మహేష్ సంక్రాంతి అంతా బుర్రిపాలెంలోనే!
సెలబ్రిటీలంతా సంక్రాంతి సంబురాల్లో మునిగిపోయారు. మెగా-అల్లు ఫ్యామిలీలో బెంగుళూరు ఫామ్ హౌసై్ లో ఇప్పటికే గ్రాండ్ గా సెలబ్రేషన్లు షురు చేసేసారు.
సెలబ్రిటీలంతా సంక్రాంతి సంబురాల్లో మునిగిపోయారు. మెగా-అల్లు ఫ్యామిలీలో బెంగుళూరు ఫామ్ హౌసై్ లో ఇప్పటికే గ్రాండ్ గా సెలబ్రేషన్లు షురు చేసేసారు. ఇక మిగతా వారంతా హైదరాబాద్ లోని సొంత ఇళ్లలో నే వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొచ్చేది బాల్యం. చిన్నతనంలో సంక్రాంతి ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నామనేది హైలైట్ అవుతుంది. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు తమ సెలబ్రేషన్ల గురించి గుర్తు చేసుకున్నారు.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ కూడా ఆ మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఆవేంటో ఆయన మాటల్లో నే.. `సంక్రాంతి పండుగ అంటే ఎంతో ప్రత్యేకం నాకు. నా చిన్నతనంలో నాన్న సినిమాలతో ఎంత సమయం లేకపోయినా పండగ వచ్చిందంటే చాలు మమ్మల్ని అందర్ని సొంతూరు బుర్రిపాలెం తీసుకెళ్లిపోయేవారు. అక్కడ ఆయనతో ఇప్పటికీ గుర్తే. ఆ తర్వాత సంక్రాంతి అంటేనే గుర్తొచ్చేది సినిమానే.
ప్రతీ పండక్కి నా న్నది ఏదో ఒక చిత్రం రిలీజ్ అయ్యేది. మేమంతా థియేటర్ కి వెళ్లి చూసేవాళ్లం. ఆ తర్వా త నేను హీరో అయ్యాక నా సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవ్వడం మొదలైంది. అప్పటి నా సినిమాల సరదా మొదలైంది` అని అన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి మహేష్ నటించిన` గుంటూరు కారం` ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి డివైడ్ టాక్ వస్తోంది. మరి ఫుల్ రన్ లో ఈ సినిమా ఎంత వసూళ్లు సాధిస్తుంది అన్నది చూడాలి.
ఇదే ఏడాది మహేష్-రాజమౌళి సినిమా కూడా పట్టాలెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ పాన్ ఇండియా సినిమాకి సంబంధించి స్టోరీ రెడీ అవుతుంది. ఈసినిమాపై ఎలాంటి అంచనాలు నెలకొంటు న్నా యో చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి ..ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా విజయాల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ నే షేక్ చేసే ప్లాన్ తో జక్కన్న అండ్ కో దిగుతున్నట్లు తెలుస్తుంది.