వెయ్యి కోట్ల నుంచి మహేష్ దిగుతాడా?
మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న ‘వారణాసి’ ఆయన కెరీర్‌లోనే అతి పెద్ద సినిమా.
మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న ‘వారణాసి’ ఆయన కెరీర్‌లోనే అతి పెద్ద సినిమా. రాజమౌళి దర్శకత్వం, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ ప్లాన్, వెయ్యి కోట్లకు పైగా భారీ బడ్జెట్, ఐమాక్స్ స్కేల్.. ఇలా ప్రతి విషయంలోనూ ఈ సినిమా మరో స్థాయిలో ఉంది. 2027 ఏప్రిల్ 7 రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘వారణాసి’ కోసం దాదాపు 50 భాషల్లో డబ్బింగ్ ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇది జస్ట్ పాన్ ఇండియా సినిమా కాదు, మహేష్‌ను గ్లోబల్ మార్కెట్‌లో పెట్టే ప్రాజెక్ట్‌గా రాజమౌళి తీసుకెళ్తున్నారు.
ఇలాంటి సినిమా తర్వాత మహేష్ నెక్స్ట్ ఎవరితో చేస్తాడన్నది హాట్ టాపిక్ గా మారుతోంది. సందీప్ రెడ్డి వంగా, బుచ్చిబాబు పేర్లు గతంలో వినిపించాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి పేరు గట్టిగా తిరుగుతోంది. 2028 సంక్రాంతికి సినిమా ప్లాన్ చేయొచ్చనే టాక్ కూడా ఉంది. అయితే ఇప్పటివరకు ఇది అధికారికంగా ఫిక్స్ కాలేదు. కానీ మహేష్ అనిల్ కాంబినేషన్ మళ్లీ వస్తే మాత్రం.. సినిమా ఎప్పుడు అన్నది కాదు.. ఏ రేంజ్‌లో చేస్తారు అన్నదే.
‘వారణాసి’ బడ్జెట్ రూ.1000 కోట్లకు పైగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. మహేష్ కూడా ఈ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా కొత్త మార్కెట్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. అలాంటి టైమ్‌లో మళ్లీ రూ.100 - 150 కోట్లలో రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేయడానికి వస్తాడా? అనిల్ రావిపూడి ఇప్పటివరకు ఎక్కువగా సేఫ్ బడ్జెట్, కామెడీ, మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తోనే పెద్ద హిట్లు ఇచ్చాడు. రాజమౌళి స్థాయి కాన్వాస్‌లో సినిమా చేయాల్సిన అవసరం ఆయనకు ఇప్పటివరకు రాలేదు.
అయితే మహేష్‌కు అనిల్ కొత్త దర్శకుడు కాదు. ఇద్దరూ ‘సరిలేరు నీకెవ్వరు’ చేశారు. ఆ సినిమా తర్వాత మహేష్ స్వయంగా అనిల్‌తో మళ్లీ సినిమా చేస్తానని చెప్పాడు. అనిల్ ఎనర్జీ, వేగంగా సినిమా పూర్తి చేసే విధానం తనకు బాగా నచ్చిందని అప్పట్లో ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే ఈ కాంబినేషన్‌కు పాత కమిట్‌మెంట్ కూడా ఉంది.
ఇక్కడే అనిల్‌కు కూడా పెద్ద ఛాన్స్ ఉంటుంది. మహేష్‌ను ‘వారణాసి’ తర్వాత మళ్లీ పూర్తిగా లోకల్ కమర్షియల్ హీరోగా చూపిస్తే అది ఒక రకమైన సర్‌ప్రైజ్ అవుతుంది. లేక మహేష్ కొత్త మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని అనిల్ కూడా తన స్కేల్ పెంచుతాడా అన్నది చూడాలి. కామెడీ, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ వదలకుండా పెద్ద కాన్వాస్‌లో సినిమా చేయగలిగితే అది అనిల్ కెరీర్‌కే మరో జంప్ అవుతుంది.
నిజానికి ప్రతి రాజమౌళి సినిమా తర్వాత హీరో తప్పనిసరిగా మరో వెయ్యి కోట్ల సినిమా చేయాల్సిన రూల్ లేదు. కానీ ‘వారణాసి’ తర్వాత మహేష్ మీద వచ్చే అంచనాలు మాత్రం తక్కువగా ఉండవు. అందుకే అనిల్ రావిపూడితో సినిమా నిజంగా ఫిక్స్ అయితే కథ కంటే ముందే బడ్జెట్, స్కేల్, మార్కెట్ గురించి ప్రశ్నలు మొదలవుతాయి. మరి వారి ప్లాన్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.