థియేటర్ల రచ్చ - స్క్రీన్ షేరింగ్ ఇష్యూ!

సంక్రాంతి ..దసరా వంటి పెద్ద పండుగ సీజన్లలో మాత్రమే బాక్సాఫీస్ వద్ద థియేటర్ల కొరత, స్క్రీన్ల సర్దుబాటు సమస్యలు త‌లెత్తుంటాయ‌ని అంతా భావిస్తారు.

Update: 2026-08-25 11:13 GMT

సంక్రాంతి ..దసరా వంటి పెద్ద పండుగ సీజన్లలో మాత్రమే బాక్సాఫీస్ వద్ద థియేటర్ల కొరత, స్క్రీన్ల సర్దుబాటు సమస్యలు త‌లెత్తుంటాయ‌ని అంతా భావిస్తారు. కానీ ఎలాంటి ప్రత్యేక సెలవులు లేని సాధారణ రోజుల్లో కూడా అలాంటి రచ్చ మొదలుకావడం చర్చనీయాంశంగా మారింది . ఒకవైపు బాక్సాఫీస్ వద్ద `ఇరుముడి`సినిమా ఊహిం చని స్థాయిలో అద్భుతమైన వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తుండగా మరోవైపు భారీ అంచనాలున్న `టాక్సిక్` విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో స్క్రీన్ షేరింగ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

తొలి రోజు నుంచే `ఇరుముడి` చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సినిమాకి వ‌స్తోన్న‌ ఆదరణ చూసి థియేటర్ల యాజమాన్యాలు అదనపు స్క్రీన్లను కేటాయిస్తున్నారు. హౌస్‌ఫుల్ బోర్డులతో నడుస్తున్న చిత్రానికి డిమాండ్ తగ్గకపోవడంతో ఎగ్జిబిటర్లు ఇతర సినిమాల ప్రదర్శనలను తగ్గించి మరీ స్క్రీన్లను పెంచుతున్నారు. అయితే స‌రిగ్గా ఇదే సమయంలోనే రాబోతున్న `టాక్సిక్` ఎంట్రీ `ఇరుముడి` మేకర్స్‌కు, థియేటర్ యాజమా న్యాలకు సవాల్‌గా మారింది.

భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్‌తో రూపొందిన `టాక్సిక్` సినిమాకు కూడా భారీ స్థాయిలో థియేటర్లు అవసరం ఉంటాయి. ఇప్పటికే థియేటర్లలో రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతున్న `ఇరుముడి`ని పూర్తిగా పక్కన పెట్టడం సాధ్యం కాదు. అలా అని హైప్ ఉన్న `టాక్సిక్ ` కు తగినన్ని స్క్రీన్లు కేటాయించకుండా ఉండలేరు. ఈ పరిస్థితుల్లో రెండు సినిమాల మధ్య సమతుల్యత సాధించడం ఎగ్జిబిటర్లకు కత్తి మీద సాములా మారుతోంది.

సాధారణంగా పెద్ద సినిమాలు పోటీ పడినప్పుడు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పరస్పర చర్చల ద్వారా స్క్రీన్ల పంపకాలపై స్పష్టతకు వస్తుంటారు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. `ఇరుముడి` ఊపు చూస్తుంటే థియేటర్ల నుంచి తొలగించడం నిర్మాతలకు నష్టాన్ని తెచ్చిపెట్టొచ్చు. అదే సమయంలో `టాక్సిక్` క్రేజ్ రీత్యా దానికి తొలి రోజుల్లోనే భారీ ఓపెనింగ్స్ రాబట్టుకోవడానికి విపరీతమైన స్క్రీన్ కౌంట్ అవసరం. ఈ రెండు సినిమాల డిమాండ్ మధ్య ఏది ఎంత శాతం స్క్రీన్లను దక్కించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ఈ స్క్రీన్ షేరింగ్ వివాదం కేవలం సంఖ్యలకు సంబంధించినది మాత్రమే కాదు. థియేటర్ల మనుగడకు, కలెక్షన్ల ప్రవాహానికి సంబంధించిన కీలకమైన అంశం. ఒక సినిమా సక్సెస్ ఊపును కొన‌సాగిస్తున్న స‌మ‌యంలో మరో కొత్త భారీ సినిమాకు స్వాగతం పలకడం తెలుగు పరిశ్రమకు ఎప్పుడూ ఉండే సవాలే. అయితే సరైన ప్రణాళిక లేకపోతే రెండు సినిమాలు కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అంతా కలిసి ఏ సినిమాకు ఎంత శాతం స్క్రీన్లు కేటాయించాలనే దానిపై సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు.

Tags:    

Similar News