హీరోయిన్సా మజాకా.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన ఓనం శారీస్ !
కేరళ క్యాలెండర్ ప్రకారం వచ్చే తొలి మాసంలో జరుపుకునే అతిపెద్ద వ్యవసాయ పండుగ ఈ ఓనం. నిజానికి ఈ ఓనం సెలబ్రేషన్స్ ఎక్కువగా మలయాళీలు జరుపుకుంటారన్న విషయం తెలిసిందే.;
కేరళ క్యాలెండర్ ప్రకారం వచ్చే తొలి మాసంలో జరుపుకునే అతిపెద్ద వ్యవసాయ పండుగ ఈ ఓనం. నిజానికి ఈ ఓనం సెలబ్రేషన్స్ ఎక్కువగా మలయాళీలు జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. అంతేకాదు సాంప్రదాయ చీరలలో కనిపించి అందరిని అలరించేవారు. కానీ ట్రెండ్ మారుతోంది.కాలం మారుతున్న కొద్ది ట్రెండ్ కి అనుగుణంగా హీరోయిన్స్ కూడా ఫాలో అవుతున్నారు. అందులో భాగంగానే ఓనం స్పెషల్ సందర్భంగా.. ఎప్పుడు లేని విధంగా కసవు శారీస్ సరికొత్త ఇమేజ్ ను దక్కించుకోవడమే కాకుండా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కూడా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఈ సాంప్రదాయ చీరలను ఇప్పుడు హీరోయిన్స్ ధరించడంతో మరింత హాట్ గా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. మరి ఈ ఓనమ్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఎవరెవరు ఎలాంటి ఫోటోలు షేర్ చేశారో ఇప్పుడు చూద్దాం.
తాజాగా మోహన్ లాల్ తో కలిసి 'హృదయపూర్వం' అనే సినిమాలో నటించగా.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా అందించిన సక్సెస్ తో ఈసారి ఓనం సెలబ్రేషన్స్ ను మరింత సంతోషంగా జరుపుకుంది మాళవిక మోహనన్. అందులో భాగంగానే సాంప్రదాయ కసవు శారీ ధరించి.. ముత్యాల హారంతో తన లుక్ ను మరింత అందంగా మార్చుకుంది. ఇక ఈమె ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ది రాజా సాబ్' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.
'మ్యాడ్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అనంతిక సనీల్ కుమార్ '8 వసంతాలు' సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన టాలెంట్ ను ప్రదర్శించి అందరిని అబ్బురపరిచింది. ఇప్పుడు ఓనం సెలబ్రేషన్స్ లో భాగంగా తన అందాన్ని మరింత ఎలివేట్ చేస్తూ సాంప్రదాయ చీరలో తళుక్కుమని మెరిసింది ఈ ముద్దుగుమ్మ.
అభిమానులకు హృదయపూర్వక ఓనం శుభాకాంక్షలు పంచుకుంటూ.. కసవు శారీలో మరింత అందంగా కనిపించింది కృతి శెట్టి. ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న ఈమె మరొకవైపు సాంప్రదాయ చీరలో కనిపించి కుర్రకారుకు చెమటలు పట్టించింది.
వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈమె మరొకవైపు ఓనం పండుగను ప్రత్యేకంగా జరుపుకుంది. అందులో భాగంగానే స్పెషల్ గా ఓనం చీరను ధరించి తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంది.
యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన మౌని రాయ్ కూడా ఓనమ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఇందులో కసవు చీర ధరించి హాట్ ఫోజులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేశారు.
ఓనం ఫెస్టివల్ ను మరింత ఆకర్షణీయంగా, సాంప్రదాయంగా మార్చి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు నభా నటేష్.
సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. మలయాళం లో లీడ్ రోల్ పోషిస్తూ తాజాగా నటించిన చిత్రం 'లోక చాప్టర్ వన్ చంద్ర'. ఈ సినిమా తెలుగులో కొత్తలోక అంటూ విడుదలై సక్సెస్ టాకుతో దూసుకుపోతోంది. ఈ సినిమా అందించిన విజయంతో ఇప్పుడు ఓనం సెలబ్రేషన్స్ మరింత సక్సెస్ఫుల్గా జరుపుకుంది కళ్యాణి ప్రియదర్శన్.
ఇక వీరంతా కూడా ఇలా సాంప్రదాయమైన కసవు చీరలో కనిపించి, ఆ చీరలకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. అంతేకాదు మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఈ కసవు చీరలు కూడా మరింత హాట్ గా కనిపిస్తున్నాయని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.