మరో చిన్న సినిమా పెద్ద విజయం

ఒకప్పుడు పెద్ద సినిమాలు మాత్రమే భారీ విజయాలను సొంతం చేసుకుంటూ ఉండేవి.;

Update: 2025-06-03 06:30 GMT

ఒకప్పుడు పెద్ద సినిమాలు మాత్రమే భారీ విజయాలను సొంతం చేసుకుంటూ ఉండేవి. వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమాలు మాత్రమే ఆ స్థాయి వసూళ్లు సాధిస్తాయి అనే అభిప్రాయం ఉంది. కానీ చిన్న బడ్జెట్‌ సినిమాలు సైతం వందల కోట్ల వసూళ్లు దక్కించుకుంటున్న దాఖలాలు ఉన్నాయి. తెలుగు భాషలో గత ఏడాది వచ్చిన రెండు చిన్న సినిమాలు దాదాపు వంద కోట్లు, అంతకు మించి వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే. కేవలం తెలుగు భాషలోనే కాకుండా మలయాళ, తమిళ్ భాషల నుంచి వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా 'మామన్‌' సినిమా తమిళ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది.

కోలీవుడ్‌లో సూరి హీరోగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా ప్రశాంత్‌ పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రాజ్‌ కిరణ్‌, ్వాసిక, బాల శరవణన్‌, బాబా భాస్కర్‌, విజి చంద్రశేఖర్‌, నిఖిలా శంకర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా మొదటి రెండు వారాలు పూర్తి అయ్యేప్పటికి దాదాపుగా రూ.50 కోట్ల వసూళ్లు సాధించింది. కేవలం తమిళ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాధించిన వసూళ్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇదే సినిమా వేరే భాషల్లోనూ విడుదల చేసి ఉంటే కచ్చితంగా మరింత భారీ వసూళ్లు నమోదు అయ్యేవి అని, వంద కోట్ల క్లబ్‌లోనూ ఈ సినిమా చేరి ఉండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సూరి గత చిత్రాలు విడుదలై పార్ట్‌ 1, విడుదలై పార్ట్‌ 2 , గరుడన్‌ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు మరో సినిమా తో సూరి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మామన్‌ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను చక్కగా చూపించడంతో పాటు, అన్ని విధాలుగా డ్రామాను పండించడంలో సక్సెస్‌ అయ్యారు. ఆకట్టుకునే కథ, కథనంతో సినిమాను తీసి, దానికి తగ్గట్లుగా మంచి నటీనటులను ఎంపిక చేసుకుంటే కచ్చితంగా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విషయం నిరూపితం అయ్యింది. మామన్‌ సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది.

ఇటీవల చిన్న చిత్రంగా వచ్చిన 'టూరిస్ట్‌ ఫ్యామిలీ' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.50 కోట్లకు పైగా వసూళ్లు చేసిన టూరిస్ట్‌ ఫ్యామిలీ సినిమా గురించి ఇంకా మాట్లాడుకుంటూ ఉండగానే మరో వైపు మామన్‌ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ సినిమాలకు ఉన్న స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. పెద్దగా స్టార్‌ కాస్ట్‌ లేకున్నా వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న సినిమాలు ఈ మధ్య తరచూ వస్తున్నాయి. మమాన్‌ సినిమా హిట్ టాక్‌ నేపథ్యంలో తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం అంతా వెయిట్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News