వారణాసి నుంచి బిగ్ న్యూస్ వైరల్.. ఆ 15 నిమిషాల సీక్వెన్స్ పై ఊహించని క్రేజ్!

ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవేటెడ్ మూవీ ఏది అంటే.. ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు 'వారణాసి'.

Update: 2026-05-25 10:51 GMT

ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవేటెడ్ మూవీ ఏది అంటే.. ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు 'వారణాసి'. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సినిమాలో వచ్చే ఒక ప్రత్యేకమైన సీక్వెన్స్ గురించిన వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఆ విశేషాలు చూద్దాం.

జక్కన్న మార్క్ గ్లోబల్ అడ్వెంచర్:

'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన రాజమౌళి, 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో ఆస్కార్ సాధించి హిస్టరీ క్రియేట్ చేశారు. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న 'వారణాసి'ని అంతకు మించిన హాలీవుడ్ రేంజ్ కంటెంట్‌తో ప్లాన్ చేస్తున్నారు. ఇక శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటం విశేషం.

15 నిమిషాల శ్రీరాముడి సీక్వెన్స్:

ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మహేష్ బాబుపై ఒక 15 నిమిషాల పాటు సాగే శ్రీరాముని సీక్వెన్స్ ఉండబోతోందట. ఇండియన్ వెండితెరపై ఇప్పటివరకు ఎవరూ చూడని విధంగా, అత్యంత అద్భుతమైన పౌరాణిక సినీ అనుభవాన్ని ఇచ్చేలా జక్కన్న ఈ ఎపిసోడ్‌ను డిజైన్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ వార్త బయటకు రావడంతోనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా మొదలుపెట్టేశారు.

వెండితెరపై పూనకాలే ఇక:

మహేష్ బాబును స్క్రీన్ పై శ్రీరాముడి గెటప్‌లో, అది కూడా రాజమౌళి విజన్ లో చూడటం అంటే ఫ్యాన్స్‌కు థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం. అసలే మహేష్ బాబు పర్ఫెక్ట్ కటౌట్, దానికి తోడు జక్కన్న గ్రాఫిక్స్, టేకింగ్ తోడైతే ఆ 15 నిమిషాల సీన్ థియేటర్లను షేక్ చేయడం గ్యారెంటీ. ఇక ఈ ఒక్క అప్‌డేట్‌తో సినిమాపై ఇంటర్నేషనల్ లెవెల్‌లో క్రేజ్ వందరెట్లు పెరిగిపోయింది.

రాజమౌళి సినిమా అంటే ప్రతి సీన్‌ కూడా ఒక విజువల్ అద్భుతంలా అనిపిస్తుంది. అలాంటిది మహేష్ బాబుతో 1300 కోట్ల బడ్జెట్, పైగా శ్రీరాముడి సీక్వెన్స్ అంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇక ఈ క్రేజీ ఎపిసోడ్ గురించిన మరిన్ని వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News