స్టార్ హీరో కిందపడి మరి నవ్వేసిన ఏకైక ఘటన!
బాలీవుడ్ చరిత్రలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించిన యాక్షన్-కామెడీ డ్రామా `మై హూ నా` విడుదలై దశాబ్దాలు గడుస్తున్నా? ఆ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విశేషాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.
బాలీవుడ్ చరిత్రలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించిన యాక్షన్-కామెడీ డ్రామా `మై హూ నా` విడుదలై దశాబ్దాలు గడుస్తున్నా? ఆ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విశేషాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించడమే కాకుండా ఐకానిక్ యాక్షన్ సీక్వెన్స్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అయితే ఈ భారీ యాక్షన్ చిత్రం వెనుక ఉన్న కొన్ని తెర వెనుక హాస్య సంఘటనలను ఫరా ఖాన్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
చిత్రంలోని ప్రధానమైన స్టంట్ సీన్ చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ పొరపాటు గురించి ఫరా ఖాన్ వివ రించారు. సినిమాలో హీరోగా నటించిన సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, విలన్ల నుండి ఒక హెలికాప్టర్‌లో తప్పించుకునే క్రమంలో గాలిలో వేలాడాల్సిన ఓ హై-ఆక్టేన్ యాక్షన్ బ్లాక్‌ను ప్లాన్ చేశారు. ఈ స్టంట్ కోసం విదేశీ సాంకేతిక నిపు ణులను, భారీ క్రేన్లను కూడా రప్పించారు. అయితే ఎంతో సీరియస్‌గా ప్లాన్ చేసిన ఆ యాక్షన్ కాస్తా చివరకు హాస్య ప్రహసనంగా మారిపోయిందన్నారు.
సాధారణంగా ఇలాంటి క్లిష్టమైన స్టంట్స్ చేసేటప్పుడు డూప్‌లను వాడుతుంటారు. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్‌కు బదులుగా ఓ విదేశీ స్టంట్ మాస్టర్‌ను ఆ సీన్ కోసం సిద్ధం చేశారు. కానీ షూటింగ్ ప్రారంభమైన కాసేపటికే సదరు స్టం ట్ మాస్టర్ వైరింగ్ గందరగోళం కారణంగా గాల్లో సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయాడు. ఆ సీన్ తో అద్భుతమైన యాక్షన్ మూమెంట్ వస్తుందని ఆశించిన చిత్ర యూనిట్ మొత్తానికి ఆ స్టంట్ మాస్టర్ గాల్లో విచిత్రమైన భంగిమల్లో ఊగిసలాడటం చూసి ఏం చేయాలో? పాలుపోలేదు.
ఆ సమయంలో సెట్స్‌లోనే ఉన్న షారుఖ్, విదేశీ స్టంట్ మాస్టర్ పడుతున్న ఇబ్బందిని చూసి అస్సలు తట్టుకోలే కపోయారు. సినిమాలోని సీరియస్ వాతావరణాన్ని మర్చిపోయి ఆ దృశ్యాన్ని చూస్తూ షారుక్ సెట్ లోనే కిందపడి దొర్లి దొర్లి నవ్వడం ప్రారంభించారు. షారుఖ్ అంతలా నవ్వడం చూసి దర్శకురాలు ఫరా ఖాన్ మిగిలిన క్రూ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. ఎంతో సీరియస్ గా సాగాల్సిన యాక్షన్ ఎపిసోడ్ కాస్తా షూటింగ్ సెట్‌ను నవ్వుల క్లబ్‌గా మార్చేసింది.
ఆ ప్రమాదకరమైన స్టంట్ తర్వాత ఫరా ఖాన్ తన వ్యూహాన్ని మార్చుకున్నారు. సాంకేతిక లోపాలు, డూప్‌ల సమస్యల కంటే నటుల సహజ సిద్ధమైన ప్రతిభనే నమ్ముకోవాలని నిర్ణయించారు. పెద్ద పెద్ద రిస్క్‌లు తీసుకునే కంటే యాక్షన్‌ను ఎమోషన్‌తో ..షారుఖ్ ఖాన్ స్వయంగా చేయగలిగేలా కొన్ని సులువైన షాట్స్‌తో ఆ సీక్వెన్స్‌ను రీ-డిజైన్ చేశారు. సినిమా విజయం అంటే? తెరపై కనిపించే నటన మాత్రమే కాదు. తెరవెనుక ఉండే నటీనటులు, దర్శకుల మధ్య ఉండే బలమైన బంధం. పని పట్ల ఉండే స్వేచ్ఛపై కూడా ఆధారపడి ఉంటుందని ఈ సంఘటన నిరూపించింది. షారుఖ్ ఖాన్, ఫరా ఖాన్‌ల మధ్య ఉన్న స్నేహం వల్లనే ఇలాంటి ఒత్తిడితో కూడిన పరిస్థితులను కూడా ఎంతో సరదాగా దాటగలిగారు. అందుకే `మై హూ నా` వంటి కల్ట్ క్లాసిక్ చిత్రం దశాబ్దాల తర్వాత కూడా సినీ ప్రేమికుల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోయింది.