మాళవికా మోహనన్ గ్లామరస్ ఫోజులు.. కొత్త ఫోటోషూట్‌తో ఇంటర్నెట్‌లో హల్‌చల్!

పాన్ ఇండియా నటి మాళవికా మోహనన్ తన సరికొత్త గ్లామరస్ ఫొటోషూట్‌తో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది.

Update: 2026-08-18 10:56 GMT

పాన్ ఇండియా నటి మాళవికా మోహనన్ తన సరికొత్త గ్లామరస్ ఫొటోషూట్‌తో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఎల్లప్పుడూ క్లాసీ, స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకునే ఈ భామ, తాజాగా పంచుకున్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కళ్ళు మూసుకుని, చిరునవ్వులు చిందిస్తూ, జుట్టును నెమ్మదిగా సవరిస్తూ ఆమె ఇచ్చిన పోజులు కుర్రకారు హృదయాలను కొల్లగొడుతున్నాయి. ప్రకృతి ఒడిలో ఆమె మెరిసిపోతున్న తీరును చూసి అభిమానులు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.




 


సరికొత్త డ్రెస్సింగ్ స్టైల్ తో మెరుపులు:

ఈ ఫోటోషూట్‌లో మాళవికా ఎంతో సింపుల్‌గా, ట్రెండీగా కనిపించారు. వి-నెక్‌లైన్‌ కలిగిన వైట్ రిబ్బెడ్ క్లాసిక్ క్రాప్ టాప్‌కు తోడుగా, నలుపు మరియు తెలుపు రంగుల నిలువు గీతలు ఉన్న హై-వేస్ట్ వైడ్-లెగ్ ట్రౌజర్స్ ధరించారు. ఇక పచ్చని చెట్లు, విశాలమైన ఆకాశం నేపథ్యంలో ఆమె ఇచ్చిన ఈ పోజులు విలేజ్ అండ్ రిసార్ట్ వైబ్స్‌ని ఇస్తూ ఫ్యాషన్‌ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.




 


ప్రయాణాలపై ఉన్న ప్రేమను పంచుకున్న నటి:

ఈ వెకేషన్ పిక్స్‌ను షేర్ చేస్తూ మాళవిక ఒక భావోద్వేగమైన క్యాప్షన్ కూడా ఇచ్చారు. "నాకు ఎప్పుడూ ప్రయాణాలంటే చాలా ఇష్టం. కేవలం విశ్రాంతి కోసమే కాదు, సరికొత్త ప్రాంతాలకు వెళ్లడం, కొత్త సంస్కృతులను తెలుసుకోవడం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఒక కొత్త ప్రదేశంలో అడుగుపెట్టి ప్రపంచాన్ని వేరే కోణంలో చూసినప్పుడు నాలో ఎంతో జీవం వచ్చినట్లు అనిపిస్తుంది" అని ఆమె తెలిపారు.




 


మలయాళం నుంచి పాన్ ఇండియా స్థాయికి:

2013లో దుల్కర్ సల్మాన్ సరసన 'పట్టం పోల్' సినిమాతో కెరీర్ ప్రారంభించిన మాళవిక, అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మాజిద్ మజీది దర్శకత్వంలో వచ్చిన 'బియాండ్ ది క్లౌడ్స్' ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత రజనీకాంత్‌తో 'పేట్ట', విజయ్‌తో 'మాస్టర్', విక్రమ్‌తో 'తంగలాన్', అలాగే మోహన్‌లాల్‌తో 'హృదయపూర్వం' ఇక తెలుగు లో ప్రభాస్ తో మోస్ట్ అవైటెడ్ హారర్-కామెడీ 'ది రాజాసాబ్' తో చిత్రాలలో నటించి తన సత్తా చాటుకున్నారు.




 


చేతినిండా క్రేజీ ప్రాజెక్టులు:

ప్రస్తుతం మాళవికా మోహనన్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. పాటు తమిళంలో కార్తీతో 'సర్దార్ 2', విజయ్ సేతుపతితో 'పాకెట్ నావెల్' చిత్రాల్లో నటిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను మరింత బలోపేతం చేసుకుంటున్నారు.




 


తన అద్భుతమైన నటనతో పాటు స్టైలిష్ లుక్స్‌తో అలరించే మాళవికా మోహనన్, టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో వరుస అవకాశాలు సాధిస్తూ దూసుకుపోతున్నారు. రాబోయే రోజుల్లో సర్దార్ 2 వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ఆమె మరిన్ని భారీ విజయాలను అందుకోవాలని ఆశిద్దాం.

Tags:    

Similar News