మన దగ్గర కంటే అక్కడే ఎక్కువ వస్తోందా?
దీంతో చాలా వరకు పెద్ద సినిమాల నుంచి చిన్న చిత్రాల వరకు అదనపు ఆదాయాన్ని దక్కించుకుంటున్నాయి. స్టార్స్ కూడా భారీ స్థాయిలో పారితోశికాలు కూడా పెంచేశారు.;
`బాహుబలి` తరువాత టాలీవుడ్ సినిమాల బడ్జెట్‌తో పాటు మార్కెట్ స్థాయి కూడా పెరిగింది. మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే బాలీవుడ్‌లో రిలీజ్ చేయాలని, శాటిలైట్ రైట్స్‌ని దక్కించుకోవాలని ఉత్తరాదికి చెందిన మేకర్స్ చాలా వరకు ప్రయత్నాలు చేస్తుంటారు. భారీ స్థాయిలో రైట్స్ కోసం ఆఫర్ చేస్తుంటారు. దీంతో చాలా వరకు పెద్ద సినిమాల నుంచి చిన్న చిత్రాల వరకు అదనపు ఆదాయాన్ని దక్కించుకుంటున్నాయి. స్టార్స్ కూడా భారీ స్థాయిలో పారితోశికాలు కూడా పెంచేశారు.
నిర్మాతలు కూడా పెరిగిన మార్కెట్‌కు తగ్గట్టుగా లాభాల్ని దక్కించుకుంటున్నారు. అయితే అందులో కొంత వరకే నిజముందనే విధంగా యంగ్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాసు స్టేట్మెంట్ ఉండటం టాలీవుడ్ మేకర్స్‌ని షాక్‌కు గురి చేస్తోంది. సక్సెస్ ఫుల్ సినిమాకు మన దగ్గర వచ్చే రెవెన్యూ కంటే మలయాళంలో వచ్చే రెవెన్యూనే ఎక్కువ అంటున్నారు బన్నివాసు. అదెలా? దాని వెనకున్న లెక్కలేంటీ? అనే చర్చ ఇప్పుడు మొదలైంది. మలయాళ స్టార్ టొవినో థామస్ నటించిన 57వ మూవీ `పళ్లిచట్టంబి`.
డిజో సోస్ ఆంటోనీ దర్శకుడు. కయాదు లోహర్ కథానాయికగా నటించింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీని ఏప్రిల్ 9న మలయాళంతో పాటు తెలుగులోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రెస్‌మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత బన్నీ వాసు ఆసక్తికర విషయాల్ని వెల్లడించి అందరిని షాక్‌కు గురి చేశారు. తెలుగులో విజయవంతమైన సినిమా ద్వారా నిర్మాతకు దక్కుతున్న రెవెన్యూ తక్కువే అన్నారు.
మలయాళంలో సినిమా అంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా అనుకుంటాం. కానీ `పళ్లిచట్టంబి` ఒక బారీ కమర్షియల్ సినిమా. తెలుగులో పెద్ద విజయాన్ని సాధిస్తుంది. మలయాళం ఇండస్ట్రీలో చిత్ర నిర్మాణం కున్న కంఫర్ట్ తెలుగులో లేదు. ఎందుకంటే తెలుగులో ఒక మూవీ సక్సెస్ అయితే వచ్చే ఆదాయం కన్నా మలయాళంలో ఒక మూవీ సక్సెస్ అయితే వచ్చే ఆదాయం ఎక్కువ. మలయాళంలో వచ్చినన్ని థియేట్రికల్ రెవెన్యూస్ మన తెలుగులో రావడం లేదు` అన్నారు. బన్నీ వాసు పదే పదే ఆ మాటలు చెప్పడానికి ప్రధాన కారణం బడ్జెట్, వర్కింగ్ డేస్.
తెలుగులో ఏ చిన్న సినిమా తీసుకున్నా బడ్జెట్, వర్కింగ్ డేస్ ఎక్కువే. కానీ మలయాళంలో మాత్రం ఈ రెండూ కంట్రోల్‌లో ఉంటాయి. ఎంత బడ్జెట్ పెట్టి తీయాలో అంతే పెడతారు. ఎన్ని రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేయాలో అన్ని రోజుల్లోనే తీస్తారు. కాబట్టి మలయాళ సినిమాలు రిలీజ్‌కు ముందే ప్రాఫిట్‌లో బడ్జెట్ ఫ్లెండ్లీగా ఉంటాయి. దాంతో అక్కడి వారికి లాభాలని తెచ్చి పెడతాయి. కానీ తెలుగు సినిమాలు అలా కాదు. అందుకే ఇక్కడి సినిమాలతో పోలిస్తే అక్కడి సినిమాలకు వచ్చే లాభాలు ఎక్కువ. మరి మలయాళ మేకర్స్‌ని చూసైనా మన వాళ్లు చిన్న చిత్రాలని 25 రోజుల్లో పూర్తి చేస్తారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.