తనకు సూర్య, విజయ్ లాంటి హీరోలతో నటించే ఛాన్సులు తెచ్చి పెట్టేంత. విజయ్ నటిస్తున్న ఆఖరి సినిమా జన నాయగన్ లో మమిత కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తోన్న సూర్య46లో ఏకంగా సూర్య సరసన నటిస్తోంది. వీటితో పాటూ ప్రదీప్ రంగనాథన్ తో కలిసి డ్యూడ్ సినిమా చేస్తోంది. ఆల్రెడీ చేస్తున్న ఇరండు వానం రిలీజ్ కు రెడీ అయింది. ఇక రీసెంట్ గా ప్రేమలు సినిమాలో అమూల్ డెవిస్ పాత్రలో కనిపించిన సంగీత్ ప్రతాప్ తో కలిసి ఓ సినిమా చేయడానికి మమిత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మమిత. ఈ సినిమా పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రంగా రాబోతుంది. ప్రేమలు తర్వాత మలయాళ, తమిళ సినిమాల్లో బాగా బిజీగా మారిన మమిత, సూర్య46 తర్వాత తెలుగు లో కూడా బిజీ అయ్యే అవకాశాలున్నాయి.